
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.
ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.