ఒట్టావా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్ ఏజెన్సీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఓ సర్వే నిర్వహించింది.
ఇరు దేశాల ప్రజలు(ఎంతమంది అన్నదానిపై స్పష్టత లేదు) పాల్గొన్న ఐపీఎస్‌వోఎస్ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 72 శాతం మంది కెనడియన్లు, 57 శాతం మంది అమెరికన్లు ఈ పరిస్థితులను చక్కదిద్దే సత్తా ట్రూడోకే ఉందని తేల్చారు. 14 మంది కెనడియన్లు, 37 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్ధతుగా ఓట్లేశారు. ఆ లెక్కన మెజార్టీ అమెరికన్లు ట్రంప్‌కు ఆ దమ్ము లేదని తేల్చేశారన్న మాట. ఇక మెజార్టీ ప్రజలు మాత్రం ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎన్‌ఏఎఫ్‌టీఏ)-1994ను సవరించాలన్న ట్రంప్ నిర్ణయంపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు.
అయితే 70 శాతం మంది కెనడియన్లు తాము అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటున్నామని సర్వేలో పేర్కొన్నారు. మరోపక్క చాలామట్టుకు మాత్రం ఇరు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధంతో ద్వైపాక్షిక ఒప్పందాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 13-14 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించగా, తాజాగా సర్వే నివేదిక బహిర్గతమైంది.
సర్వే నివేదిక.. ట్విటర్ సౌజన్యంతో...
Comments
Please login to add a commentAdd a comment