గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్‌ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ | Sonu Sood Latest Movie Fateh Trailer To Be Released By Prince Mahesh Babu | Sakshi
Sakshi News home page

Sonu Sood: గేమ్ ఛేంజర్‌తో బాక్సాఫీస్ పోటీ.. మహేశ్‌ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

Published Mon, Jan 6 2025 2:52 PM | Last Updated on Mon, Jan 6 2025 3:11 PM

Sonu Sood Latest Movie Fateh Trailer To Be Released By Prince Mahesh Babu

బాలీవుడ్‌ హీరో సోనూ సూద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ఫతే. అరుంధతి సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ ‍అయిన సోనూ సరికొత్త థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యాన‍ర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్‌లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్‌ ఇండియా రేంజ్‌లో అదే రోజున గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్‌ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్‌ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ ఫతే రిలీజైతే గనక చెర్రీ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోరు తప్పేలా లేదు.

తాజాగా ఈ మూవీ మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సోనూ సూద్ ట్వీట్‌ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా  ఫతే ట్రైలర్‌-2 రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు మహేశ్ బాబు.

తెలుగులో ప్రత్యేక గుర్తింపు..

కాగా.. అనుష్క లీడ్‌ రోల్‌లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్‌లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement