ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా? | Durga Puja Pandal Theme of Metro in Kolkata | Sakshi
Sakshi News home page

ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?

Published Wed, Oct 9 2024 11:42 AM | Last Updated on Wed, Oct 9 2024 12:05 PM

Durga Puja Pandal Theme of Metro in Kolkata

కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్  అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన  దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇ‍ప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. 

 



ఇది కూడా చదవండి: బూటకపు ఎన్‌కౌంటర్‌.. డీఎస్‌పీకి జీవితఖైదు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement