శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్లస్టర్–7 పోటీలను గురువారం సాయంత్రం జ్యోతిప్రజల్వన చేసి ఆయన ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎంపీ తోట మాట్లాడుతూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్న నేటి విద్యా వ
-
ప్రారంభించిన ఎంపీ తోట నరసింహం
పెద్దాపురం :
శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్లస్టర్–7 పోటీలను గురువారం సాయంత్రం జ్యోతిప్రజల్వన చేసి ఆయన ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎంపీ తోట మాట్లాడుతూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్న నేటి విద్యా విధానంలో శ్రీప్రకాష్ పాఠశాల జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. భాస్కరరామ్‌లు మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో క్రీడల ప్రాముఖ్యతను చాటుతూ క్రీడలకు ఉన్నతస్థానాన్ని కల్పించిన ఘనత శ్రీ ప్రకాష్ యాజమాన్యానికే దక్కుతుందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని కనబరిచి గెలుపునకు ముందడుగు వేయాలన్నారు. అనంతరం ఎంపీ నరసింహం, చైర్మన్ సూరిబాబురాజు టేబుల్ టెన్నిస్ ఆడి అండర్–14, అండర్–17, అండర్–19 బాలుర, బాలికల క్రీడా పోటీలను ప్రారంభించారు. టీటీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పీవీఎన్ సూర్యారావ్, యూఐసీ కోచ్ అచ్యుత్‌కుమార్, ఓవరాల్ టెక్నికల్ ఇన్‌చార్జి పి.వేణుగోపాల్, పాఠశాల డీన్ రాజేశ్వరి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, ఆయా రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.