koko
-
వచ్చే ఏడాది సైబర్ వార్.. కోకో టీజర్ చూశారా?
సైబర్ వార్ నేపథ్యంలో రూపొందనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కోకో’. జై కుమార్ దర్శకత్వంలో సందీప్ రెడ్డి వాసా నిర్మించనున్నారు. జూన్ మూడోవారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్‌ను వివరించే గ్లింప్స్ వీడియోను దర్శకుడు సుకుమార్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత రక్షణ వ్యవస్థకు హాని కలగకుండా ఉండేందుకు రామానుజన్ అనే వ్యక్తి ‘ఆర్ఎఎమ్– ఐఎస్‌యూ’ (వేగం, ఖచ్చితత్వం, శక్తి) కోడ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేషన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను కనుగొంటాడు. తండ్రి రామానుజన్ ఆశయాలు ఆచరణలోకి వచ్చేందుకు, తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ నిక్కీ ‘కోకో’ అనే పేరుతో సెల్ఫ్ మేడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తుంది. ‘కోకో’ భౌతికంగా కనిపించదు. మరోవైపు భారతదేశంపై సైబర్ వార్ చేయాలని ఓ చైనీస్ హ్యాకర్ ప్లాన్ చేస్తుంటాడు. పాక్, చైనా మద్దతు ఉన్న హ్యాకర్ల సమూహం భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ ముప్పును విస్తరించడంతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అప్పుడేం జరిగింది? అన్నదే ‘కోకో’ చిత్ర కథాంశంగా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషలతో పాటు తైవాన్, వియత్నాం భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
సైగల సెన్సేషన్ ‘కోకో’ కన్నుమూత
కాలిఫోర్నియా : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోకో(గొరిల్లా) తన 46వ ఏట కన్నుమూసింది. గురువారం కోకో మృతిని ‘గొరిల్లా పౌండేషన్’ ప్రతినిధులు ధ్రువీకరించారు. సైగల భాషతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ’కోకో’.. గోరిల్లాల అంబాసిడర్‌గా ఓ వెలుగు వెలిగింది. హనబీ కో( కోకో అసలు పేరు)1971 జూలై 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ జూలో జన్మించింది. 12నెలల ప్రాయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్శీటీకి చెందిన ఫ్రాన్సిన్ పాటర్సన్ అనే విద్యార్థి చొరవతో సైగల భాషను నేర్చుకుంది. దాదాపు 1000 రకాల సైగలనే కాకుండా ఆంగ్ల పదాలను సైతం అర్థం చేసుకోగలగటమే కోకో ప్రత్యేకత. 1983 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఓ పిల్లి పిల్ల కావాలని అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 1985న కోకో పుట్టిన రోజు సందర్భంగా కొన్ని పిల్లులను తెచ్చి ఎంపిక చేసుకోవల్సిందిగా కోరారు. వాటిలో బూడిద, తెలుపు రంగులో ఉన్న ఓ పిల్లి పిల్లను ఎంపిక చేసుకోవటమే కాకుండా దానికి ఆల్ బాల్ అనే పేరు పెట్టింది. కన్న తల్లిలాగా దానికి సేవలు కూడా చేసేది. అయితే ఓ కారు ప్రమాదంలో ఆల్ బాల్ మృతిచెందటంతో కోకో కృంగిపోయి అలా కొద్ది రోజులు ఏడుస్తూ ఉండిపోయింది. నేషనల్ జియోగ్రఫీ బుక్ కవర్ పేజీపై రెండు సార్లు కనిపించటమే కాకుండా మరికొన్ని డాక్యుమెంటరీలలో కూడా కనిపించింది. సెల్ఫీ తీసుకోవటం, ఇంటర్నెట్లో చాట్ చేయటం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించింది. -
ఖోఖో కాదు..కోకో
తమిళసినిమా: ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించాలంటే కోలీవుడ్‌లో నయనతార, టాలీవుడ్లో అనుష్కలే ముందు గుర్తుకొస్తారని చెప్పవచ్చు. అలాంటిది అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉంది. తను పెళ్లికి రెడీ అవుతోందని, అందుకే కొత్త చిత్రాలు అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజాలేమిటన్నది అనుష్క నోరు విప్పితే కానీ తెలియదు. నయనతార మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఈమె గురించి పెళ్లి వార్తలు కాదుగానీ, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్న ప్రచారం మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే నయనతార చేతి నిండా చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉంది. మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వరుసగా నయనతార తలుపు తడుతున్నాయి. మధ్యలో డోర చిత్రం నిరాశపరచినా, నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ వంటి కమర్శియల్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు, మలయాళంలో నవీన్పాల్తో ఒక చిత్రం చేస్తోంది. వీటిలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన వేలైక్కారన్ చిత్రం వచ్చే నెల 29న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా నయనతార మరో కథానాయకి పాత్ర చుట్టూ తిరిగే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. బ్లాక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి ఖోఖో అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరగడంతో ఇదేదో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం అని చాలా మంది భావించారు. నిజానికి ఈ చిత్ర టైటిల్ ఖోఖో కాదట. కోకో అట. కోకో అంటే కోలమావు కోకిల అట. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార చిత్రానికి ఈయన సంగీత బాణీలు కట్టడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. -
ఖోఖో పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలను సోమవారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితోపాటు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కళాశాల పీడీ పీ గౌరీశంకర్ మాట్లాడుతూ ఖోఖో పోటీలు నాకౌట్, లీగల్ పద్ధతుల్లో జరుగుతాయని, యూనివర్సిటీ సెలక్షన్ ట్రైల్స్, లీగ్‌లు మంగళవారం నుంచి జరుగుతాయని చెప్పారు. టొర్నమెంట్లో వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా నాలుగు జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్ ఎన్వీ శ్రీనివాస్, వర్సిటీ అబ్జర్వర్ కోటేశ్వరరావు, సెలక్టర్లు, కళాశాల వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఖోఖో పోటీలు
నెల్లూరు(బృందావనం) : నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 3వ సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపుకోసం ఆయా జట్ల క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కొనసాగుతున్న పోటీల్లో పలువురు జాతీయ క్రీడాకారులు తమ క్రీడాప్రతిభను ప్రదర్శిస్తూ వీక్షకులకు ఆకట్టుకుంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో తమ ప్రత్యర్థి జట్లను ఓటమిపాలు చేసి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్న జట్ల వివరాలను టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గురుప్రసాద్ ఆదివారం రాత్రి తెలిపారు. పురుషుల విభాగంలో.. తొలిక్వార్టర్స్ విజయనగరం, అనంతపురం జట్ల మధ్య, సెకండ్ క్వార్టర్స్ వైఎస్ఆర్ కడప, ప్రకాశం జట్ల నడుమ, మూడో క్వార్టర్స్ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల జట్ల మధ్య, నాలుగో క్వార్టర్స్ గుంటూరు, విశాఖపట్టణం జట్ల మధ్య జరుగనున్నాయి మహిళల విభాగంలో.. ఫస్ట్ క్వార్టర్స్ పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లా జట్ల మధ్య, సెకండ్ క్వార్టర్స్ తూర్పుగోదావరి, కృష్ణా జట్ల మధ్య, మూడోక్వార్టర్స్ ప్రకాశం, విజయనగరం జిల్లా జట్లమధ్య, నాలుగో క్వార్టర్స్ వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం జిల్లాల మధ్య జరుగున్నాయని ఆయన తెలిపారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
13జిల్లాల నుంచి 300మంది క్రీడాకారుల రాక పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు నెల్లూరు(బృందావనం) : నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అక్టోబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల ఖోఖో పోటీలు జరుగుతాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జిలానీబాష, గురుప్రసాద్ తెలిపారు. స్టేడియంలోని ఖోఖో క్రీడాప్రాంగణంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 13 పురుషుల జట్లకు సంబంధించి 156 మంది, 13 మహిళల జట్లుకు సంబంధించి 156 మంది క్రీడాకారులు, వీరితో పాటు 50 మంది అధికారులు, 100 మంది పీఈటీలు, సిబ్బంది రానున్నారన్నారు. క్రీడాకారిణులకు స్థానిక డీకేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాలలో, పురుషులకు కొండాయపాలెంరోడ్డులోని సెయింట్ ఇన్ఫాంట్æజీసస్ స్కూల్ ప్రాంగణంలో బస ఏర్పాటుచేశామన్నారు. మూడురోజులు జరిగే పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలను ప్రముఖ కాంట్రాక్టర్, జిల్లా ఖోఖో సంఘం చీఫ్‌ప్యాట్రన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ట్రస్ట్, హైదరాబాద్‌కు చెందిన వాటర్ ప్యూరిఫైర్ సంస్థ శ్రేష్ట సంస్థ సహకారంతో కల్పిస్తున్నామన్నారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారులతో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లును ఎంపికచేస్తామన్నారు. ఎంపికైన క్రీడాకారులతో రాష్ట్ర జట్లు అక్టోబరు చివరివారంలో నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి సనత్‌కుమార్, పాల్గొన్నారు. -
ఖోఖో ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి
జూలూరుపాడ: ఖోఖో ఆడుతున్న ఏడవ తరగతి విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని సాధన స్కూల్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలానికి చెందిన భూక్యా భద్రాచలం (13) సాధన స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో ఖోఖో ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది భద్రాచలంను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది.