krt
-
రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
-
నాపై ఎవరి ఒత్తిడీ లేదు: లగడపాటి
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని మంత్రి కె.తారక రామారావు చేసి న ఆరోపణలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోసిపుచ్చారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేశానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆరోపణలపై బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బదులిచ్చారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, తన టీం చేస్తున్న సర్వే గురించి తెలుసుకుని కలుద్దామని గత నవంబర్ 11న స్వయంగా కేటీఆర్ తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ తర్వాత తన సమీప బంధువు ఇంట్లో ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో జరిగిన వాట్సాప్ సం భాషణలను మీడియాకు విడుదల చేశారు. -
ఇసుక రీచ్‌ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఇసుకరీచ్‌లో కూలీలు, డ్రైవర్లతో కేటీఆర్ ముచ్చటించారు. మైనింగ్ జరుగుతున్న తీరు, ఇసుక తరలింపుపై ఆయన ఆరా తీశారు. ఇదే విధంగా ఇతర జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. మైనింగ్ జాతీయ సంపద అని, అక్రమాలను సహించేది లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. పర్మిట్ ఉన్నా రాత్రివేళల్లో ఇసుక రవాణా నిషేధం అని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అక్రమ దందాను అరికట్టాలంటే రెవిన్యూ, పోలీసు, మైనింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు.