లగడపాటి రాజగోపాల్(పాత చిత్రం)
తిరుమల: తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటనున్నారని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపిన ఆయన కొన్ని విషయాలను మాత్రం మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పోరును ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు.
‘తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగడం లేదు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. పలు చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఇండిపెండెట్ల వైపు చూస్తున్నట్టు మా సర్వేలో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లానారాయణపేట్లో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ గెలవబోతున్నారు. సర్వే పూర్తి వివరాలు తెలియజేస్తే.. ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులను ప్రకటించడం ఏ పార్టీపై ప్రభావం చూపదు. ఈ ఎన్నికల్లో గెలువబోయే ఇండిపెండెంట్ అభ్యర్థులందరి పేర్లను.. రోజుకు రెండు చొప్పున 7వ తేదీలోపు ప్రకటిస్తాను. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నార’ని లగడపాటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment