జిల్లా క్రీడాకారులు ఈ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో సత్తాచాటారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ
ఆట అదిరింది
Published Mon, Dec 30 2013 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
జిల్లా క్రీడాకారులు ఈ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో సత్తాచాటారు. కఠోర శ్రమ,
క్రమశిక్షణ, అంకితభావంతో క్రీడాస్ఫూర్తిని చాటారు. ప్రభుత్వం తగినంత ఆర్థికసాయం అందించకపోయినా,
క్రీడా మైదానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా పలు పతకాలు సాధించారు. రెండేళ్లుగా
‘పైకా’ పోటీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చిన నిధులను ఈ ఏడాది నిలుపుదల చేయడం
బాధాకరం. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.23 కోట్లు విడుదల
చేయడం ఒకింత సంతోషకరం. - న్యూస్‌లైన్ / ఏలూరు స్పోర్ట్స్
క్రికెట్
ఏలూరుకు చెందిన క్రికెటర్ గాదం దినేష్ సాయిపవన్ అండర్-16, ఆకుల నిఖిల్ అండర్-14 ఆంధ్రా జట్లకు ఎంపికయ్యారు.
డిసెంబర్ మొదటి వారంలో గోపన్నపాలెం వ్యాయామ ఉపాధ్యాయుల కళాశాలలో జాతీయ స్థాయి ఎస్‌జీహెచ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.
బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. తణుకులో సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి రుత్విక శివానీ మొదట స్థానంలో నిలిచింది.
సెప్టెంబర్‌లో చండీఘడ్, బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీల్లో జి.లక్ష్మి పాల్గొంది.
నవంబర్‌లో గుంతకల్లు, అనంతపురం, చిత్తూరులో జరిగిన రాష్ర్టస్థాయి ఎస్‌జీహెచ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు కె.ప్రశాంత్ ప్ర థమ, జి.లక్ష్మి తృతీయ స్థానాల్లో నిలిచారు.
కరాటే
జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17, 19 విభాగాల కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎండీ హస్మత్‌బేగ్, డి.పవన్‌కుమార్, పి.నాగలావణ్య, కె.వినయ్, జి.ధనశేఖర్ ఎంపికయ్యారు.
హాకీ
హాకీలో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఆంధ్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్‌లో ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియంలో అండర్-17 బాలుర పోటీలు నిర్వహించారు. పశ్చిమ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఏడుగురు క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.
నవంబర్‌లో చిత్తూరు జిల్లాలో సబ్ జూనియర్ సౌత్ జోన్ నేషనల్ బాలబాలికల హాకీ పోటీలు జరిగాయి. రాష్ట్రజట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు జిల్లా క్రీడాకారులు రాణించి బంగారు పతకం తెచ్చిపెట్టారు. మహిళల విభాగంలో హిమబిందు రాష్ర్టజట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
హాకీ క్రీడాకారిణులు కె.రాణి, ఎం.రమ్య ఆంధ్ర హాకీ జట్టు తరఫున జూనియర్ నేషనల్ హాకీ పోటీల్లో ఆడారు.
తీరని లోటు
ఆంధ్రా పీలేగా పేర్గాంచిన జిల్లా పుట్‌బాల్ ఆటగాడు వీరవల్లి హనుమంతురావు(78) డి సెంబర్ 11న ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో మృతి చెందారు.
నిధులు నిల్
జిల్లాలో మండలస్థాయి పైకా పోటీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రూ.95 వేలను ఈ ఏడాది నిలుపుదల చేసింది. క్రీడాకారులు అవస్థలు పడ్డారు.
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీహెచ్ బాస్కెట్‌బాల్, క్రికెట్, ఖోఖో పోటీలకు జిల్లా క్రీడాకారులు వెళ్లలేకపోయారు.
స్విమ్మింగ్
విజయవాడలో డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా స్విమ్మర్ పి.శ్రీరమ్య 400, 200, 100 మీటర్ల విభాగంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచింది.
హైదరాబాద్‌లో నవంబర్‌లో జరిగిన పారా ఒలంపిక్స్ పోటీల్లో జిల్లా స్విమ్మింగ్ కోచ్ గణేష్ 100, 200 మీటర్ల బ్రెస్ట్‌స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు, రజత పతకాలు సాధించారు.
అథ్లెటిక్స్
భీమవరానికి చెందిన బి.వెంకటలక్ష్మి, ఎస్.భవానీ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
టెన్నికాయిట్
జాతీయ టెన్నికాయిట్ చాంపియన్ జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్ హైదరాబాద్‌లో జరిగిన జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు.
ఆర్చరీ
జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంకు చెందిన ఎం.ఠాగూర్, ఎస్.సీతయ్య డిసెం బర్‌లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పైకా పోటీల్లో ఆర్చరీలో సత్తాచాటారు.
చదరంగం
తణుకు ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో జూన్‌లో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో కృష్ణతేజ మొదటి స్థానంలో నిలిచి జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.
తాడేపల్లిగూడెంలో అక్టోబర్‌లో జరిగిన ఎస్‌జీహెచ్ జాతీయస్థాయి చదరంగం పోటీల్లో అండర్ -19 విభాగంలో కృష్ణతేజ బంగారు పతకం సాధించాడు. అండర్-17లో ఎస్.ప్రియాంక సత్తాచాటింది.
బేస్‌బాల్, త్రోబాల్
ఉంగుటూరు మండలం నారాయణపురంలో డిసెంబర్‌లో రాష్ట్రస్థాయి బేస్‌బాల్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. జిల్లా బేస్‌బాల్ క్రీడాకారులు విజేతగా నిలిచారు. జిల్లా క్రీడాకారులు డి.సుధీర్, ఐ.వినయ్‌కుమార్, వి.నిఖిల్, డి.చందు, వై.వెంకటలక్ష్మి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.
త్రోబాల్ విభాగంలో జిల్లా క్రీడాకారులు బి.అయ్యప్ప, సీహెచ్ ్రపశాంతి రాష్ర్టజట్టుకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి హేండ్‌బాల్ జట్టులో వీరవాసరం క్రీడాకారుడు కె.సాయికుమార్ చోటు దక్కించుకున్నాడు.
Advertisement
Advertisement