పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఓ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు తీపు కబురు కాస్త పీడకలగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో మాయాదేవి గుప్తా స్కూల్ ప్రినిపాల్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఓ ఎన్‌జీవోలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌జీవోలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఆ ఎన్‌జీవోలో పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరిగాయి
పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఓ విద్యార్ధి మాయాదేవికి చాక్లెట్ ఇచ్చాడు. అయితే, ఎంతో ఆనందంతో ఆ చాక్లెట్లు తినేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఏమైందంటే
‘విద్యార్ధి నాకు ఒక పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ తిన్నాక ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. మరోసారి నమలడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడలేదు. వెంటనే చాక్లెట్‌ను పరీక్షించగా అందులో నాలుగు దంతాల పళ్ల సెట్ చూసి కంగుతిన్నాను.’అని తెలిపారు.
వెంటనే ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్‌కు మాయాదేవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పిల్లలు చాక్లెట్లు కొనుగోలు చేసిన దుఖాణం నుంచి అధికారులు చాక్లెట్ నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్‌ఎల్ అవాసియా ఈ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment