సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని మంత్రి కె.తారక రామారావు చేసి న ఆరోపణలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోసిపుచ్చారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేశానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆరోపణలపై బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బదులిచ్చారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, తన టీం చేస్తున్న సర్వే గురించి తెలుసుకుని కలుద్దామని గత నవంబర్ 11న స్వయంగా కేటీఆర్ తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ తర్వాత తన సమీప బంధువు ఇంట్లో ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల టీఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో జరిగిన వాట్సాప్ సం భాషణలను మీడియాకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment