సైబర్ వార్ నేపథ్యంలో రూపొందనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కోకో’. జై కుమార్ దర్శకత్వంలో సందీప్ రెడ్డి వాసా నిర్మించనున్నారు. జూన్ మూడోవారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్‌ను వివరించే గ్లింప్స్ వీడియోను దర్శకుడు సుకుమార్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత రక్షణ వ్యవస్థకు హాని కలగకుండా ఉండేందుకు రామానుజన్ అనే వ్యక్తి ‘ఆర్‌ఎఎమ్– ఐఎస్‌యూ’ (వేగం, ఖచ్చితత్వం, శక్తి) కోడ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేషన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను కనుగొంటాడు.
తండ్రి రామానుజన్ ఆశయాలు ఆచరణలోకి వచ్చేందుకు, తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ నిక్కీ ‘కోకో’ అనే పేరుతో సెల్ఫ్ మేడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తుంది. ‘కోకో’ భౌతికంగా కనిపించదు. మరోవైపు భారతదేశంపై సైబర్ వార్ చేయాలని ఓ చైనీస్ హ్యాకర్ ప్లాన్ చేస్తుంటాడు. పాక్, చైనా మద్దతు ఉన్న హ్యాకర్ల సమూహం భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ ముప్పును విస్తరించడంతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అప్పుడేం జరిగింది? అన్నదే ‘కోకో’ చిత్ర కథాంశంగా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషలతో పాటు తైవాన్, వియత్నాం భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment