Kotesh
-
మ్యాచ్ కోసం వచ్చి మృత్యువాత
మృతులు ఏపీకి చెందినవారు చివ్వెంల: ఏపీకి చెందిన ముగ్గురు యువ కులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిర్మలగిరి శివారులో సోమవారం జరి గింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్ (26), తన బంధువులు పాత గుంటూరుకు చెందిన తొర్రపాయి కోటేష్(24), తెనాలికి చెం దిన మైలా పూర్ణచందర్రావు (21), మరో స్నేహితుడు పాత గుంటూరుకు చెందిన దాదిసాయి భార్గవ్‌లు కలసి హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసేం దుకు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జి.తిర్మలగిరి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్, కోటేష్, పూర్ణచందర్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. -
కోటేష్ చిత్రానికి ఉగాది పురస్కారం
నంద్యాల: ఏపీ బాషా, సాంస్కృతిక శాఖ, ఆర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాలకు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎంపికయ్యారు. ఈయన చిత్రీకరించిన ఆనందతాండవం కళంకారి చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు తనకు లేఖ అందిందని కోటేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పురస్కారాలకు 36 మందిని ఎంపిక చేయగా కర్నూలు జిల్లా నుంచి కోటేష్ ఒక్కరికే జాబితాలో స్థానం లభించడం విశేషం. ఉగాది సందర్భంగా ఈ నెల 29వతేదీన కోటేష్‌కు పురస్కారం అందిస్తారు. -
సృజనాత్మకత
నంద్యాల: ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కాఫీ పొడితో స్వామి వివేకానంద చిత్రాన్ని తీర్చిదిద్దారు. గురువారం స్వామి వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని వేశానని చెప్పారు. ఆయన ప్రబోధాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. -
కోటేష్ చిత్రానికి జాతీయ అవార్డు
నంద్యాల: తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చిత్రీకరించిన రాధాకృష్ణ చిత్రానికి చిత్రమిత్ర అవార్డు దక్కింది. ఈ మేరకు కళా పరిషత్ నిర్వాహకుడు కొరసాల సీతారామయ్య మంగళవారం కోటేష్‌కు లేఖను పంపారు. పలు రాష్ట్రాల నుంచి 200 చిత్రాలు పోటీలో పాల్గొనగా రాధాకృష్ణ చిత్రానికి పురస్కారం దక్కింది. జనవరి 22న అమలాపురంలో కోటేష్ ఈ అవార్డును అందుకోనున్నారు. -
కరికాళ చోళుడు
ఉత్తమ కళాఖండంగా ఎంపిక నంద్యాల: స్థానిక చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం ఉత్తమ కళా చిత్రంగా ఎంపికైంది. నెల్లూరులోని అమీర్ ఫైన్ ఆర్ట్ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళ పోటీల్లో ఆయన చోళుడు చిత్రాన్ని కాంస్య విగ్రహ శైలిలో సజీవంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కాన్వాస్‌పై నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పులో తైల వర్ణంలో నెలరోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఉత్తమ కళాఖండంగా ఎంపిక కావడంపై ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్య, రాంప్రసాద్ అభినందించారు. నవంబర్ 20న నెల్లూరు టౌన్హాల్లో అవార్డును అందజేస్తారని కోటేష్ తెలిపారు. -
వైఎస్ఆర్ అక్షరాలతో చిత్రం
నంద్యాల: ఇంగ్లిష్‌లో వైఎస్ఆర్ అక్షరాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రాన్ని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కళాకారుడు కోటేష్ తీర్చిదిద్దారు. జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అక్షరాలతో రెండు గంటలు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. తనకు వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానమని, గతంలో కూడా పలు చిత్రాలు గీశానని చెప్పారు.