
యువతితో కోకో
కాలిఫోర్నియా : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోకో(గొరిల్లా) తన 46వ ఏట కన్నుమూసింది. గురువారం కోకో మృతిని ‘గొరిల్లా పౌండేషన్’ ప్రతినిధులు ధ్రువీకరించారు. సైగల భాషతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ’కోకో’.. గోరిల్లాల అంబాసిడర్‌గా ఓ వెలుగు వెలిగింది. హనబీ కో( కోకో అసలు పేరు)1971 జూలై 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ జూలో జన్మించింది. 12నెలల ప్రాయంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శీటీకి చెందిన ఫ్రాన్సిన్ పాటర్‌సన్ అనే విద్యార్థి చొరవతో సైగల భాషను నేర్చుకుంది. దాదాపు 1000 రకాల సైగలనే కాకుండా ఆంగ్ల పదాలను సైతం అర్థం చేసుకోగలగటమే కోకో ప్రత్యేకత. 1983 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఓ పిల్లి పిల్ల కావాలని అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
1985న కోకో పుట్టిన రోజు సందర్భంగా కొన్ని పిల్లులను తెచ్చి ఎంపిక చేసుకోవల్సిందిగా కోరారు. వాటిలో బూడిద, తెలుపు రంగులో ఉన్న ఓ పిల్లి పిల్లను ఎంపిక చేసుకోవటమే కాకుండా దానికి ఆల్ బాల్ అనే పేరు పెట్టింది. కన్న తల్లిలాగా దానికి సేవలు కూడా చేసేది. అయితే ఓ కారు ప్రమాదంలో ఆల్ బాల్ మృతిచెందటంతో కోకో కృంగిపోయి అలా కొద్ది రోజులు ఏడుస్తూ ఉండిపోయింది. నేషనల్ జియోగ్రఫీ బుక్ కవర్ పేజీపై రెండు సార్లు కనిపించటమే కాకుండా మరికొన్ని డాక్యుమెంటరీలలో కూడా కనిపించింది. సెల్ఫీ తీసుకోవటం, ఇంటర్‌నెట్‌లో చాట్ చేయటం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించింది.

పిల్లి పిల్లతో కోకో
Comments
Please login to add a commentAdd a comment