ఉప ఎన్నికల ఎఫెక్ట్‌: కేంద్రం దిద్దుబాటు చర్యలు | Centre To Give Sweet News to Sugarcane Farmers | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 8:08 PM | Last Updated on Mon, Jun 4 2018 8:10 PM

Centre To Give Sweet News to Sugarcane Farmers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానం, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ఈ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాటు పడుతున్న నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కొన్ని ఊరట చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చెరకు రైతులకు ఒకట్రెండు రోజుల్లో కేంద్రం తీపి కబురు అందించనుందని తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకునేందుకు రూ. 10వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. అలాగే చెరకు ఎగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు  చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరకు దిగుమతులపై ప్రస్తుతం 50శాతం సుంకం విధిస్తుండగా.. దానిని 100శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన కైరానా లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. సిట్టింగ్‌ సీటు అయిన కైరానాలో బీజేపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ ఓటమిలో చెరకు రైతులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చెరకు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement