సోన్య డెవిల్లే
ఫ్లోరిడా : డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెస్లర్‌ను వేధింపులకు గురిచేయటమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన సోన్య డెవిల్లే అనే డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్‌పై సౌత్ కాలిఫోర్నియా కార్డ్స్ విల్లేకు చెందిన థామస్ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. ఆదివారం సోన్య నివాసం ఉంటున్న ఫ్లాట్ ఆవరణలోకి చొరబడ్డాడు. దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి లోపల ఏం జరుగుతోందో గమనించసాగాడు. ( డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ )
నిందితుడు థామస్
అనంతరం ఇంటి గ్లాస్ డోర్ గుండా లోపలికి ప్రవేశించాడు. దీంతో ఇంట్లోని అలారం మోగటం మొదలుపెట్టింది. అలారం గట్టిగా మోగుతుండటంతో థామస్‌కు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత థామస్‌ను చూసిన ప్లాట్ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment