![Another Tragic Incident Happened In Poisioned Birthday Cake Victims House - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/12/cake-victims.jpg.webp?itok=QvXkVrfe)
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
సాక్షి, సిద్దిపేట: కుటుంబంలో ఇద్దరు మృతి చెందిన వారం రోజులు గడవక ముందే ఆ ఇంట మరో విషాదం జరిగిన ఘటన కొమురవెల్లి మండల పరిదిలోని అయినాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత బుధవారం రాత్రి పుట్టిన రోజు కేక్ తిని ఇస్తారిగల్ల రవీందర్, కుమారుడు రాంచరణ్‌లు మృతి చెందగా రవీందర్ భార్య నాగలక్ష్మి, కూతురు పూజితలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే... ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న నాగలక్ష్మి నాన్నమ్మ(రాంచరణ్ తాతమ్మ) కర్రొల్ల బాలవ్వ(84) బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నాగలక్ష్మి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా భర్త, కుమారుడు మృతి చెందినట్లు తెలియని నాగలక్ష్మికి నాన్నమ్మ మృతి విషయం కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
చదవండి: పుట్టినరోజు కేక్‌లో విషం!
Comments
Please login to add a commentAdd a comment