కోటేష్ చిత్రానికి జాతీయ అవార్డు
కోటేష్ చిత్రానికి జాతీయ అవార్డు
Published Tue, Dec 20 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
నంద్యాల: తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చిత్రీకరించిన రాధాకృష్ణ చిత్రానికి చిత్రమిత్ర అవార్డు దక్కింది. ఈ మేరకు కళా పరిషత్ నిర్వాహకుడు కొరసాల సీతారామయ్య మంగళవారం కోటేష్‌కు లేఖను పంపారు. పలు రాష్ట్రాల నుంచి 200 చిత్రాలు పోటీలో పాల్గొనగా రాధాకృష్ణ చిత్రానికి పురస్కారం దక్కింది. జనవరి 22న అమలాపురంలో కోటేష్ ఈ అవార్డును అందుకోనున్నారు.
Advertisement
Advertisement