పవర్‌లిఫ్టింగ్‌లో జిల్లాకు పతకాలు
మంగళగిరి: జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలలో జిల్లా యువకులు కాంస్యపతాకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరావు తెలిపారు. స్థానిక జిమ్‌సెంటర్‌లో ఆదివారం యువకులను ఘనంగా సన్మానించారు. మంగళగిరికి చెందిన షేక్ మహ్మద్‌గౌస్ 105 కేజీల విభాగంలో, సత్తెనపల్లికి చెందిన పసుపులేటి సురేష్ 160 కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించగా సత్తెనపల్లికి చెందిన గడ్డం రమేష్ 105 కేజీల విభాగంలో, మంగళగిరికి చెందిన జొన్నాదుల ఈశ్వరకుమార్ 120 కేజీల విభాగంలో ఐదవస్థానం సాధించారు. వారిని అసోషియేషన్ అధ్యక్షుడు మహ్మద్‌రఫీ, సభ్యులు ఎండీ ఖమురుద్దీన్, కె.విజయభాస్కర్,ఎస్‌కె.సంధాని, ఎన్.శేషగిరిరావు తదితరులు అభినందించారు.