Survey Results
-
Times Now and ETG Survey: బీజేపీకి 333 పైమాటే
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘనవిజయం ఖాయమని టైమ్స్ నౌ చానల్–ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా ఏకంగా 333 నుంచి 363 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాలదాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లొస్తాయని వివరించింది. తమిళనాట డీఎంకేకు 24 నుంచి 28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 10 నుంచి 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్‌సభ స్థానాలున్న పశి్చమబెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఏడు సీట్లున్న ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలూ కొల్లగొట్టవచ్చని సర్వే వెల్లడించడం విశేషం. యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ ఖాయమని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని, కాంగ్రెస్, సమాజ్‌వాదీలతో కూడిన ‘ఇండియా’ కూటమి 2 నుంచి 6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్‌లోనైతే మొత్తం 26 సీట్లనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని పేర్కొంది. బిహార్‌లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీ(యూ)తో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమి 2 నుంచి 4 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్)లతో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22 నుంచి 24, కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని పేర్కొంది. -
విశ్వసనీయత లేని సీ-ఓటర్ సంస్థ సర్వేలు
-
Nellore: తాజా సర్వేల్లో వైఎస్సార్సీపీదే మళ్లీ హవా
తాజాగా టీడీపీ చేయించిన సర్వేలు ఆ పార్టీని నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. టీడీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదని సర్వేలు చెబుతున్నాయి. సర్వే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాకపోగా అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీ నేతలు మరింత షాక్‌కు గురయ్యారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి జిల్లాలో విజయదుందుభి మోగిస్తుందని సర్వే ఫలితాలు చెబుతుండడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతోందని ఆ పార్టీ చేయిస్తున్న తాజా సర్వేలే చెబుతున్నాయి. ఇటీవల జిల్లాలో టీడీపీ పరిస్థితిపై ప్రైవేట్ సంస్థల ద్వారా ఆ పార్టీ నేతలు సర్వే చేయించారు. దాదాపు 25 రోజులపాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో రెండు విడతలుగా సర్వే చేయించుకోగా, ఆ ఫలితాలను చూసి టీడీపీ నేతలకు దిమ్మతిరిగినట్లు తెలుస్తోంది. పదింటిలో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం దాదాపు ఖరారైనట్లు తాజా సర్వేల్లో తేటతెల్లం కావడంతో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఎన్నికలకు అతికొద్ది సమయమే ఉండడంతో పార్టీ గ్రాఫ్ ఎలా పెంచాలో పార్టీ అధిష్టానానికి అర్థంకావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదేమో అని జోరుగా ప్రచారం సాగుతోంది. అయోమయంలో టీడీపీ అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ రెండు ప్రైవేటు సంస్థల ద్వారా తాజాగా సర్వేలు చేయించుకుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 12వ తేదీ వరకు టీడీపీ ఈ సర్వేలు చేయించింది. ఆయా సర్వేల్లో ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 1,500 మందికి తగ్గకుండా అన్నివర్గాల వారి అభిప్రాయాలను సేకరించారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 6 నుంచి 7 శాతం మంది అదనంగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారని సమాచారం. దీంతో అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు ఉన్నట్లుగా ఆయా సర్వేల ద్వారా తేలింది. అధికార పార్టీకి మరింత ఆదరణ 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. జిల్లాలో వైఎస్సార్సీపీకి తిరుగులేదని ఓటర్లు నిరూపించారు. గడిచిన నాలుగన్నరేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన గురించి సామాన్యులు బేరీజు వేసుకుంటున్నారు. దీంతో ఎటుచూసినా టీడీపీ గ్రాఫ్ పెరగలేదని సర్వేల్లో స్పష్టమైంది. బహిష్కృత ఎమ్మెల్యేలను ఆహ్వానించినా.. జిల్లా టీడీపీలో నాయకత్వ లోపం కన్పిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చెదిరిపోయారు. దీంతో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలు కరువయ్యారు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న నేతలు సైతం వసూళ్ల కోసం అర్రులు చాచిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో కూడా వసూళ్లు చేసుకున్న ఘనత టీడీపీ సీనియర్ నేతలకే దక్కుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ముఖం చాటేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో ఉత్సాహం కరువైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలను టీడీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కండువా కప్పుకోకుండానే జెండాను ఎత్తుకున్నారు. మరో ఎమ్మెల్యే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ముగ్గురు వెళ్లినా టీడీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదని సర్వేలు చెబుతున్నాయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతలు అలకబూనారు. నమ్మి జెండా మోసిన మాకే టీడీపీ అధినేత చంద్రబాబు ద్రోహం చేశారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్థానిక టీడీపీ నేతలు తెగేసి చెబుతుండడం గమనార్హం. -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి
సాక్షి, హైదరాబాద్:: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. నవంబరు 30వ తేదీన తెలంగాణకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల తేదీలు రావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. పోటాపోటీగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసి ప్రత్యర్ధులపై విమర్శల దాడికి దిగుతున్నాయి. మరోవైపు పలు సర్వేలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సర్వేల వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ఫేక్ సర్వేలు నిర్వహిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్న పార్ధా దాస్ అనే యువకుడి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు చేయిస్తుందని మండిపడింది. కాంగ్రెస్ అంటేనే మోసమని, తమ ఫేక్ సర్వేలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పార్ట్ -1 పేరుతో ట్విటర్ వేదికగా విరుచుపడింది. ‘పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్న పార్భా దాస్ అనే యువకుడి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు చేయిస్తుంది. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణికం ఠాగూర్‌తో పార్థా దాస్ దోస్తీ. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో కేసీఆర్ గెలవడం కష్టమే అంటూ కాంగ్రెస్ ఫేక్ ప్రచారం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవరు అంటూ ఫేక్ ప్రచారం. గజ్వేల్‌లో కేసీఆర్ గెలవడు అంటూ ఫేక్ ప్రచారం.. 2019 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుస్తుంది అంటూ కాంగ్రెస్ ఫేక్ ప్రచారం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు ఎన్ని అంటే గుండు సున్నా. గోవా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలిసి కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ ఫేక్ ప్రచారం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఫేక్ ప్రచారం చేస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తు ఓడిపోయింది. ప్రతిసారీ ఫేక్ సర్వేలు ఇస్తూ, బొక్కబొర్లా పడుతున్న కాంగ్రెస్ పార్టీమరోసారి అదే కుట్రతో వస్తుంది తస్మాత్ జాగ్రత్త’ అంటూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ఫేక్ సర్వేల బండారం బట్టబయలు. కాంగ్రెస్ అంటేనే మోసం అని మరోసారి రుజవు అయ్యింది. పొలిటికల్ అనలిస్ట్ అన్న ముసుగులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎలక్షన్ సర్వేలు ఉత్త బూటకం అని పక్కా ఆధారాలతో బట్టబయలు. ప్రతిసారీ ఫేక్ సర్వేలు ఇస్తూ బొక్కబోర్లా పడుతున్న కాంగ్రెస్... మరోసారి… pic.twitter.com/9jZi60y4Jz — BRS Party (@BRSparty) October 8, 2023 అయితే బీఆర్ఎస్ ట్వీట్‌పై పార్థ దాస్ స్పందిస్తూ కౌంటర్ దాడికి దిగారు. ‘నాకోసం టైం కేటాయించి నాపై పరిశోధన చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలునేను రాజకీయాల విద్యార్థిని మాత్రమే. అవును నేను గతంలో తప్పులు చేశాను. కానీ నేను తప్పుగా చేసిన ట్వీట్లను ఎప్పుడూ డిలీట్ చేయలేదు. ఎందుకంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకునేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. రాష్ట్రంలో వెలువడే ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయడానికి నేను శాస్త్రీయ అధ్యయానం చేయాల్సిన అవసరం ఉందని భావించాను. నేను ఇంతకుముందు పొలిటికల్ కన్సల్టెన్సీలో ఎక్కువగా ఉండేవాడిని. నన్ను నమ్మండి .నా పనితీరుతో క్లయింట్లు చాలా సంతోషంగా ఉండేవారు. ఇక ఈ ఏడాది జరిగిన కర్నాటక ఎన్నికలకు సంబంధించి మీరు నా ట్వీట్లో దేనినీ ఎంపిక చేయనందుకు నేను కొంచెం బాధపడ్డాను. కర్ణాటక ఎన్నికల్లో సరైన రిజల్ట్స్‌ను అర్థం చేసుకొని నా సర్వే ఫలితాలను ట్విటర్లో షేర్ చేశాను. ఇది సర్వే, రీసెర్చ్ ద్వారా జరిగింది. దీనిని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నాను. అయితే నా స్టడీ మీ అంచనాలకు సరిపోకపోవటం నా దురదృష్టకరం. నేను నా అధ్యయనాన్ని విడుదల చేస్తూనే ఉంటాను. అలాగే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నేను అప్పడే చెప్పాను. ఆ ఆ స్క్రీన్‌షాట్‌ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. దీనిని మీరు మీ వీడియోలో షేర్ చేసుకోవచ్చు. నాకు ఎవరిపైనా వ్యతిరేకత లేదు. నేను ఎవరికీ అనుకూలంగా లేను. నేను మీ ప్రేమ, ఆప్యాయత, పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నా బృందం, నా అధ్యయనంపై నాకు నమ్మకం ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు. Thanks to @BRSparty for taking efforts and do a research on me. I am just a student of politics. Yes i made mistakes in the past. I never deleted my wrong judgements (tweets) because i am very keen to learn from my mistakes. And more over i want to correct my mistakes in future.… https://t.co/YUIGaFqJtj pic.twitter.com/Gx7oCYAIzf — Partha Das (@partha2019LS) October 9, 2023 తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో అన్నీ నిలిచిపోయాయి -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటిమందికి పైగా మిస్డ్ కాల్స్ ఇచ్చారు
-
కరోనాతో డయాబెటిస్ ముప్పు..!
లండన్: కరోనా సోకిన వారికి డయాబెటిస్ ముప్పు అధికమని బ్రిటిష్ కొలంబియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వేన్‌కవర్‌లోని సెయింట్ పాల్ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడైంది. 20లో ఒక డయాబెటిస్ కేసుకు కరోనా కారణమని తేలింది. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న 6,29,935 మందిని తర్వాత కాలంలో వచి్చన వ్యాధులపై అధ్యయనం చేశారు. కరోనా కారణంగా చక్కెర వ్యాధిగ్రస్తులు 3 నుంచి 5% పెరుగుతున్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ప్రతీ 100 మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 3–5% కేసులకు కరోనాతో సంబంధముందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నవీడ్ జన్జువా చెప్పారు. -
వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. అసంతృప్తి ఎక్కువే 48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు. రెన్యువల్ ప్రీమియం భారం పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం. క్లెయిమ్ సెటిల్మెంట్ 60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు. ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. పరిష్కారాలకు మార్గాలు పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం. ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. -
సర్వేతో ప్రాణం తీశారు!
-
బెట్టింగ్ కోసం ఆక్టోపస్ మోసం!
-
ఆప్‌తో హస్తం పొత్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)తో పొత్తుపై ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్.. అంతర్గత సర్వే ఫలితాల తీరుతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేతలు మెత్తబడినట్లు సమాచారం. ఆప్‌తో జట్టుకట్టే విషయమై ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇటీవల శక్తి యాప్ ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో రాజధాని ఢిల్లీలో బీజేపీకి 35% ఓట్లు, ఆప్‌కు 28%, కాంగ్రెస్‌కు 22% ఓట్లు పడతాయని వెల్లడైంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఢిల్లీ నేతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఢిల్లీ పార్టీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌కు అందజేశారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకునే చాన్సుందని వివరించారు. పొత్తు విషయంలో షీలా తన వ్యతిరేక వైఖరిని మార్చుకోనప్పటికీ, కాస్త వెనక్కి తగ్గారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ ఢిల్లీ విభాగం నేతలు కూడా ఆప్‌తో పొత్తుపై సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీతోపాటు హరియాణాలోనూ ఆప్‌తో పొత్తు కుదిరేందుకు అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతిమంగా, రాహుల్ సానుకూల నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే తీసుకుంటారని భావిస్తున్నారు. అనంతరం సీట్ల పంపిణీకి సంబంధించి రెండు పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. -
నాపై ఎవరి ఒత్తిడీ లేదు: లగడపాటి
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని మంత్రి కె.తారక రామారావు చేసి న ఆరోపణలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోసిపుచ్చారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేశానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆరోపణలపై బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బదులిచ్చారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, తన టీం చేస్తున్న సర్వే గురించి తెలుసుకుని కలుద్దామని గత నవంబర్ 11న స్వయంగా కేటీఆర్ తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ తర్వాత తన సమీప బంధువు ఇంట్లో ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో జరిగిన వాట్సాప్ సం భాషణలను మీడియాకు విడుదల చేశారు. -
తెలంగాణ ఎన్నికలపై లగడపాటి జోస్యం
తిరుమల: తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటనున్నారని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపిన ఆయన కొన్ని విషయాలను మాత్రం మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పోరును ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగడం లేదు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. పలు చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఇండిపెండెట్ల వైపు చూస్తున్నట్టు మా సర్వేలో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లానారాయణపేట్లో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ గెలవబోతున్నారు. సర్వే పూర్తి వివరాలు తెలియజేస్తే.. ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులను ప్రకటించడం ఏ పార్టీపై ప్రభావం చూపదు. ఈ ఎన్నికల్లో గెలువబోయే ఇండిపెండెంట్ అభ్యర్థులందరి పేర్లను.. రోజుకు రెండు చొప్పున 7వ తేదీలోపు ప్రకటిస్తాను. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నార’ని లగడపాటి తెలిపారు. -
ట్రంప్‌పై నమ్మకం లేదా?
ఒట్టావా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్ ఏజెన్సీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఓ సర్వే నిర్వహించింది. ఇరు దేశాల ప్రజలు(ఎంతమంది అన్నదానిపై స్పష్టత లేదు) పాల్గొన్న ఐపీఎస్వోఎస్ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 72 శాతం మంది కెనడియన్లు, 57 శాతం మంది అమెరికన్లు ఈ పరిస్థితులను చక్కదిద్దే సత్తా ట్రూడోకే ఉందని తేల్చారు. 14 మంది కెనడియన్లు, 37 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్ధతుగా ఓట్లేశారు. ఆ లెక్కన మెజార్టీ అమెరికన్లు ట్రంప్‌కు ఆ దమ్ము లేదని తేల్చేశారన్న మాట. ఇక మెజార్టీ ప్రజలు మాత్రం ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎన్ఏఎఫ్టీఏ)-1994ను సవరించాలన్న ట్రంప్ నిర్ణయంపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే 70 శాతం మంది కెనడియన్లు తాము అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటున్నామని సర్వేలో పేర్కొన్నారు. మరోపక్క చాలామట్టుకు మాత్రం ఇరు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధంతో ద్వైపాక్షిక ఒప్పందాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 13-14 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించగా, తాజాగా సర్వే నివేదిక బహిర్గతమైంది. సర్వే నివేదిక.. ట్విటర్ సౌజన్యంతో... -
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే!
గాంధీనగర్/న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగానే.. పలు మీడియా, ప్రైవేటు సంస్థలు మొదటివిడత సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్, టైమ్స్‌నౌ–వీఎంఆర్ సంస్థలు సర్వేల ఫలితాలను బుధవారం వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్ గ్రూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో నిర్వహించిన సర్వేలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురనుందని తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం 10 శాతం ఓట్లతో వెనకబడుతుందని తేలింది. 68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 43–47 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 21–25 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే తెలిపింది. రాజకీయ వేడి రాజుకున్న గుజరాత్లో బీజేపీ గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 182 స్థానాల అసెంబ్లీలో 48 శాతం ఓట్లతో 115–125 స్థానాలు బీజేపీ ఖాతాలోకే వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ 38 శాతం ఓట్లు సాధించి 57–65 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ సంస్థ ప్రభావం పెద్దగా ఉండబోదని కూడా ఇండియాటుడే–యాక్సిస్ సర్వే వెల్లడించింది. కేవలం గుజరాత్‌లోనే సర్వే నిర్వహించిన టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వే కూడా ఇక్కడ బీజేపీకి 118–134 సీట్లు వస్తాయంది. రాష్ట్రవ్యాప్తంగా 6వేల మందిని ప్రశ్నించిన టైమ్స్‌నౌ సర్వే.. కాంగ్రెస్ 49–61 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఈ సర్వే పేర్కొంది. 2012లో (మోదీ గుజరాత్ సీఎంగా) బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది. సర్వేలో అభిప్రాయాలు ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో 66% మంది ప్రధానిగా మోదీ ఉండటం వల్ల గుజరాత్‌కు మేలు జరిగిందని చెప్పగా, 74% మంది మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అయితే జీఎస్టీపై 51 శాతం మంది, నోట్ల రద్దుపై 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో ఇబ్బందులకు గురైనట్లు పేర్కొన్నారు. టైమ్స్‌నౌ సర్వేలో 46 శాతం మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు ‘గుజరాత్ అస్మిత’ (గర్వకారణం) అని అభిప్రాయపడగా.. 21 శాతం మంది ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. 81% మంది మోదీ ‘గుజరాత్ బిడ్డ’ అని.. ఆయన నేతృత్వంలోని బీజేపీకి ఓటేస్తామని తెలిపారు. 2012లో ఇదే అభిప్రాయం 60% మందిలో వ్యక్తమైంది. ఇరుపార్టీల ఓట్ల శాతంలో 2012తో పోలిస్తే పెద్దగా తేడా ఉండదని ఈ సర్వే పేర్కొంది. అయితే బీజేపీ ప్రభుత్వంపై గతంలో (2012లో 60 శాతం సానుకూలత) కంటే సదభిప్రాయం తగ్గింది. 54% మంది బీజేపీ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ కాస్త పెరగొచ్చని టైమ్స్‌నౌ పేర్కొంది. గుజరాత్‌పై సర్వే ఫలితాలు ఇండియాటుడే టైమ్స్‌నౌ –యాక్సిస్ వీఎంఆర్ బీజేపీ 115–125 118–134 కాంగ్రెస్ 57–65 49–61 ఇతరులు 0–2 0–3 -
వచ్చే రెండేళ్లలో ఏం చేద్దాం!
-
వచ్చే రెండేళ్లలో ఏం చేద్దాం!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ ► నేడు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ► రాష్ట్రావతరణ వేడుకలు, సంస్థాగత అంశాలపై చర్చ ► ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపైనా స్పష్టత సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న రెండేళ్లలో ఏ లక్ష్యాలతో పనిచేయాలి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా ఎలా తీసుకువెళ్లాలి అన్న అంశాలపై వివరించనున్నారు. ఇందుకు శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన సభ, పార్లమెంటరీ పక్షాలు భేటీ కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. పార్టీ సభ్యత్వాలు, సంస్థాగత కమిటీలపై సమగ్ర చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే ఎజెండా సిద్ధం చేశారు. మూడేళ్లుగా రాష్ట్రంలో చేపడుతున్న పథకాల ఫలితాలను మదింపు చేస్తూనే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమీక్ష జరపనున్నారు. గత నెలలోనే పార్టీ 16వ ప్లీనరీ, ఆవిర్భావ సభ నిర్వహించిన పార్టీ నాయకత్వం ఇంకా కమిటీల ఎంపికను మాత్రం పూర్తి చేయలేదు. రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్.. పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ, జిల్లాల్లో నియోజకవర్గ కమిటీలను నియమించాల్సి ఉంది. దీంతోపాటు ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. సర్వే ఫలితాలపై ఉత్కంఠ ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి సీఎం కేసీఆర్ సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు మూడో సర్వే రిపోర్టు కూడా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సమావేశంలో సర్వే వివరాలు బయటపెడతారని అభిప్రాయపడుతున్నారు. గత సర్వేల్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, చందూలాల్, పద్మారావు పనితీరు సరిగా లేదని తేలింది. వీరితోపాటు ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, పుట్టా మధు, రేఖానాయక్, భాస్కర్‌రావు, మదన్‌లాల్, ప్రశాంత్ రెడ్డి, సంజీవరావు, రాజేందర్ రెడ్డి, రెడ్యానాయక్, కొండా సురేఖ, మనోహర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, షకీల్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. దీంతో ఈసారి సర్వే ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. -
సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్
సాక్షి, హైదరాబాద్ : సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పాలనకు వస్తున్న ప్రజాధరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ రెండున్నరేళ్ల పాలనకు 72 శాతానికిపైగా ప్రజల మద్దతు రావడం చూసి సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి నేత షబ్బీర్ అలీ ఏం చేయాలో పాలుపోలేని పక్షంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో లక్షా 50వేల మందిని అరెస్టు చేసి, జైళ్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సౌకర్యార్థంగా ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని నిర్మిద్దామంటే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సచివాలయంలో, కనీసం పార్కింగ్ సౌకర్యం లేదని, అందులో కొన్ని భవనాలు నిజాం కాలంలో కట్టినవి కాగా, మరికొన్ని 50 నుంచి 60 ఏళ్ల కిందట నిర్మించినవని పేర్కొన్నారు. ఒక ఆఫీసు సెక్రటేరియట్లో, మరొకటి ఎర్రగడ్డలో, ఇంకొకటి మలక్‌పేటలో ఉంటే ప్రజలకు ఇబ్బంది కాదా.. అని ప్రశ్నించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం విపక్షాలా ఎజెండా మోస్తున్నారని, తెలంగాణ ప్రజల్లో తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు వద్దనే రీతిలో వ్యవహరిస్తున్న కోదండరాం రైతు దీక్ష ఎలా చేస్తారని కర్నె ప్రశ్నించారు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను ఒక పక్క వ్యతిరేకిస్తూ మరో పక్క దీక్ష చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా అని నిలదీశారు. సమయం కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కోదండరాం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అభినందించలేక పోతున్నారని విమర్శించారు. -
హోరాహోరీ
సాక్షి, చెన్నై: అధికార పగ్గాలు అమ్మకే అని ఓ సారి, కాదు..కాదు కరుణకే అంటూ మ రో సారి..! సర్వే ఫలితాలు ఇన్నాళ్లు రాష్ట్రంలో సాగుతూ వచ్చాయి. అయితే, ప్రప్రథమంగా నువ్వా...నేనా అన్నట్టుగా వెలువడ్డ సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. అమ్మకు 73 , కరుణకు 64 గ్యారంటీ అని ప్రకటించిన ఈ తాజా సర్వే, 83 స్థానాల్లో నువ్వా...నేనా అన్నట్టు హోరా హోరీ సమరం నెలకొని ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ కూట మి...ఇలా..పంచ ముఖ సమరం నెలకొంది. మునుపెన్నడూ లేని రీతిలో సాగుతున్న ఈ పోరులో ఓటరు నాడి ఎటో అన్నది అంతు చిక్క డం లేదు. పెద్ద ఎత్తున ఓట్ల చీలిక తథ్యం అన్నది మాత్రం స్పష్టం అవుతున్నది. ఈ చీలిక ఆధారం గా గెలుపు గుర్రాలు అవతరించబోతున్నాయి. అది ఎవరు..? అన్న ప్రశ్న సర్వత్రా నెలకొని ఉన్నది. స్థానిక, జాతీయ సంస్థలు, మీడియా వర్గాలు ఇప్పటి వరకు సాగిన సర్వేల్లో విచిత్ర ఫలితాల్ని ప్రకటించాయి. ఓ సంస్థ ఏమో అమ్మ జయలలిత సీఎం కావడం ఖాయం అని, క్వీన్ స్వీప్ తథ్యం అంటే, మరో సంస్థ అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ సీట్లు దక్కుతాయని వివరించాయి. ఇక, మరికొన్ని సర్వేలు కరుణానిధి సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టి తీరుతారంటూ నొక్కి చెప్పాయి. అయితే, ప్రసుత్తం జూనియర్ విగడన్ పత్రిక సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. ఇందుకు కారణం ఆ ఫలితాలే. తమిళనాడులో నెంబర్ ఒన్‌గా వారంలో రెండు రోజులు వెలువడే పత్రికగా జూనియర్ విగడన్ ప్రఖ్యాతి గాంచింది. ఈ సర్వే మేరకు పేద, మధ్య తరగతి, యువతరం ఓటర్ల వద్ద సేకరించిన వివరాల మేరకు ఈ సర్వే వివరాల్ని ప్రకటించి ఉన్నారు.రాష్ట్రంలోని 234 స్థానాల్లో 73 స్థానాల్లో అన్నాడీఎంకే, 64 స్థానాల్లో డీఎంకే గెలుపు ఖాయం అయిందని వివరించారు. కాంగ్రెస్ పది చోట్ల, పీఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్, ఎంఎంకేలు తలా ఓ చోట్ల గెలుపు తథ్యం అని ప్రకటించారు. 151 ఒక్క స్థానాలు పోగా, మిగిలిన 83 స్థానాల్లో గెలుపు ఎవరిదీ..? అన్నది నిర్ణయించలేమని స్పష్టం చేసింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గాల్లో నువ్వా...నేనా అన్నట్టుగా సమరం ఉందని, గెలుపు ఎవరిదో అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే అన్నట్టుగా ఆ పత్రిక స్పష్టం చేసింది.