independence day speech
-
సీఎం వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవం సందేశంపై అక్కసు
-
Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని
Updates ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ ►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం ►2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి ►దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి ►భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ►ప్రపంచానికి మిత్రుడిగా భారత్ మారింది ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్ కోరుకుంటోంది ►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల శిక్షణ ►దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చాం ►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది ►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుంది ►భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు ►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం ►జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం ►మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం ►భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం ►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. ►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం ►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోంది. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది. ►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది. ►స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉంది. ►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది. ►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది ►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ►ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం ►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది. ►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం ►సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేశాం ►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది ►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం ►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. ►టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది. ►డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోంది. ►గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ►శాటిలైట్ రంగంలో మనమే ముందున్నాం. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్తిఉంది. ►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ ►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం ►ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ ►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం. ►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ ►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు ► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ముగియనున్నాయి. ►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సామాన్యులే అతిథులు ►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు ►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు ►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం ►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు ►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని ►రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ ►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు. ►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. -
కస్తూర్బా అప్పుడు గాంధీ వెంటే నడిచింది: రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ పటంలో భారత్ ఇవాళ సముచిత స్థానంలో ఉందని.. అలాగే ఆడబిడ్డలు తమకు ఎదురయ్యే ప్రతీ సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారామె. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది మనందరికీ మహిమాన్వితమైన శుభ సందర్భం. ఆ సంబరం అంబరాన్నంటడం చూసి నా ఆనందానికి అవధుల్లేవు. భారతదేశంలోని నగరాలు, గ్రామాలలో పిల్లలు, యువత, వృద్ధులు.. ప్రతి ఒక్కరు ఎలా ఉత్సాహంగా జెండా పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారో చూడడం సంతోషంగా ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇవాళ దేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా.. అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని కూడా పెంచుకున్నట్లు మనం చూస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి, మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ఫోరమ్‌ల నాయకత్వాన్ని, ముఖ్యంగా G-20 అధ్యక్ష పదవిని కూడా చేపట్టింది. జీ20 ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ప్రపంచ ప్రసంగాన్ని సరైన దిశలో రూపొందించడంలో సహాయపడటానికి ఇది ఒక ప్రత్యేక అవకాశం. G-20 అధ్యక్షతతో.. భారతదేశం వాణిజ్యం, ఫైనాన్స్‌లో నిర్ణయాధికారాన్ని సమానమైన పురోగతి వైపు నడిపించగలదు. వాణిజ్యం, ఆర్థిక అంశాలకు అతీతంగా, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. గ్లోబల్ సమస్యలతో వ్యవహరించడంలో భారతదేశపు నిరూపితమైన నాయకత్వంతో, సభ్య దేశాలు ఈ రంగాలపై సమర్థవంతమైన చర్యను ముందుకు తీసుకెళ్లగలవని నేను విశ్వసిస్తున్నాను. #WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "I am happy to note that the economic empowerment of women is being given special focus in our country. Economic empowerment strengthens the position of women in the family and society. I urge all fellow… pic.twitter.com/gCv13rrqft — ANI (@ANI) August 14, 2023 మన దేశంలో మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని గమనించడానికి నేను సంతోషిస్తున్నాను. ఆర్థిక సాధికారత కుటుంబం, సమాజంలో మహిళల స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను తోటి పౌరులందరినీ కోరుతున్నాను. మా సోదరీమణులు, కుమార్తెలు ధైర్యంగా సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. #WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "Today, we see that India has not only regained its rightful place on the world stage, but it has also enhanced its standing in the international order. India is playing a crucial role in promoting… pic.twitter.com/yH2fwaJUbX — ANI (@ANI) August 14, 2023 మన స్వాతంత్య్ర పోరాటంలో మహిళల అభివృద్ధి ఆదర్శం. భారత స్వాతంత్ర సమరంలో.. కస్తూరాబా గాంధీ, మహత్మాగాంధీ వెంటనే ఉండి నడిచింది. ఇప్పుడు.. దేశాభివృద్ధిలో అన్నివిధాలుగా మహిళలు పాలుపంచుకుంటున్నారు. అవి ఎలా ఉన్నాయంటే.. కొన్నేళ్ల కిందట ఎవరూ కూడా ఊహించుకోలేని స్థాయిలో ఉన్నతస్థానాలను సైతం అధిరోహిస్తున్నారు అని హర్షం వ్యక్తం చేశారు. ఈ దేశంలో అంతా సమాన పౌరులే. ప్రతి ఒక్కరికి ఈ భూమిలో సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయి. ఈ గుర్తింపు.. కులం, మతం, భాష అన్ని ఇతరాలను అధిగమించాయి అని వ్యాఖ్యానించారామె. -
సీఎం ప్రసంగంపై ‘ఈనాడు’ పైత్యం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పైత్యపు రాతలు రాయడంలో ఆరితేరిన ఈనాడు స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ఆ పైత్యాన్ని ప్రదర్శించింది. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు సీఎం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లు భ్రమించి దాన్నో కథనంగా వండి వార్చేసి అభాసుపాలైంది. ప్రతిరోజు చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాల్లో అష్ట వంకర్లు, లెక్కలేనన్ని తడబాట్లు ఉన్నా వాటినే ఆణిముత్యాలుగా భావించి తాటికాయంత అక్షరాలతో ఆ పత్రికలో అచ్చేసుకోవడానికి అలవాటుపడ్డ రామోజీకి సీఎం జగన్ ప్రసంగంలో మాత్రం అన్నీ తడబాటుగానే కనిపించాయి. గుంటూరులో టీడీపీ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో చంద్రబాబు ప్రసంగంలో చాలా తడబాట్లు ఉన్నా ఈనాడుకు అవి వేద మంత్రాల్లా వినిపించాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియని విధంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నా ఈనాడుకు మాత్రం అవి ఎంతో వినసొంపుగా వినిపించాయి. కానీ, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయినట్లు చంద్రబాబు చెప్పినా ‘సాక్షి’ మాత్రం హుందాగా వ్యవహరించి ఆ తప్పును ప్రచురించలేదు. అవేకాదు.. అలాంటి ఆణిముత్యాల్లాంటి తప్పులు చంద్రబాబు ప్రసంగంలో నిత్యం వస్తున్నా వాటిని సాక్షి ఏనాడూ వెల్లడించలేదు. కానీ, ఈనాడు మాత్రం కావాలని సీఎం జగన్ ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లు రాసి ఆయనపై ఉన్న ఆక్రోశాన్ని, కడుపుమంటను వెళ్లగక్కింది. కొన్ని పదాలు పలకడంలో తడబాటుకు గురైనట్లు భావించి తానే తడబాటుకు గురైంది. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన పదాల్లో తడబాటు లేకపోయినా సేద్యాన్ని స్వేద్వం, అభ్యుదయాన్ని అభ్యుద్వయం అన్నట్లు, ఇంకా పలు పదాలను పలకలేకపోయినట్లు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసింది. నిజానికి.. ఈ మూడేళ్లలో సీఎం కొన్ని వందల సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రసంగించారు. అప్పుడెప్పుడు ఈనాడుకు కనపడని తడబాటు ఒక్కసారిగా ఇప్పుడే కనిపించడం వెనుక సీఎం జగన్‌పై విషప్రచారం చేయడమే రామోజీ ఉద్దేశంగా కనపడుతోంది. ఇది కూడా చదవండి: వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్ అవ్వాల్సిందే.. -
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం
-
విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తితో తండ్రి ప్రసంగిస్తుండగా, అతడిని వీడియోలో బంధిస్తున్న కూతురు. చుట్టూ పండుగ వాతవరణం. అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. ప్రసంగిస్తున్న వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన కాప్రా, వంపుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీవిల్లాస్‌లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్ సభ్యుడైన ఉప్పల సురేశ్ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్య్రోద్యమ చర్రితను చెబుతూ.. కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. సురేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. బాగ్అంబర్పేట్ డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సురేష్‌కు తల్లిదండ్రులు యాదగిరి, సరోజని, భార్య కరుణ, కూతురు మైత్రి, కొడుకు ధర్మపాల్ ఉన్నారు. తండ్రి యాదగిరి హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఉన్న వేదిక్ విద్యాలయ అధ్యక్షుడుగా ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన యాదగిరి, కొడుకు మరణవార్త విని హుటాహుటిన ఇంటికి వచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆయన బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. సురేశ్ కూతురు మైత్రి సీఏ చదువుతుండగా, కొడుకు ధర్మపాల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ధర్మపాల్ రెండ్రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. (క్లిక్: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం) -
‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు. -
స్వాతంత్య సమరయోధుల త్యాగాలను మరిచిపోలేం: రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్ విజేతలను అభినందించారు. కరోనాపై పోరు ఇంకా ముగియలేదని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని రాష్ట్రపతి తెలిపారు. -
నవరత్నాలతో జనహితం
గ్రామ స్వరాజ్యం అన్నమహాత్మా గాంధీజీ స్వప్నం.. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నబాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానం నన్నెంతగానో ప్రభావితం చేసింది. వారి ఆలోచనలు, నేటికీ నెరవేరని ప్రజల అవసరాలు..ఈ రెండింటి ప్రేరణతోనే నవరత్నాలు రూపొందాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అన్ని విధాలా వెనుకబాటు తనం, అవినీతి, దళారీలు, సామాజిక–ఆర్థిక– రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం ‘నవరత్నాలు’ ప్రకటించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నవరత్నాల పథకాల ద్వారానే వ్యవస్థలో సత్వర మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నర నెలల ప్రభుత్వ పాలనలో ప్రజల మేలు కోరి, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, చేసిన చట్టాలు, అమలు చేస్తున్న విధానాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప భావాలతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. మూడు రంగుల జెండాకు, ఆ జెండాను ఇదే విజయవాడలో రూపొందించిన పింగళి వెంకయ్య గారికి ఎప్పటికీ మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంటుంది. మహాత్మా గాంధీ సహా ఎందరో జాతీయోద్యమ నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. భారత మాతకు వందనం చేస్తూ.. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డా ఈ గడ్డకు రుణపడి ఉండాలన్న భావం ఉండాలని చెబుతున్నా. స్వాతంత్య్ర పోరాటం మనందరినీ మంచి మార్గంలో నడిపించే మహాశక్తి’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. వ్యవస్థను మార్చుకుందాం ‘రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు ఇచ్చినా, 72 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, మాతా శిశు మరణాలు మనం చెబుతున్న అభివృద్ధికి మాయని మచ్చలే. పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి. మానవాభివృద్ధి సూచికల్లో మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. ఈ 72 ఏళ్లలో దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో ఎంతో అభివృద్ధి ఉంది. అయితే అభివృద్ధితో పాటు దాన్ని అందాల్సిన వారికి అందకుండా ఎక్కడికక్కడ మింగేసే అవినీతి, దళారీ వ్యవస్థ అంతకంటే వేగంగా బలపడింది. మరి ఈ వ్యవస్థను ఇలాగే వదలి వేస్తే మన స్వాతంత్య్రానికి అర్థం ఉంటుందా? అందుకే రెండున్నర నెలల్లోనే ధైర్యంగా ముందడుగులు వేస్తూ.. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు పెద్ద పీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు శాశ్వత కమిషన్.. విప్లవాత్మకం బీసీ కులాలు బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్ బోన్ క్లాసులు.. అన్న మాటలకు కట్టుబడి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టేలా తొలిసారిగా చట్టం చేస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులన్నింటినీ మూయిస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమాని హక్కులకు భంగం కలుగకుండా దాదాపు 15 నుంచి 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేసిన రాష్ట్రం కూడా మనదేనని చెప్పడానికి గర్విస్తున్నాను. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నెన్నో విప్లవాత్మక నిర్ణయాలు మానవ అభివృద్ధి సూచికల్ని మెరుగు పరచడంతో పాటు గ్రామీణులకు కూడా సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించి పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తగ్గించే చర్యలు చేపడుతున్నాం. మౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పుతున్నాం. పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. రూ.5 వేల గౌరవ వేతనంతో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించబోతున్నాం. కనీవినీ ఎరుగని రీతిలో 4 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశ చరిత్రలోనే రికార్డు నెలకొల్పబోతున్నాం. గ్రామ, వార్డు వలంటీర్ల నియామకంలో కూడా మహిళలకు సగం వాటా ఇస్తున్నాం. అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాల ద్వారా చదువుల విప్లవం తీసుకురాబోతున్నాం. స్కూళ్ల రూపు రేఖల్ని కూడా మార్చబోతున్నాం. ఆరు నెలల క్రితం వరకు వచ్చిన రూ.1000 పింఛన్ ఇప్పుడు రూ.2,250 అయ్యింది. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పెంచుతాం. పింఛన్ పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే.. వారి వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే అన్ని వర్గాల వారికి ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నాం. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు కూడా పింఛన్ ఇచ్చే పథకంపై ఆలోచిస్తున్నాం. 104, 108 సర్వీసులను గాడిలో పెడుతున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని రెండో ఏడాది నుంచి నాలుగు విడతలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం. సున్నా వడ్డీకి రుణాలిస్తాం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా రూ.75 వేలు సాయం చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నాం. అందరికీ మేలు చేస్తాం ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను అమలు చేస్తున్నాం. సీపీఎస్‌కు బదులు పాత పింఛన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేశాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు మొదటి కేబినెట్లోనే నిర్ణయించాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. స్పందన కార్యక్రమం కింద ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గుళ్లలో పూజారులకు, మసీదుల్లో ఇమాంలకు, మౌజన్లకు, చర్చిలో పాస్టర్లకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోని రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. ఆ దేవుడి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమైంది. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సభ ద్వారా మనందరమూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుదాం. జైహింద్..’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా.. పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండరు పనులను ఖరారు చేసే ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లో పెడతాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రవేశ పెట్టడం ద్వారా ల్యాండ్ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టనున్నాం. రైతులకు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.84,000 కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు. ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అక్వా రైతులకు రూ 1.50కే యూనిట్ కరెంటును అందిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు పంటల బీమా కోసం 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ.2,164 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే కడుతుంది. గత ప్రభుత్వ విత్తన బకాయీలు రూ.384 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500లు చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల చేశాం. పామాయిల్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. రైతు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం అందిస్తున్నాం. 2018 – 19 సంవత్సరానికి రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. తుపాను, కరువు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఈ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందించబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రైతుల అభ్యున్నతి కోసం సహకార రంగ పునరుద్ధరణ, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, కోల్డ్ స్టోరేజీలు, ల్యాబ్‌ల ఏర్పాటు, ఉచిత బోర్లు, జలయజ్ఞం పనులు సత్వరమే పూర్తి చేయడంతో పాటు ఇతరత్రా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గోదావరి జలాలను సాగర్, శ్రీశైలంకు తరలించటం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించటానికి ప్రణాళికలు వేస్తున్నాం. 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్–రోడ్డు కనెక్టివిటీతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. -
గాంధీ, అంబేద్కర్ ప్రేరణతోనే నవరత్నాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనావిధానం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, ఆ మహానుభావుల ప్రేరణతోనే ‘నవరత్నాలు’ పథకాలను రూపొందించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తవుతున్నా.. నేటికి సమాజంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయనిమచ్చలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పరంగా ఇప్పటికీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్య్రం పొందలేకపోతున్నవారి కోసం నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన పలువురు రాష్ట్ర పోలీసులకు మెడల్స్ అందించారు. అనంతరం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రస్తావనతో తన ప్రంసంగాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలు, నవరత్నాలు, సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాలను తన ప్రంసగంలో ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. మద్యపానాన్ని నిషేధించేదిశగా నూతన మద్య విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.రైతులకు, పేదలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు వీలుగా చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు గగ్గోలు పెడుతున్నారని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నానా యాగీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రగతిని మార్చే చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు తీసుకొచ్చామని, నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం తీసుకొచ్చామని, ఇలాంటి చట్టాలు తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు రూ. 7 లక్షల పరిహారం అందజేస్తున్నామని చెప్పారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని తెలిపారు. ఇంకా వైఎస్ జగన్ తన ప్రంసగంలో ఏమన్నారంటే.. అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి.. 73వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 1857లో మంగళ్ పాండే బ్రిటీష్ పాలకులపై తిరగబడి సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. ఆ తరువాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి. మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి. మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండటానికి వీల్లేదు. విభజించి పాలించే ఆలోచనలు పోవాలి.. సంఘ సంస్కరణలు రావాలి. కులాలు, మతాలు, వర్గాలు అన్న విభేదాలు చెరిగిపోవాలి. మనవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్ వాడి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు. మన దేశంలో ఉన్న అంటరానితనానికి, మనుషుల్ని విభజిస్తున్న కులం పునాదుల్ని పెకలించడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం. వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు.. వందలకొద్ది సంస్థానాల ఈ దేశం.. స్వాతంత్ర్య పోరాట ఫలితంగానే ఒక్కటయింది. వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, జైహింద్, క్విట్ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగిలించాయి’ అని గుర్తుచేశారు. ఒక జాతీగానీ, ఒక దేశంగానీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతే.. ఎన్ని వందల ఏళ్లు బానిసలుగా, సెకండ్ క్లాస్ సిటిజెన్లుగా మానవహక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో.. ఎన్ని పోరాటాలు, ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర్య ఉద్యమం చెప్తోంది. వ్యవస్థలో మార్పు కోసమే నవరత్నాలు ‘1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం దేశ ప్రజలందరికీ వచ్చిందా? లేక కొందరికే వచ్చిందా? అన్నదానిపై మనం బాధ్యతగా సమాధానం వెతకాలి. స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. అని ఆ అభివృద్ధి ఫలాలు అందాల్సిన వారికి అందలేదు. అవినీతి, దళారీ వ్యవస్థ వేగంగా బలపడింది. ఎలాంటి విలవలూ లేని గత రాజకీయాన్ని కొనసాగిద్దామా? లేక ఈ వ్యవస్థను మార్చుకుందామా? మనం చెడిపోయిన ఈ వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటూ.. అవినీతి, అధికారం పాలు, నీళ్లలా కలిసిపోయాయని.. అవి అలాగే ఉంటాయని వదిలేద్దామా? లేక ఈ పరిస్థితులను మారుద్దామా? అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించాల్సిన సమయం. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువద్దామనే దృఢ నిశ్చయంతో నవరత్నాలు తీసుకొచ్చాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయిన వారి కోసం నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పదవుల్లో రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టాలు తీసుకొచ్చాం’ అని సీఎం జగన్ తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు ‘మన వ్యవస్థను మార్చుకుందామన్న దృఢ నిశ్చయంతో ధైర్యంగా ముందండుగువేశాం. సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవీని ఎరుగనివిధంగా బడుగులు, మహిళలకు పెద్దపీట వేస్తూ చరిత్రగతిని మార్చే చట్టాలను తీసుకొచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. బీసీ కులాలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాన్‌బోన్‌లుగా వెన్నెముక కులాలుగా చేస్తామన్న మాటకు కట్టుబడి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పేలా సామాజిక న్యాయానికి బాటలు వేసే చట్టాలు చేశాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదేని గర్వంగా చెప్తుతున్నా. గతంలో ఎప్పుడూలేనివిధంగా నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలను తీసుకొచ్చాం’ అని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ‘పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో 75శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే కేటాయించాలంటూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ముందుగానే తెలుసుకొని.. స్థానిక యువతకు అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి.. అటు పరిశ్రమలకు, ఇటు స్థానికులకు వెన్నుదన్నుగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యనియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులు మూయించడమే కాకుండా వాటిని శాశ్వతంగా మూయించేందుకు లాభాపేక్ష లేకుండా అక్టోబర్ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మేలా నిర్ణయం తీసుకున్నాం. భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైఎస్సార్ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ‘చదువును వ్యాపారంగా మార్చేసిన కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్నుతీసుకొచ్చాం. విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను మొదటి సమావేశాల్లోనే ఏర్పాటుచేసిన ప్రభుత్వం మనది. ఇరిగేషన్ కాంట్రాక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టులు అంటే కేవలం కమీషన్లు, దోపిడీలకు మారుపేర్లుగా మారిన నేపథ్యంలో ఈ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికీ జవాబుదారితీనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలోనే సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. జ్యుడీషియల్ ప్రివ్యూ యాక్ట్ ద్వారా టెండరు పనుల ఖరారు ప్రక్రియను హైకోర్టు న్యాయమూర్తి ముందు పెడుతూ..ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మనది. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనది. వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటినీ పారదర్శకత పెంచేలా ఆన్లైన్లో పెడతాం.. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి.. మునపటి రేట్ల కంటే తక్కువకే సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకువస్తే వారికే ఆ అవకాశం ఇస్తాం. ల్యాండ్ మాఫియాకు చెక్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ల్యాండ్ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టేవిధంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. రైతు అప్పుల్లో మునిగితేలుతుంటే.. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం వాటా పెరిగిందని చెప్పడం వారిని అవమానించడమే అవుతుంది. కాబట్టే రైతు ఆనందం, రైతు ఆదాయంఈ రెండూ పెరిగేందుకు ఏం చేయాలన్న ఆలోచనతో ఈ రెండున్నర నెలల్లోనే మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 84వేల కోట్ల పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే.. ఆ రుణాల మీద వడ్డీ ఉండదు. మన రైతన్నను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయటానికి ఈ చర్యలు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60శాతానికిపైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి మిగిలిన 40శాతం ఫీడర్లలో కూడా పగటిపూట పూర్తిస్థాయిలో విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం రూ. 1700 కోట్లు ఇవ్వలేం అని విద్యుత్ సంస్థలు చెబితే.. వెంటనే ఆ మొత్తాన్ని కేటాయించి, పనులు ముందుకు తీసుకువెళుతున్నాం. భారత దేశ చరిత్రలోనే ఒక రికార్డు ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ కరెంటు అందిస్తున్నాం. తద్వారా రూ. 720 కోట్ల మేర ఆక్వా రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. పంటల బీమా కోసం 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ. 2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే కడుతుంది. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి రూ. మూడువేల కోట్లతో ధరల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించి రూ. 384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ. 1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్‌గా విడుదల చేశాం. 2018-19 సంవత్సరానికి సంబంధించిన రూ. 2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అంతేకాకుండా తుపానులు, కరువుల కారణంగా పంట నష్టపోయిన రైతులను గాలికి వదిలేయకుండా.. ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను మార్చి.. రైతులను ఆదుకోవడానికి రూ. రెండువేల కోట్లతో విపత్తు సహాయక నిధిని ఏర్పాటు చేశాం. ఖరీఫ్‌లో విపత్తు వస్తే రబీలోపు నష్టపరిహారం అందిస్తాం. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబానికీ రూ. 12,500 చొప్పున ఈ అక్టోబర్ నుంచే అందించబోతున్నాం. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే 7 నెలల ముందే ఈ రబీ సీజన్ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. మొత్తం 55 లక్షల మంది రైతుల కుటంబాలకు దాదాపు రూ. 8,750కోట్లు అందజేయబోతున్నాం. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్నాం ఇంత భారీమొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించటం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారత దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మొదటి ఏడాదే సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరోజీలు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లభించేలా భరోసా ఇస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ వాటి నాణ్యత పరిశీలించేలా లేబొరెటరీలు ఏర్పాటు చేస్తాం. -
మోదీ చివరి అస్త్రం వాడారు
ఇస్లామాబాద్/శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శించారు. పాక్ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అసెంబ్లీలో ఇమ్రాన్ మాట్లాడారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్‌లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. భారత్ చర్యకు నిరసనగా దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్, ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావ దినంగా పాటిస్తామని ప్రకటించింది. భారత్ దాడికి సిద్ధమైంది.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాక్ దీటుగా తిప్పికొడుతుందని ఇమ్రాన్ హెచ్చరిం చారు. ‘భారత్ దుందుడుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని మా ఆర్మీకి పూర్తి సమాచారం ఉంది. మీకు(భారత్‌కు) నేను చెప్పేదొక్కటే. భారత్ విసిరే ప్రతీ ఇటుకకు రాయితో జవాబిస్తాం. మీరు ఎలాంటి చర్య తీసుకున్నా, మేం చివరివరకూ పోరాడుతాం. భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధమే జరిగితే అందుకు ప్రపంచశాంతి కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఇమ్రాన్ హెచ్చరించారు. జమ్మూలో ఆంక్షల ఎత్తివేత.. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్న నేపథ్యంలో బుధవారం జమ్మూలో ఆంక్షలను ఎత్తివేశారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ..‘జమ్మూలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశాం. స్కూళ్లు, ఇతర కార్యాలయాలు సాధారణంగానే నడుస్తున్నాయి. కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ సందర్భంగా అక్కడక్కడా చెదరుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరికి పెల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు’ అని తెలిపారు. సామాజికమాధ్యమాల ఆధారంగా పాక్ తప్పుడు వార్తల్ని వ్యాప్తిచేస్తోందనీ, ఈ విషయంలో తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్‌కు ఎంతో మేలు: కోవింద్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లధాఖ్ విభజన తదితర కేంద్ర నిర్ణయాలు.. ఆ రెండు ప్రాంతాలకు విశేషంగా లబ్ధి చేకూరుస్తాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సాయంత్రం ప్రసంగించారు. జమ్మూకశ్మీర్, లధాఖ్‌లో తీసుకొచ్చిన మార్పులతో.. తోటి దేశ ప్రజలతో సమానంగా హక్కులు, ప్రభుత్వ ఫలాలను ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా పొందుతారని, దీనితో ఆ రెండు ప్రాంతాలు విశేషంగా లబ్ధి పొందుతాయని చెప్పారు. దేశ ప్రజలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని కోవింద్ తెలిపారు. ‘దేశ నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఇందులో స్వాతంత్ర్యం ప్రధాన మైలురాయి. దేశ నిర్మాణం కోసం ప్రతి సంస్థ, ప్రతి పౌరుడూ చేయి-చేయి కలిపి.. సామరస్యంతో, ఐక్యతతో కృషి చేయాలి. ఓటర్లకు, ప్రజాప్రతినిధులకు, పౌరులకు, ప్రభుత్వానికి, పౌరసమాజానికి, రాజ్యానికి మధ్య సముచితమైన భాగస్వామ్యం ఉండేలా కృషి చేయాలి’ అని కోవింద్ పిలుపునిచ్చారు. ‘ఓ ప్రత్యేక తరుణంలో మనం స్వాతంత్ర్య దేశంగా 72 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మార్గదర్శి జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించుకోనున్నాం’ అని అన్నారు. అదేవిధంగా సిక్కుయిజాన్ని స్థాపించిన గురువు నానాక్ దేవ్‌జీ 550 జయంతి వేడుకలను కూడా ఈ సంవత్సరమే జరుపుకున్నామని ఆయన స్మరించుకున్నారు. -
పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాను చేసే ప్రసంగానికి సంబంధించి ఆలోచనలు, సూచనలు ఇవ్వాల్సిందిగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రకోట బురుజుపై నుంచి తాను చేసే ప్రసంగం ద్వారా మీ ఆలోచనలను 130 కోట్ల మంది వింటారని ఆయన అన్నారు. నమో యాప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ ఫోరానికి సలహాలు, అభిప్రాయాలు పంపాలని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా పంద్రాగస్టు ప్రసంగానికి సూచనలు కోరుతున్న సంగతి తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మోదీ పాల్గొననున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవే. -
మోదీ ప్రసంగం : టార్గెట్ 2019
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆద్యంతం రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సాగింది. ఎర్రకోట బురుజుల నుంచి దాదాపు 80 నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని గత నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ 2014లో దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాననే సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. మోదీ ముఖ్యంగా మరుగుదొడ్డ నిర్మాణం, ఎల్పీజీ కవరేజ్, విద్యుదీకరణ, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ల వంటి రంగాల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అసాధారణ విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు. సాయుధ దళాలకు ఒన్ ర్యాంక్..ఒన్ పెన్షన్ అమలుతో పాటు రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయించడం, జీఎస్టీ, బ్యాంకింగ్ సంస్కరణలు, సర్జికల్ స్ర్టైక్స్ వంటి అంశాలనూ ప్రధాని ప్రస్తావించారు. గతంలో సందిగ్ధంలో ఉన్న పలు నిర్ణయాలను తాము సాహసోపేతంగా చేపట్టామని వివరించే ప్రయత్నం చేశారు. భారత్ రెడ్‌టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు, రిఫామ్..పెర్ఫామ్..ట్రాన్స్‌ఫామ్‌కు మారిందని..ఇవన్నీ తమ ప్రభుత్వ ఘనతగా చాటుకున్నారు. 2022లో అంతరిక్షానికి భారతీయుడిని పంపుతామని 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల్లో తన నాయకత్వంపై కొత్త ఆశలు రేపారు. ఇక సామాజిక రంగాల్లోనూ తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని పటిష్టం చేయడంతో పాటు బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం కట్టుబడ్డామని చెబుతూ ట్రిపుల్ తలాఖ్ నిషేధాన్ని ఉదహరించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ వారికి మరణ దండనల ఉదంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనకు తిరిగి పట్టం కట్టేలా ప్రజామోదం పొందే ప్రయత్నంగా మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సాగింది. -
ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు!
న్యూఢిల్లీ : పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఏఎన్ఐ, ది టైమ్స్ ఆఫ్ ఇండియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో ఆయన ప్రధానంగా ఐదు అంశాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యోగాల కల్పన, దేశ ఆర్థిక వ్యవస్థ, అస్సాంలో దేశ పౌరులను గుర్తిస్తూ ఎన్ఆర్సీ విడుదల చేసిన జాబితా, దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం’పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏటా కొత్తగా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ నరేంద్ర మోదీ విస్తృతంగా చేసిన ప్రచారం యువత మీద ప్రధాన ప్రభావం చూపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధించిందని ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నించగా, ఉద్యోగాలు బాగానే కల్పిస్తున్నామని, అయితే ఎన్ని ఉద్యోగాలో లెక్క తేల్చి చెప్పడానికి డేటా అందుబాటులో లేదని ఆయన అన్నారు. డేటా లేనంత మాత్రాన ఉద్యోగాలు కల్పించడం లేదనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. 68 లక్షల ఉద్యోగాలు కల్పించామని బెంగాల్ ప్రభుత్వం, 53 లక్షల ఉద్యోగాలు కల్పించామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించుకున్నాయని, అంటే ఇతర రాష్ట్రాలుగానీ, కేంద్రంగానీ ఉద్యోగాలు కల్పించడం లేదనుకోవాలా, అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లయితే గత జనవరి నెలలో ఓ టెలివిజన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడీలు అమ్ముకోవడం ఉపాధి’ కాదా? అని స్వయంగా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందో మోదీకే తెలియాలి. ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 4వ తేదీన మీడియాతో మరాఠాల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ ‘రిజర్వేషన్లే అంగీకరించామనుకోండి, వారికి ఇవ్వడానికి ఉద్యోగాలు ఎక్కడ? ఐటీ కారణంగా బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వ నియామకాలే పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంకెక్కడా ఉద్యోగాలు?’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మోదీకి భిన్నంగా ప్రతిపక్షాల్లో, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే గడ్కారీ ఎందుకు మాట్లాడారు? దళితులు, మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న మూక హత్యల గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దీనికి సంబంధించిన ప్రతి సంఘటన కూడా దురదృష్టకరమైనదేనని, వీటిని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. వీటిని తాను, తన పార్టీ స్పష్టంగా ఖండించామని, అందుకు సరైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అలాంటప్పుడు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, మూక హత్య దోషులకు దండలు వేసి, ఎందుకు స్వాగతం చెప్పారు? మరో కేంద్ర మంత్రి, మూక హత్య కేసులో ఓ దోషి చనిపోతే ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఎందుకు కప్పారు? వారి ప్రవర్తనను మోదీ ఎందుకు ఖండించలేదు? ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయాలని, స్వార్థ పూరిత రాజకీయాలని, అందుకోసమే వారంతా ఓ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమది మాత్రం కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేసే ప్రభుత్వం, పార్టీ అని చెప్పారు. ఇలా అధికారం కోసం ఏకమయ్యే పార్టీలను ప్రజలు విశ్వసించరని, తమ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, రానున్న ఎన్నికల్లో గతంలోకెల్లా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని మోదీ చెప్పారు. అయినా ఎన్నికల ముందు పొత్తులకు, ఎన్నికల అనంతరం పొత్తులకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. బీహార్‌లో ఎన్నికలకు ముందే ఆర్జేడీ, జేడీయూలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగా, ఎన్నికల అనంతరం ఆర్జేడీతో బంధాన్ని తెంపేయించి జేడీయూతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అవడం స్వార్థపూరిత రాజకీయం కాదా? త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం అక్రమ పొత్తుల ద్వారా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏమనాలి? తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పా! -
నవభారతంలో పేదరికానికి తావు లేదు: రాష్ట్రపతి
- ప్రభుత్వ సంకల్పం ఒక్కటే సరిపోదు.. ప్రజల భాగస్వామ్యమూ కావాలి - తొలి స్వాతంత్ర్యదినోత్సవ సందేశంలో రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి ప్రభుత్వాల సంకల్పం ఒక్కటే సరిపోదని, దానికి ప్రజల మద్దతు కూడా ఎంతో అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజలే అసలైన నవభారత నిర్మాతలని ఉద్ఘాటించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగనిరతి చిరస్మరణీయమని కోవింద్ గుర్తుచేశారు. పేదరికానికి తావు లేదు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్, నోట్లరద్దు ప్రక్రియ, జీఎస్టీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రజలు సుహృదయంతో అంగీకారం తెలిపారని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. సకాలంలో పన్నుల చెల్లించడాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, తద్వారానే నవభారత నిర్మాణం జరుగుతుందని, ఆ మేరకు అందరమూ ప్రతిజ్ఞచేయాల్సిన అవసరం ఉందని కోవింద్ అన్నారు. నవభారతంలో పేదరికానికి తావు ఉండదని చెప్పారు. మహిళలు, దివ్యాంగులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. -
తుపాకులు మనకు న్యాయాన్ని ఇవ్వలేవు!
శ్రీనగర్: 'తుపాకులు మనకు న్యాయాన్ని ఇవ్వలేవు' అంటూ జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సందేశాన్ని ఇచ్చారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో ఆమె మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. శ్రీనగర్ బక్షీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం మెహబూబా పాల్గొనగా.. ఆ వేదికకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓ సీఆర్ఫీఎఫ్ అధికారి ప్రాణాలు విడువగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. శ్రీనగర్‌లో జరిగిన ఈ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రమంతటా హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు వేర్పాటువాదులు ఎప్పటిలాగే 'బ్లాక్ డే'కు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం మెహబూబా మాట్లాడుతూ కశ్మీర్‌లోయలో హింసను విడనాడాలని ప్రజలను కోరారు. 'ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లోనే మనం పరిష్కారం దొరకకుంటే.. మరెక్కడా కూడా దొరకబోదు' అని ఆమె అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న హింసకు కారణం జమ్మూకశ్మీర్ ప్రజలుకానీ, భారత ప్రభుత్వంగానీ కాదని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులే ఇందుకు కారణమని ఆమె దుయ్యబట్టారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ నాటి నుంచి రగులుతున్న కశ్మీర్ లోయ ఇంకా చల్లారని విషయం తెలిసిందే. కశ్మీర్లో లోయలో కొనసాగుతున్న ఆందోళనలు, హింసలో దాదాపు 50కిపైగా మంది మరణించిన సంగతి తెలిసిందే. -
మోదీ ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోయారు!
న్యూఢిల్లీ: 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రసంగాన్ని చాలామంది ఆహూతులు శ్రద్ధగా విన్నారు, కానీ నేతలు మాత్రం పార్టీలకతీతంగా ధ్యానముద్రలోకి దిగారు. ప్రసంగాన్ని ఈ చెవి నుంచి ఆ చెవికి వదిలేసి తాపీగా నిద్రలోకి జారుకున్నారు. మోదీ మాట్లాడుతున్నంతసేపు నిద్రమత్తులో జోగారు. ఒక్కరేమిటి.. ఇలా కునుకుపాట్లు పడుతూ కేంద్ర మంత్రులు, ఇతర నేతలు కెమెరాకు చిక్కారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, అనంత కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించి.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగం సుదీర్ఘంగా సాగి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది
-
తెల్లటి కుర్తా.. ఎర్రటి తలపాగా
మొట్టమొదటి సారిగా ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజసం ఉట్టిపడే ఎర్రటి తలపాగాను కట్టుకున్నారు. ఆయన కట్టుకున్న దాన్ని జోధ్‌పురి బంధేజ్ సఫా అంటారు. సాధారణంగా రాజపుత్రులు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌లోని మేవాడ్ ప్రాంతంలోను, దానికి పొరుగున ఉండే గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లోను ఈ తలపాగా కనపడుతుంది. దర్పానికి, గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ తలపాగాను రాజకుటుంబాల వాళ్లు అత్యంత ముఖ్యమైన సందర్భాలలో.. అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు, పెళ్లి సమయాల్లో మాత్రమే ఈ రకం తలపాగా ధరిస్తారు. ఆకుపచ్చటి అంచు ఉన్న ఎర్రటి తలపాగాలో మోడీ తన రాచరిక దర్పాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూనే.. మరోవైపు తాను భారతీయులందరి ప్రధాన సేవకుడినని చెప్పారు. ఇంతకుముందు గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సామాన్య రైతులు ధరించే తలపాగాను ధరించి ప్రసంగించారు. -
ప్రణాళికా సంఘం రద్దు!!
జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళికా సంఘాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎర్రకోట నుంచి చేసిన తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయనీ విప్లవాత్మక నిర్ణయాన్ని వెలువరించారు. దీని స్థానంలో సరికొత్త సంస్థను తీసుకొస్తామని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని, సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యం గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరమని అన్నారు. మోడీ నిర్ణయంతో ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాలవారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది రాజకీయ ఉద్దండులే. ఆ పదవిలో ఉన్నవారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్ నందా, టి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్ ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చిట్టచివరి ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990లలో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యం కనుమరుగైంది.