కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుతీర్థ భట్టాచార్య ఎంపికయ్యారు.
సాక్షి, హైదరాబాద్: కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుతీర్థ భట్టాచార్య ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోల్ ఇండియా కొత్త చైర్మన్ పోస్టుకు సెలెక్షన్ బోర్డు మంగళవారం కోల్‌కతాలో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులతోపాటు మొత్తం పన్నెండు మంది పోటీపడగా.. సుతీర్థ భట్టాచార్యను చైర్మన్ పోస్టు వరించింది. దీంతో ఈ పోస్టును వరుసగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులే దక్కించుకున్నట్లయింది. గతంలో కోల్ ఇండియా సీఎండీగా పనిచేసిన నర్సింగరావు మే నెలలోనే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. నర్సింగరావు కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి కావటం విశేషం. అంతకు ముందు ఆయన కూడా సింగరేణి కాలరీస్ సార థిగా వ్యవహరించారు. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భట్టాచార్య 2012 మే నుంచి సింగరేణి సీఎండీగా ఉన్నారు. ఆయన హయాంలో సింగరేణి కాలరీస్ అభివృద్ధిపథంలో సాగింది. ఏటేటా 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. అందుకే సెలక్షన్ బోర్డు ఆయన నియామకానికి మొగ్గు చూపినట్లు సమాచారం.