
న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు ఓటర్ల పేర్లను బీజేపీ తొలగిస్తోందని ఆరోపించారు. ఇందుకు షహడ్రా నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపెట్టారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఏకంగా 11వేల ఓట్లను తొలగించారని పేర్కొన్నారు.
అయితే ఈ నియోజకవర్గంలో గత అక్టోబర్ నుంచి కేవలం 494 మంది పేర్లను మాత్రమే ఓటరు జాబితా నుంచి తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా కేజ్రీవాల్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
కాగా, వచ్చే 2025లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని ఆప్ చీఫ్ కేజజ్రీవాల్ స్పష్టం చేశారు. ముక్కోణపు పోటీ అనిపించినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్,బీజేపీ మధ్యే ఉండనుంది. దీంతో అప్పుడే పొలిటికల్ మాటల తూటాలు పేలున్నాయి.
ఇదీ చదవండి: ఓట్లతో అభివృద్ధిని తూకం వేయవద్దు