బర్త్డే కేక్.. రియోకు ముందు... రియో తర్వాత! | My special Birthday cakes before and after Olympics, says Sakshi malik | Sakshi
Sakshi News home page

బర్త్డే కేక్.. రియోకు ముందు... రియో తర్వాత!

Published Tue, Sep 6 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

My special Birthday cakes before and after Olympics, says Sakshi malik

రియో ఒలింపిక్స్ లో పతకం కోసం వేచి చూస్తున్న కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన రెజ్లర్ సాక్షి మాలిక్. మన ప్లేయర్స్ పతకంతో ఎప్పుడు, ఎవరు ఖాతా తెరుస్తారా అంటూ యావత్ దేశం ఎంతగానే ఎదురుచూసింది. ప్రతి విభాగంలోనూ మన ఆటగాళ్ల వైఫల్యాలు ఓ వైపు వెంటాడుతున్నా.. తొలి పతకం అందించి సాక్షి మాలిక్ కాస్త ఊరటనిచ్చింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పుట్టినరోజు(సెప్టెంబర్ 3) జరుపుకున్న రియో పతక విన్నర్ కొన్ని ఆసక్తికర విషయాలను ట్వీట్ చేసింది.

రియో ఒలింపిక్స్ కు వెళ్లకముందు, రియో తర్వాత తాను జరుపుకున్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కేక్ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రెండు ఫొటోలను పోస్ట్ చేసిన సాక్షి.. టార్గెట్ కంప్లీట్ అంటూ పోస్ట్లో పేర్కొంది. అందరూ ఆశించినట్లుగానే పతకంతో తిరిగొచ్చానన్న విజయగర్వం ఆమెలో కనిపించింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొనకముందు కేక్ లో ఒలింపిక్స్ లో విన్నర్ గా చూడాలని ఆశిస్తున్నామని రాశారు. రియో నుంచి పతకం సాధించి వచ్చిన తర్వాత జరుపుకున్న తొలి పుట్టినరోజు కేక్ లో వచ్చే ఒలింపిక్స్ కు సాక్షికి ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నట్లు ఉంది. ఈ సంతోషకర విషయాలను రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విట్టర్ ద్వారా తన ఫాలోయర్స్, అభిమానులతో పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement