భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
Published Mon, Oct 3 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
భువనగిరి టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అండర్ – 19 ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో క్రీడాకారులు అతితక్కువగా ఉన్నారన్నారు. ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన సాక్షి మాలిక్, పీవీ సింధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు టోర్నమెంట్‌కు సంబంధించిన ఎస్‌జీఎఫ్ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాల నుంచి వచ్చిన 44 జట్లు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం షూటింగ్‌బాల్ బాలికల విభాగంలో తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంటర్‌బోర్డు కమిషనర్ ఏ.అశోక్, ఎస్‌జీఎఫ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎం.ప్రకాష్‌బాబు, నేషనల్ టోర్నమెంట్ పర్యవేక్షకులు దినేష్‌సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, ఆర్డీఓ ఎం. వెంకట్‌భూపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ పి.మదన్‌మోహన్, ఇన్‌స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, నాయకులు గోలి ప్రణీత, జడల అమరేందర్‌గౌడ్, నాగారం అంజయ్య, మారగోని రాముగౌడ్, కొలుపుల అమరేందర్, జి.దయాకర్‌రెడ్డి, సోమనర్సయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
జాతీయస్థాయి క్రీడాపోటీల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్, శ్రీవాణి పాఠశాల విద్యార్ధులు లె లంగాణ చరిత్రకు సంబంధించిన పాటలతో డ్యాన్సులు చేశారు.
Advertisement