ఘట్‌కేసర్ టౌన్: తెలంగాణలో సాగవుతున్న సోనా వరి విత్తనానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పిలేట్ సభ్యుడు రేసు లక్ష్మారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ఢిల్లీలో జాతీయ విత్తన ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని, అందులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 13 కొత్త వరి విత్తనాల గుణగణాలను పరిశీలించారన్నారు. వాటిల్లో తెలంగాణ సోనా విత్తనం ఉత్తమమైనదని గుర్తిం చారన్నారు. ఈ రకం విత్తనాలు చీడపీడలను తట్టుకోవడమే కాకుండా నాణ్యత, అధిక దిగుబడిలో మెరుగైన ఫలితాలు సాధిస్తాయన్నారు.