
లండన్: కరోనా సోకిన వారికి డయాబెటిస్ ముప్పు అధికమని బ్రిటిష్ కొలంబియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వేన్‌కవర్‌లోని సెయింట్ పాల్ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడైంది. 20లో ఒక డయాబెటిస్ కేసుకు కరోనా కారణమని తేలింది. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న 6,29,935 మందిని తర్వాత కాలంలో వచి్చన వ్యాధులపై అధ్యయనం చేశారు.
కరోనా కారణంగా చక్కెర వ్యాధిగ్రస్తులు 3 నుంచి 5% పెరుగుతున్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ప్రతీ 100 మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 3–5% కేసులకు కరోనాతో సంబంధముందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నవీడ్ జన్‌జువా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment