కైరానా ఎంపీకి షాక్‌ | Kairana MP Tabassum Begum Fake Quote Viral | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 9:37 AM | Last Updated on Sun, Jun 3 2018 9:37 AM

Kairana MP Tabassum Begum Fake Quote Viral - Sakshi

ఎంపీ బేగం తబస్సుమ్‌ హసన్‌

లక్నో: కైరానా లోక్‌సభ ఎంపీ ఎన్నికైన బేగం తబస్సుమ్‌ హసన్‌కు షాక్‌ తగిలింది. సోషల్‌ మీడియాలో నకిలీ అకౌంట్లు సృష్టించిన కొందరు.. ఆమె పేరు మీద కొన్ని వ్యాఖ్యలను వైరల్‌ చేశారు. అవి స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్‌ కాగా, రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కంగుతిన్న ఆమె షామిలీ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తబస్సుమ్‌ పేరిట ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్లు తెరిచి నిందితులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసును సైబర్‌ విభాగానికి బదిలీ చేసినట్లు ఎస్పీ వర్మ తెలిపారు. ఇటీవల జరిగిన కైరానా ఎన్నికలో కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలు సంయుక్తంగా బేగం తబస్సుమ్‌ హసన్‌(ఆర్‌ఎల్‌డీ)ను నిలపగా, బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆమె ఘన విజయం సొంతం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement