హోరాహోరీగా ఖోఖో పోటీలు
హోరాహోరీగా ఖోఖో పోటీలు
Published Mon, Oct 3 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
నెల్లూరు(బృందావనం) : నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 3వ సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపుకోసం ఆయా జట్ల క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కొనసాగుతున్న పోటీల్లో పలువురు జాతీయ క్రీడాకారులు తమ క్రీడాప్రతిభను ప్రదర్శిస్తూ వీక్షకులకు ఆకట్టుకుంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో తమ ప్రత్యర్థి జట్లను ఓటమిపాలు చేసి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్న జట్ల వివరాలను టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గురుప్రసాద్ ఆదివారం రాత్రి తెలిపారు.
పురుషుల విభాగంలో..
తొలిక్వార్టర్స్ విజయనగరం, అనంతపురం జట్ల మధ్య, సెకండ్ క్వార్టర్స్ వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం జట్ల నడుమ, మూడో క్వార్టర్స్ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల జట్ల మధ్య, నాలుగో క్వార్టర్స్ గుంటూరు, విశాఖపట్టణం జట్ల మధ్య జరుగనున్నాయి
మహిళల విభాగంలో..
ఫస్ట్ క్వార్టర్స్ పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లా జట్ల మధ్య, సెకండ్ క్వార్టర్స్ తూర్పుగోదావరి, కృష్ణా జట్ల మధ్య, మూడోక్వార్టర్స్ ప్రకాశం, విజయనగరం జిల్లా జట్లమధ్య, నాలుగో క్వార్టర్స్ వైఎస్‌ఆర్ కడప, విశాఖపట్టణం జిల్లాల మధ్య జరుగున్నాయని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement