వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చిన సోనూ సూద్‌ | Sonu Sood Aware Of His Followers About Fake Twitter Account On His Name | Sakshi
Sakshi News home page

నా పేరుపై నకిలీ ట్విటర్‌: ఎవరూ మోసపోకండి

Published Fri, Aug 21 2020 9:11 PM | Last Updated on Fri, Aug 21 2020 9:18 PM

Sonu Sood Aware Of His Followers About Fake Twitter Account On His Name - Sakshi

ముంబై: అప్పటి వరకు సినిమాల్లో విలన్‌గా  అందరి దృష్టిలో ఓ నటుడిగా ఉన్న సోనూ సూద్ లాక్ డౌన్ కాలంలో  ఒక్కసారిగా రియల్ హీరోగా అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఎవరూ ఏ సమస్యల్లో ఉన్నట్లు తెలిసిన వెంటనే స్పందించి వారికి చేయూతనిస్తున్నాడు. దీంతో తమకు సాయం కావాంటూ సోనూ సూద్‌ను ట్విటర్‌ వేదికగా నేరుగా కోరుతున్నారు. వాటికి సోనూ సూద్‌ వెంటనే స్పందించి తగిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొంతమంది ఆకతాయిలు ఆయన పేరు మీద నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను క్రియోట్‌ చేశారు. @Sonu sood అనే పేరుతో ఉన్న ఖాతాను చూసి అందరు దానిని ఫాలో అవుతూ ట్వీట్స్‌ కూడా చేస్తున్నారు. వాటికి ఆకతాయిలు సమాధానాలు ఇస్తూ వారి సమాచారం తీసుకుంటున్నారని తెలిసిం= సోనూ సూద్‌ తన ఫాలోవర్స్‌కు, అభిమానులకు సందేశం ఇచ్చారు. ఎవరో తన పేరు మీద నకిలీ ఖాతా తెరిచారని, దీని నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఫేక్‌ ఖాతా ఐడీని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. (చదవండి: మెసేజ్‌ చూడకపోతే క్షమించండి : సోనూసూద్‌)

‘తన పేరుపై ఉన్న నకిలీ ఖాతా నుంచి అందరూ అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఆకతాయిలు నా పేరు మీద నకిలీ ఖాతాను క్రియోట్‌ చేశారు. ఈ ఫేక్‌ అకౌంట్‌ను ఎవరూ కూడా ఫాలో కాకండి. ఇప్పటికీ ఫాలో అవుతున్న వారు దానిని అన్‌ఫాలో చేయండి.  మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ’ ట్వీట్‌ చేశారు. అదే విధంగా ఈ నకిలీ ఖాతాను క్రియోట్‌ చేసిన సదరు ఆకతాయిలకు కూడా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘ప్రజలను మోసం చేస్తున్నందుకు త్వరలోనే మీరు అరెస్ట్ కావడం తథ్యం డియర్’ అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఇకనైనా మీ మోసాలు ఆపేయాలని, ఆలస్యమైతే ఆ తర్వాత స్పందించినా ఉపయోగం ఉండదన్నారు. 'సోనూ సూద్' అనే ట్విటర్ అకౌంట్ పేరుతో సదరు వ్యక్తి ఇతరుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తున్నట్టు వెల్లడైంది. అంతేకాదు, నకిలీ జీమెయిల్ ఐడీలను ఇస్తూ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు  గుర్తించారు. (చదవండి: సోనూ సూద్‌ని సాయం కోరిన బ్రహ్మాజీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement