విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమిట్
28, 29 తేదీల్లో నిర్వహణ
సాక్షి, విశాఖపట్నం: జాతీయ స్థాయిలో సముద్ర వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో రెండు రోజుల పాటు ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమిట్ నిర్వహించనున్నట్లు మారిటైమ్ గేట్‌వే ఎడిటర్ ఇన్ చీఫ్, పబ్లిషర్ ఆర్.రాంప్రసాద్ బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్, విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రధాన ప్రాయోజిత కంపెనీలుగా వ్యవహరిస్తామని సమావేశంలో పాల్గొన్న పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్, వీసీటీ వైస్ చైర్మన్ అనిల్ నారాయణ్ తెలిపారు. తూర్పు తీరం(ఈస్ట్‌కోస్ట్)లో మారిటైమ్ బిజినెస్‌ను అభివృద్ధి చేయడంపై ఈ సమిట్‌లో చర్చిస్తామన్నారు. విశాఖలో ఈ తరహా సమావేశం ఇది మూడవది.