bigne
-
‘రంగస్థలి’ నాటిక పోటీలు ప్రారంభం
ఆకట్టుకున్న తొలిరోజు ప్రదర్శనలు నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని సాంస్కృతిక సంస్థ రంగస్థలి 37వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 19వ ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రకాష్‌నగర్‌లోని భువనచంద్ర టౌన్హాల్లో మూడు రోజుల పాటు నాటిక పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి తొలిప్రదర్శనగా గణేష్‌పాత్రో కళావేదికపై తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారు ‘ఆగ్రహం’ నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు కారణమవుతున్న పురుషులకు తగిన శిక్ష విధించేలా కుటుంబం నుంచి వెలివేయడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. రచయిత,దర్శకుడు గంగోత్రి సాయి, సినీనటి డి.సరోజ తదితరులు నాటికలో ప్రధానపాత్రలను పోషించారు. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కొలకలూరు శ్రియ ఆర్ట్స్ వారి ‘చాలు...ఇకచాలు’ నాటికలో కళ్లకు కట్టినట్టు చూపారు. మరో ప్రదర్శనలో విశాఖపట్నం లిఖితసాయి శ్రీక్రియేషన్స్ కళాకారులు రైతు స్వాభిమానం కథాంశంగా ‘మాకంటు ఓ రోజు’ నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రదర్శనలకు ముందుగా.. తొలుత కొత్త పద్మావతి, సాంబశివరావు దంపతులు జ్యోతి ప్రజ్వలనను గావించారు. ఈ సందర్భంగా సీనియర్ చిత్రకారులు నందిగం నాగయ్యను ఘనంగా సత్కరించగా.. సభలో సీనీ, నాటక కళాకారుడు కెఎస్డి సాయి, రంగస్థలి ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కపిలవాయి విజయకుమార్, గౌరవ అధ్యక్షుడు కె.వి.కె. రామారావు, అధ్యక్షులు కిలారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.డి.ఎస్. పాషా, అధ్యాపకులు కె.రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాటిక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.రామకోటేశ్వరరావు, ఎస్.బి. రమణ, ఎస్.వెంకటరెడ్డి వ్యవహరించారు. -
జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
నూజెండ్ల: మండలంలోని మారెళ్లవారి పాలెం గ్రామంలో వైఎస్సార్ జెఎస్ఆర్ ఎంపిఎల్ –5 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త జక్కిరెడ్డి చిన సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ మారెళ్ల పేరిరెడ్డి దివంగత నాయకులు జక్కిరెడ్డి సుబ్బారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ ట్రోఫీని ఆవిష్కరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పేరిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లనుంచి నిర్విరామంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. క్రీడాప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రెండు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతోపాటు వీక్షించేవారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన చిన్నసుబ్బారెడ్డికి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వందలాది మంది క్రీడాభిమానుల మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, మారెళ్ల నాగిరెడ్డి, గోవిందరెడ్డి, కమిటీ సభ్యులు గాదె నాగార్జున రెడ్డి, రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారెళ్లవారిపాలెం– తలార్లపల్లి జట్లు తలపడగా మరెళ్లవారిపాలెం జట్టు విజయం సాధించింది. -
ఖోఖో పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలను సోమవారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితోపాటు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కళాశాల పీడీ పీ గౌరీశంకర్ మాట్లాడుతూ ఖోఖో పోటీలు నాకౌట్, లీగల్ పద్ధతుల్లో జరుగుతాయని, యూనివర్సిటీ సెలక్షన్ ట్రైల్స్, లీగ్‌లు మంగళవారం నుంచి జరుగుతాయని చెప్పారు. టొర్నమెంట్లో వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా నాలుగు జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్ ఎన్వీ శ్రీనివాస్, వర్సిటీ అబ్జర్వర్ కోటేశ్వరరావు, సెలక్టర్లు, కళాశాల వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలు ప్రారంభం
బాపట్ల : క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మరాజు కోరారు. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామంలో వేగేశన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలను సోమవారం ఆట్టహాసంగా ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన జట్లును పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామపెద్దకాపు కోటా శ్రీరామిరెడ్డి, పెద్ది సుబ్రమణ్యం, కోటా వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్నాటి వీరారాధనోత్సవాలు ప్రారంభం
కారంపూడి: పల్నాటి వీరారాధనోత్సవాలు సోమవారం కారంపూడిలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచనగా పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ వీరులగుడి ముఖద్వారంపై ఎర్రజెండాను ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరాచార, వీర విద్యావంతులు ఉత్సవ కేంద్రానికి తరలి వస్తున్నారు. వారితోపాటు తీసుకొచ్చిన ఆయుధాలు నిధి మీదకు వస్తున్నాయి. ఆయుధాలను నాగులేరు గంగధారిలో శుభ్రపరచి అలంకారాలు చేశారు. అనంతరం వచ్చిన వారంతా ఊరేగింపుగా పీఠాధిపతి ఇంటికి వెళ్లి ఆయనను వీరులగుడికి తీసుకొచ్చారు. బ్రహ్మనాయుడు ఆయుధం నృరసింహకుంతం ముందు పీఠాధిపతి ఆశీనుడయ్యారు. అనంతరం గుడి ముఖద్వారంపై జెండా ప్రతిష్టించారు. పల్నాటి యుద్ధంలో పాల్గొన్న 77 గోత్రాల వారికి కంకణధారణ చేశారు. అనంతరం ముందుగా కొమ్మరాజులు, పోతురాజులు, కన్నమనీడులు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ముగిసిన రాచగావు మొదటి రోజు ఉత్సవం రాచగావును రాత్రి నిర్వహించారు. రోతురాజుకు లాంఛనంగా గావు చెల్లించారు. అన్నంలో నెత్తురు కలిపి ముద్దలుగా చేసి పోతురాజుకు చెల్లించారు. తర్వాత అలాంటి ముద్దలను గాలిలోకి విసిరారు. రాత్రి 12 గంటల దాకా కార్యక్రమాలు కొనసాగాయి. ఇలా చేస్తే వీరుల ఆత్మలు దానిని స్వీకరిస్తాయని నమ్మిక. వాస్తవంగా రాచగావు అంటే వీరాచారవంతుడు ఒక జంతువు మెడకొరికి పోతురాజుకు అర్పించే ప్రక్రియ. తర్వాత అందరూ పొట్టేళ్లను పోతురాజుకు బలి ఇచ్చే కార్యక్రమం ఇది. జీవకారుణ్య సంఘం అభ్యర్థన మేరకు దీనిని కలెక్టర్ నిషేధిస్తూ 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉత్తర్వులిస్తున్నారు. మంగళవారం రాయబారం ఉత్సవం నిర్వహిస్తారు. వసతలు లేవు గుండ్లపల్లి, అనుపాలెం, చిలకలూరిపేట, మార్టూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి వీరాచారవంతులు తరలివచ్చారు. అయితే వీరికి సరైన వసతులు లేవు. వీరులగుడి ప్రాంగణం అంతా లైటింగ్ లేక చీకటిగా ఉంది. చీకట్లో భోజనాలు చేయాల్సి వచ్చింది. -
బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్ : డీఎస్ఆర్ ఫ్రండ్స్ క్లబ్ ఆ«ధ్వర్యంలో 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మహిళల, పురుషుల బాస్కెట్ బాల్ జిల్లా స్దాయి టోర్నమెంట్ సోమవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్లో 16 పురుషుల, 6మహిళల జట్లు పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకోని బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆకుల బాలకష్ణ క్రీడాకారులకు బూట్లను పంపిణీ చేశారు. వీఆర్ హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు, ఆర్.భాస్కర్ రావు, పి.రవిశంకర్, టీ.గురునాధం, ఎం.రమేష్ బాబు, బాస్కెట్ బాల్ శిక్షకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్ : డీఎస్ఆర్ ఫ్రండ్స్ క్లబ్ ఆ«ధ్వర్యంలో 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మహిళల, పురుషుల బాస్కెట్ బాల్ జిల్లా స్దాయి టోర్నమెంట్ సోమవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్లో 16 పురుషుల, 6మహిళల జట్లు పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకోని బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆకుల బాలకష్ణ క్రీడాకారులకు బూట్లను పంపిణీ చేశారు. వీఆర్ హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు, ఆర్.భాస్కర్ రావు, పి.రవిశంకర్, టీ.గురునాధం, ఎం.రమేష్ బాబు, బాస్కెట్ బాల్ శిక్షకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.