కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట | Will now be more careful about fake Twitter handles: Anupriya | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట

Published Mon, Jul 11 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట

కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట

న్యూఢిల్లీ: ప్రముఖుల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు తెరిచి వివాదాస్పద, విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో చాలా వెలుగు చూశాయి. ఇలాంటి బాధిత ప్రముఖల జాబితాలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అనుప్రియ స్వయంగా చెప్పారు.

కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఇటీవల తన ప్రమేయం లేకుండానే ఓ వివాదంలో చిక్కుకున్నారు. అనుప్రియ పేరు మీద ఎవరో ట్విట్టర్ లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లో ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి వెంటనే  ఢిల్లీ పోలీసు కమిషనర్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇక నుంచి ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని అనుప్రియ చెప్పారు.  

'నా పేరు మీద ట్విట్టర్ నకిలీ ఖాతాలో విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశా. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరాను. నకిలీ ఎకౌంట్లను నియంత్రించాలి. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటా' అని అనుప్రియ చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన, ఆప్నా దళ్ చీలికవర్గం నాయకురాలు అనుప్రియకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. ఆమె యూపీలో మీర్జాపూర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆమే పిన్నవయస్కురాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement