fake Twitter account
-
వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సోనూ సూద్
ముంబై: అప్పటి వరకు సినిమాల్లో విలన్‌గా అందరి దృష్టిలో ఓ నటుడిగా ఉన్న సోనూ సూద్ లాక్ డౌన్ కాలంలో ఒక్కసారిగా రియల్ హీరోగా అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఎవరూ ఏ సమస్యల్లో ఉన్నట్లు తెలిసిన వెంటనే స్పందించి వారికి చేయూతనిస్తున్నాడు. దీంతో తమకు సాయం కావాంటూ సోనూ సూద్‌ను ట్విటర్ వేదికగా నేరుగా కోరుతున్నారు. వాటికి సోనూ సూద్ వెంటనే స్పందించి తగిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొంతమంది ఆకతాయిలు ఆయన పేరు మీద నకిలీ ట్విటర్ అకౌంట్‌ను క్రియోట్ చేశారు. @Sonu sood అనే పేరుతో ఉన్న ఖాతాను చూసి అందరు దానిని ఫాలో అవుతూ ట్వీట్స్ కూడా చేస్తున్నారు. వాటికి ఆకతాయిలు సమాధానాలు ఇస్తూ వారి సమాచారం తీసుకుంటున్నారని తెలిసిం= సోనూ సూద్ తన ఫాలోవర్స్‌కు, అభిమానులకు సందేశం ఇచ్చారు. ఎవరో తన పేరు మీద నకిలీ ఖాతా తెరిచారని, దీని నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఫేక్ ఖాతా ఐడీని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. (చదవండి: మెసేజ్ చూడకపోతే క్షమించండి : సోనూసూద్) ‘తన పేరుపై ఉన్న నకిలీ ఖాతా నుంచి అందరూ అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఆకతాయిలు నా పేరు మీద నకిలీ ఖాతాను క్రియోట్ చేశారు. ఈ ఫేక్ అకౌంట్‌ను ఎవరూ కూడా ఫాలో కాకండి. ఇప్పటికీ ఫాలో అవుతున్న వారు దానిని అన్‌ఫాలో చేయండి. మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ’ ట్వీట్ చేశారు. అదే విధంగా ఈ నకిలీ ఖాతాను క్రియోట్ చేసిన సదరు ఆకతాయిలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రజలను మోసం చేస్తున్నందుకు త్వరలోనే మీరు అరెస్ట్ కావడం తథ్యం డియర్’ అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఇకనైనా మీ మోసాలు ఆపేయాలని, ఆలస్యమైతే ఆ తర్వాత స్పందించినా ఉపయోగం ఉండదన్నారు. 'సోనూ సూద్' అనే ట్విటర్ అకౌంట్ పేరుతో సదరు వ్యక్తి ఇతరుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తున్నట్టు వెల్లడైంది. అంతేకాదు, నకిలీ జీమెయిల్ ఐడీలను ఇస్తూ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. (చదవండి: సోనూ సూద్‌ని సాయం కోరిన బ్రహ్మాజీ) Beware of the fake accounts. Report to the nearest police station if someone demands anything from you. 🙏 pic.twitter.com/cyIFnokJ2K — sonu sood (@SonuSood) June 14, 2020 -
రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?
సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లకుండా, ఇతర జిల్లాల ప్రజలు చెన్నై సిటీలో అడుగు పెట్టకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాసులు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. (చదవండి : తదుపరి చిత్రానికి రజనీ రెడీ) ఈ నేపథ్యంలో ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ లగ్జరీ కారు నడుపుతూ, చెన్నై సమీపంలోని . కీళంబాక్కంలోని లోని తన ఫామ్ హౌస్ రెండో కూతురు, అల్లుడితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలం గడుపుతున్నారని కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఫామ్ హౌస్ లో రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కీళంబక్కం వరకు కారులో వెళ్లిన రజనీకాంత్‌కు ఈ పాస్ ఉందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. (చదవండి : చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన) అయితే రజనీకాంత్ నిబంధనల ప్రకారం ఈ పాస్ తీసుకోనే కారులో ప్రయాణం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా మళ్లీ ఇప్పుడు రజనీ చేసినట్లు చెబుతున్న మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాస్ లేకుండా ప్రయాణం చేసినందకు రజనీకాంత్ క్షమాపణలు చెప్పారని ఆ ట్వీట్ సారాంశం. ‘ఈ పాస్ లేకుండా ప్రయాణించాను. మీ బిడ్డగా పరిగణించి నన్ను క్షమించండి’అని రజనీ ట్వీట్ చేశారు. అయితే అది రజనీకాంత్ ట్వీటర్ ఖాతా కాదని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. రజనీ అధికారిక ట్వీటర్ ‘@rajinikanth’పేరుతో ఉండగా, నకిలీ ఖాతా‘@RajiniOff’పేరుతో ఉంది. రజనీ ట్వీటర్ ఖాతాను 2013 ఫిబ్రవరిలో తెరచినట్లు ఉండగా, రజనీ క్షమాపణ చెబుతూ చేసిన ట్వీటర్ ఖాతా గత నెలలో తెరచినట్లు ఉంది. దీంతో ఇది నకిలీ ట్వీట్ అని అర్థమవుతంది. ఈ ఫేక్ ట్వీట్‌పై రజనీకాంత్ స్పందించాల్సి ఉంది. -
నాకేం కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: తాను ఎలాంటి జబ్బుతో బాధపడడం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్లో హిందీ భాషలో ఒక ప్రకటన జారీ చేశారు. అమిత్ షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతుండడంతో ఆయన తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ‘గత రెండు రోజులుగా ‘కొందరు మిత్రులు’ నా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. నాకు మరణం ప్రాప్తించాలని వారు కోరుకుంటున్నారు. నా ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. కానీ, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండడంతో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు. పుకార్లు సృష్టించిన వారికి కూడా కృతజ్ఞతలు. వారి పట్ల నాకు ఏమాత్రం ప్రతికూల భావన లేదు. వారు ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు పక్కనపెట్టి సొంత పనులు చూసుకుంటే మంచిది’ అని అమిత్‌షా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జె.పి.నడ్డా అమిత్ షా ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రంగా ఖండించారు. అమానవీయమైన ఇలాంటి ప్రచారం చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. షా ఆరోగ్యంపై నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను అహ్మదాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఏకంగా అమిత్ షా పేరిటే ట్విట్టర్ ఖాతా తెరవడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!
పెరంబూరు : నరేంద్రమోదీకి తాను శుభాకాంక్షలు చెప్పలేదని వర్ధమాన నటి ప్రియాభవాని శంకర్ వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలు పొందిన రాజకీయ నాయకులకు ప్ర జలకు సినీ కళాకారులకు శుభాకాంక్షలు వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. అదే విధంగా నరేంద్రమోదీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది సినీ కళాకారుల మాదిరిగానే నటి ప్రియాభవాని శంకర్ ట్విట్టర్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అందులో శుభాకాంక్షలు మన నిరంతర ప్రధాని నరేంద్రమోదీ సార్. మోదీ రిటర్న్ అని పేర్కొంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు చెప్పిన నటి ప్రియాభవాని శంకర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో షాక్‌కు గురైన ఆమె తాను మోదీకి శుభాకాంక్షలు తెలపలేదన్నారు. నకిలీ ట్విట్టర్‌తో ఇదంతా చేశారు.. తన పేరుతో ఎవరో నకిలీ ట్విట్టర్ రూపొందించి ఆ ట్వీట్‌ను పొందుపరిచారని వివరణ ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ పేరుతోనే ట్విట్టర్ ప్రారంభించి ఆయనకే శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా! నకిలీ ట్విట్టర్‌తో ఎందుకు ఇంత ఎమోషనల్. మీ అభిప్రాయాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ నటి ప్రియ భవాని శంకర్ తన ట్విట్టర్లో పేర్కొంది. విశేషం ఏమిటంటే ప్రియా భవానిశంకర్ అసలైన ట్విట్టర్ అకౌంట్ కంటే నకిలీ ట్విట్టర్‌కే అధికంగా ఫాలోవర్స్ ఉన్నారు. -
కైరానా ఎంపీకి షాక్
లక్నో: కైరానా లోక్‌సభ ఎంపీ ఎన్నికైన బేగం తబస్సుమ్ హసన్‌కు షాక్ తగిలింది. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు సృష్టించిన కొందరు.. ఆమె పేరు మీద కొన్ని వ్యాఖ్యలను వైరల్ చేశారు. అవి స్థానిక వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ కాగా, రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కంగుతిన్న ఆమె షామిలీ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తబస్సుమ్ పేరిట ట్విటర్లో ఫేక్ అకౌంట్లు తెరిచి నిందితులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసును సైబర్ విభాగానికి బదిలీ చేసినట్లు ఎస్పీ వర్మ తెలిపారు. ఇటీవల జరిగిన కైరానా ఎన్నికలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు సంయుక్తంగా బేగం తబస్సుమ్ హసన్(ఆర్ఎల్డీ)ను నిలపగా, బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆమె ఘన విజయం సొంతం చేసుకున్నారు. -
అన్నయ్య కోసం తమ్ముడి ఆరాటం
లక్నో : తన అన్నయ్యకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక ఓ పదో తరగతి విద్యార్థి ఏకంగా డీజీపీ పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా తెరిచాడు. అంతేకాదు ట్విటర్ ద్వారా డీజీపీ ఇచ్చినట్టుగా ఆదేశాలు పంపించి పోలీసులతో తన పని చేయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఈ ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాజ్‌గంజ్‌కు చెందిన సాదిక్ అన్సారీ అనే వ్యక్తి బాలుడి సోదరుని నుంచి రూ. 45 వేలు అప్పుగా తీసుకున్నాడు. బదులుగా తన సోదరునికి దుబాయ్‌లో ఉపాధి చూపిస్తానని చెప్పాడు. కానీ అన్సారీ బాలుడి కుటుంబాన్ని మోసం చేయడంతో వారు గుల్హారీ బజార్ పోలీస్ స్టేషన్లో అతడి మీద ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు యూపీ డీజీపీ ఓపీ సింగ్ పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాను తెరిచాడు. అనంతరం ఆ ట్విటర్ అకౌంట్ నుంచి విచారణను వేగవంతం చేయాలని గోరఖ్‌పూర్ ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీ చేశాడు. డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయనుకుని పోలీసులు తక్షణం స్పందించారు. సాదిక్ అన్సారీ నుంచి బాలుడి సోదరుడికి 30 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మిగతా డబ్బు త్వరలోనే తిరిగిస్తానని అతడితో హామీ యిప్పించారు. కేసు పరిష్కరమైనట్టు డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని డీజీపీ ఆఫీసు నుంచి సమాధానం వచ్చింది. దీంతో కూపీ లాగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. నకిలీ ట్విటర్ ఖాతా తెరిచిన బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, గ్రామంలోని తన స్నేహితుని సహాయంతో తాను ఇదంతా చేసినట్టు అతడు ఒప్పుకున్నట్టు సైబర్ సెల్ ఇన్సెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. బాలుడి భవిష్యత్తును పాడు చేయకూడదన్న ఉద్దేశంతో కేసు నమోదు చేయలేదని, గట్టిగా హెచ్చరించి వదిలేసినట్టు చెప్పారు. -
కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట
న్యూఢిల్లీ: ప్రముఖుల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు తెరిచి వివాదాస్పద, విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో చాలా వెలుగు చూశాయి. ఇలాంటి బాధిత ప్రముఖల జాబితాలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అనుప్రియ స్వయంగా చెప్పారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఇటీవల తన ప్రమేయం లేకుండానే ఓ వివాదంలో చిక్కుకున్నారు. అనుప్రియ పేరు మీద ఎవరో ట్విట్టర్ లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లో ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి వెంటనే ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇక నుంచి ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని అనుప్రియ చెప్పారు. 'నా పేరు మీద ట్విట్టర్ నకిలీ ఖాతాలో విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశా. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరాను. నకిలీ ఎకౌంట్లను నియంత్రించాలి. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటా' అని అనుప్రియ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన, ఆప్నా దళ్ చీలికవర్గం నాయకురాలు అనుప్రియకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. ఆమె యూపీలో మీర్జాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆమే పిన్నవయస్కురాలు.