కాంస్య విగ్రహ శైలిలో రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం
కరికాళ చోళుడు
Published Wed, Oct 26 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
ఉత్తమ కళాఖండంగా ఎంపిక
నంద్యాల: స్థానిక చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం ఉత్తమ కళా చిత్రంగా ఎంపికైంది. నెల్లూరులోని అమీర్ ఫైన్ ఆర్ట్ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళ పోటీల్లో ఆయన చోళుడు చిత్రాన్ని కాంస్య విగ్రహ శైలిలో సజీవంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కాన్వాస్‌పై నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పులో తైల వర్ణంలో నెలరోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఉత్తమ కళాఖండంగా ఎంపిక కావడంపై ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్య, రాంప్రసాద్ అభినందించారు. నవంబర్ 20న నెల్లూరు టౌన్‌హాల్‌లో అవార్డును అందజేస్తారని కోటేష్ తెలిపారు.
Advertisement
Advertisement