ఖోఖో పోటీలు ప్రారంభం
ఖోఖో పోటీలు ప్రారంభం
Published Mon, Jan 2 2017 7:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలను సోమవారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితోపాటు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కళాశాల పీడీ పీ గౌరీశంకర్ మాట్లాడుతూ ఖోఖో పోటీలు నాకౌట్, లీగల్ పద్ధతుల్లో జరుగుతాయని, యూనివర్సిటీ సెలక్షన్ ట్రైల్స్, లీగ్‌లు మంగళవారం నుంచి జరుగుతాయని చెప్పారు. టొర్నమెంట్‌లో వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా నాలుగు జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్ ఎన్‌వీ శ్రీనివాస్, వర్సిటీ అబ్జర్వర్ కోటేశ్వరరావు, సెలక్టర్లు, కళాశాల వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
Advertisement