sugarcane farmers
-
చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే
సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్దత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధరణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. క్రషింగ్ సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతులకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విపక్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి ఈనాడు పత్రికలో ‘‘తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి’ అంటూ రామోజీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటిని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే. ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్సీపీ సర్కారు? వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగారాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముడిì సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమేమిటో రామోజీకే తెలియాలి. ఆరోపణ: చెరుకు రైతులకుప్రోత్సాహం కరువు వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తుతం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడిపోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావించింది. కర్మాగారాల ఆస్తులు, స్థలాలపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. అయితే, మూతపడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి. -
ప్రచారాస్త్రం.. ‘నిజాం షుగర్స్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరకు రైతుల అంశం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయనుంది. పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల విషయం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెరకు పంట విస్తీర్ణం పెంపు అంశం కీలకం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారీకి ఆయా పరిశ్రమల ఏర్పాటుపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారా్రస్తాలుగా చేసుకుంటున్నాయి. 2002లో చంద్రబాబు విక్రయం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. అయితే 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లు లేఆఫ్ ప్రకటించాయి. అయితే 2005–06లో చెరకు 35 వేల టన్నుల దిగుబడి ఉన్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను 2015లో లక్ష టన్నుల చెరకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి వైపు మళ్లారు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు పండించే 12 నియోజకవర్గాల్లో గతంలో సుమారు 1.22 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. చెరకు రైతులే ప్రధానాంశంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. -
చెరుకు రైతులకు చేదు నుంచి విముక్తి! టన్ను నరివేతకు రూ.400
సాక్షి, అమరావతి: చెరకు రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కూలీల కొరతను అధిగమించేందుకు అత్యాధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యంత్రాల్లోని సాంకేతిక లోపాలను అధిగమించేలా దీన్ని రూపొందించారు. ఈ యంత్రం కూలీల కొరతవల్ల రైతులు పడుతున్న వెతలకు చెక్ పెట్టడమే కాదు.. కోత వ్యయాన్ని సగానికిపైగా తగ్గిస్తుంది. దేశంలో ప్రధానమైన వాణిజ్యపంటల్లో చెరకు ఒకటి. దేశవ్యాప్తంగా 48.51 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. మన రాష్ట్రంలో 55 వేల హెక్టార్లలో చెరకు సాగుచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో పాటు కూలీల కొరత, కొత్తగా పుట్టుకొస్తున్న చీడపీడలు (పసుపు ఆకు, వైరస్ తెగుళ్లు) రైతులను వేధిస్తున్నాయి. సాగుకాలంలో కనీసం 40 రోజులు కూలీల అవసరం తప్పనిసరి. కూలీలు లేనిదే కోత కొయ్యలేని పరిస్థితి నెలకొంది. పెట్టుబడిలో 35 శాతం కూలీలకే.. గిరాకీని బట్టి టన్ను చెరకు నరకడానికి రూ.800 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎకరాకు రూ.24 వేలకు పైగా కూలీల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం సాగువ్యయంలో 35 శాతంగా నమోదవుతున్న కూలీల ఖర్చు రైతులకు భారంగా మారుతోంది. అయినప్పటికీ సమయానికి కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాల చెరకు కోత యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిలోని సాంకేతిక లోపాలు చక్కెర రికవరీకి అవరోధంగా ఉంటున్నాయి. దీంతో కోత సమయంలో ఎక్కువమంది రైతులు కూలీలపైనే ఆధార పడుతున్నారు. మేలైన కోత యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. కోల్హాపూర్‌లో వాడుకలో ఉన్న జైపూర్ వారి సూపర్ కేన్ హార్వెస్టర్‌ను అధ్యయనం చేశారు. కాస్త మార్పులు చేసి మన ప్రాంతానికి, మన రైతులకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఎలా పనిచేస్తుందంటే.. ఈ సూపర్ కేన్ హార్వెస్టర్ చెరకును నేలమట్టానికి నరికి చక్కెర కర్మాగారానికి తరలించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా చక్కెర రికవరీకి ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ హార్వెస్టర్ కింద, పై భాగాల్లో రెండు కట్టర్ బ్లేడులతో పాటు ఒక డిట్రాషింగ్ యూనిట్ ఉంటాయి. కట్టర్ బ్లేడులను చెరకు పొడవును బట్టి హైడ్రాలిక్ పవర్ సహాయంతో కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు. కింద భాగంలో ఉండే కట్టరు బ్లేడు చెరకును నేలమట్టానికి నరికితే పైభాగంలో ఉండే కట్టరు బ్లేడ్ చెరకు మొవ్వను కోస్తుంది. తర్వాత చెరకు గడలు బెల్ట్ సాయంతో డిట్రాషింగ్ యూనిట్లోకి వెళతాయి. ఈ యూనిట్లో చెరకు గడలకు ఉన్న ఎండుటాకులను తెంచి పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత యంత్రం వెనుక భాగంలో ఉండే ట్రాలీలోకి పంపుతుంది. ఈ ట్రాలీ నుంచి సూపర్ గ్రబ్బర్ అనే యంత్రం ట్రాక్టర్లోకి లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా యంత్రమే చేస్తుంది. టన్నుకు రూ.400 చెల్లిస్తే చాలు.. ఈ యంత్రం ధర మార్కెట్లో రూ.33 లక్షలుగా ఉంది. 75 హెచ్‌పీ ట్రాక్టర్ రూ.13 లక్షలు, సూపర్ గ్రబ్బర్ రూ.4 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రం గంటకు 3–4 టన్నుల చొప్పున రోజుకు 25 టన్నుల చెరకును సునాయాసంగా నరికేస్తుంది. ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు. ఈ యంత్రం సాయంతో చెరకు నరికేందుకు టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. సరాసరి చెరకు దిగుబడి ఎకరాకు 30 టన్నులుగా తీసుకుంటే కూలీలతో నరికితే టన్నుకు రూ.800 చొప్పున రూ.24 వేలు ఖర్చవుతుంది. అదే ఈ యంత్రంతో నరికితే టన్నుకు రూ.400 చొప్పున 30 టన్నులకు రూ.12 వేలకు మించి ఖర్చవదు. అంటే కూలీలతో నరికించే దానికంటే ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తుంది. కూలీల వెతలుండవు సూపర్ కేన్ హార్వెస్టర్ మన ప్రాంతానికి, మన రైతులకు చాలా అనుకూలమైనది. చాలా ఈజీగా వినియోగించవచ్చు. ఏళ్ల తరబడి రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. కోత ఖర్చు సగానికిపైగా తగ్గిపోతుంది. ఈ యంత్రంతో కోత కోస్తే చక్కెర రికవరీ శాతం పెరుగుతుందే తప్ప తగ్గే చాన్స్ ఉండదు. – డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త, అనకాపల్లి -
త్వరలో చక్కెర బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: చెరుకు రైతులకు క్రషింగ్.. ఆ కర్మాగారాల్లోని ఉద్యోగుల జీతభత్యాల బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, నిర్వహణ ఇతర అంశాలపై కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్రెడ్డిలతో ఏర్పాటైన మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్–జీఓఎం) గురువారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన చక్కెర నిల్వల అమ్మకాలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు, వీఆర్ఎస్ అమలు, తదితర అంశాలపై చర్చించారు. వీటి చెల్లింపుల నిమిత్తం.. పేరుకుపోయిన చక్కెర నిల్వలు అమ్మేందుకు హైకోర్టు అనుమతినివ్వడంపట్ల హర్షం వ్యక్తంచేసిన మంత్రుల బృందం సాధ్యమైనంత త్వరగా మంచి రేటుకు ఈ నిల్వలను అమ్మే విషయమై చర్చించారు. 3.85 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలు రాష్ట్రంలోని ఐదు చక్కెర కర్మాగారాల్లో ప్రస్తుతం 3.85 లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయని, వాటి అమ్మకాల ద్వారా కనీసం రూ.127 కోట్లు ఆదాయం వస్తుందని ఈ భేటీలో అంచనా వేశారు. ఒక్క చోడవరం షుగర్ ఫ్యాక్టరీలోనే 3.28 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయని, వీటి అమ్మకం ద్వారా రూ.108.24 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కతేల్చారు. అక్టోబర్ 5న టెండర్లు పిలిచేందుకు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక చోడవరం, ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాల్లో రైతులకు చెల్లించాల్సిన క్రషింగ్ బకాయిలు రూ.46.48 కోట్లు ఉన్నాయి. ఈ కర్మాగారాలతో పాటు భీమసింగి చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25.50 కోట్లు. సీఎంతో భేటీ తర్వాతే ముందుకు.. ఇక మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు, చోడవరం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ అంశాలపై సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ముందుకెళ్లాలని మంత్రుల బృందం ఈ భేటీలో నిర్ణయించింది. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ వెంకట్రావు పాల్గొన్నారు. -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్‌లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్‌పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్‌పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్‌కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్‌లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్‌లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
చెరకు రసం వ్యాపారం: రైతులకు లాభాల తీపి..
సాక్షి, అమరావతి: పండించిన పంటను రైతే నేరుగా వినియోగదారుడికి అమ్ముకోగలిగితే అధిక ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 265 మంది వరకు రైతులు తాము పండించిన చెరకు నుంచి రసం తీసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. నాబార్డు రుణం పొందవచ్చు నాబార్డ్‌లోని నాబ్–కిసాన్ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్‌పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింప చేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది. యంత్రం ఎలా పని చేస్తుందంటే.. ఆధునిక చెరకు రసం తీసే యంత్రం ఏటీఎం మెషిన్ తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని ఉంచితే గ్లాస్‌లోకి రసం వస్తుంది. నిమ్మకాయ, అల్లాన్ని కూడా మెషిన్లోనే కలిపి ఇవ్వొచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. రైతులే ఈ వ్యాపారంలోకి దిగితే దాన్ని రూ.50కి అమ్మినా 500 లీటర్లకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ.17 వేల నుంచి రూ.18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం టన్ను చెరకును రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఆవాల సాగు.. లాభాలు బాగు -
తీరమంతా తియ్యనంట..
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు పిండి వంటకాలు సిద్ధమైపోతుంటాయి. ప్రధానంగా అరిసెలు, బెల్లం ఉండలు వంటివి చేయాలంటే బెల్లం తప్పనిసరి. అందుకే ఈ సీజన్లో మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. మరోవైపు శుభకార్యాల సమయంలోనూ బెల్లం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగావళి తీరంలో చెరకు సాగుచేస్తున్న రైతులు బెల్లం తయారీలో నిమగ్నమయ్యారు. వేడి వేడి బెల్లాన్ని చెక్కీల రూపంలో మార్కెట్‌కు అందిస్తున్నారు. సాక్షి. రాజాం(శ్రీకాకుళం): జిల్లాలో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఫ్యారిస్ చక్కెర కర్మాగారం సంకిలి వద్ద ఉంది. దీంతో పరిసర ప్రాంత రైతులు ఎక్కువగా చెరకును సాగు చేస్తుంటారు. నాగావళి నదీతీర మండలాలైన వంగర, రేగిడి, సంతకవిటి, బూర్జ తదితర మండలాల్లో భూములు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు సాగు చేస్తుంటారు. సారవంతమైన భూములు కావడంతో రసాయనాలు వినియోగించకుండానే మంచి రంగు, తియ్యదనంతో కూడిన బెల్లం తయారవుతుంది. కొత్తూరు, జావాం, హొంజరాం, చిత్తారిపురం, బూరాడపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, బూర్జ మండలంలోని గుత్తావల్లి, నారాయణపురం, బూర్జ ప్రాంతాల్లోని బెల్లానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ బెల్లం గానుగల వద్దే విక్రయాలు జరిగిపోతుంటాయి. కుండలు నుంచి చెక్కీలు వైపు.. ఎకరా చెరకు పంటను బెల్లం తయారు చేసేందుకు సాధారణంగా 15 నుంచి 20 రోజుల కాలం పడుతుంది. పొలంలో చెరకును నరికి ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా గానుగల వద్దకు తీసుకొస్తారు. అక్కడ చెరకు గడలను నునుపుగా చేసి గానుగ యంత్రం ద్వారా రసం తీస్తారు. ఈ రసాన్ని ఇనుప పెనంలో వేసి పాకం తీస్తారు. బాగా పాకం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఇనుప పల్లెంలో బెల్లం పాకం వేసి చెక్కీలు తయారుచేస్తారు. గతంలో బెల్లాన్ని కుండలకు ఎక్కించేవారు. ఇప్పుడు టెక్నాలజీ రావడంతో చెక్కీలకు ఎక్కించి అనంతరం కవర్లులో పెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్న చెక్కీ 6 నుంచి 7 కిలోలు ఉండగా, పెద్ద చెక్కీలు 14 కిలోలు ఉంటాయి. వాతావరణం అనుకూలించింది.. మాకున్న కొద్దిపాటి పొలంలో ఈ ఏడాది చెరకు సాగుచేశాం. ప్రస్తుతం పంట కోతదశకు వచ్చింది. బెల్లం తయారు చేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి బాగుంది. – లావేటి లక్షున్నాయుడు, చెరకు రైతు, బూరాడపేట డిమాండ్ ఉంది.. ప్రస్తుతం చెరకు పంట అన్ని ప్రాంతాల్లో కోతదశలో ఉంది. మేం చెరకును గానుగ ఆడించి బెల్లం తయారుచేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో పెట్టుబడులు పోనూ మంచి లాభం కనిపిస్తోంది. – మునకలసవలస దాలయ్య, చెరకు రైతు, హంజరాం సాగు బాగుంది... బెల్లం తయారీచేసే రైతులకు చెరకు సాగు అనుకూలిస్తోంది. జిల్లాలో తయారయ్యే బెల్లం నాణ్యతతో ఉంటుంది. ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. ఆరోగ్యపరంగా బెల్లం మనిషికి ఎంతో మంచిది. – డాక్టర్ జి.చిట్టిబాబు, కృషివిజ్ఞానకేంద్రం, ఆమదాలవలస -
ఏపీ: చెరకు రైతులతో మంత్రుల కమిటీ భేటీ
సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో ఏపీ మంత్రుల బృందం సమావేశమైంది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ‘‘రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు మంచే జరుగుతుందని, రైతుల అభిప్రాయాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తామని కన్నబాబు తెలిపారు.(చదవండి: ప్రధానితో ముగిసిన సీఎం జగన్ భేటీ) మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో రైతులకు మేలు జరిగిందని, ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా రైతులు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వైఎస్ జగన్ ఏమి చేశారో, చంద్రబాబు ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆలోచన రైతులకు మేలు చేయాలన్నదేనని తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేసారు. 1 లక్షల 5 వేల టన్నుల జరిగే క్రషింగ్.. టీడీపీ హయాంలో 55 వేల టన్నులకు పడిపోయిందని’’ బొత్స సత్యనారాయణ వివరించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని, చంద్రబాబువల్లే ఎన్నికల కోసం వైఎస్ జగన్ పనిచేయరని తెలిపారు. పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారని, రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదని అవంతి శ్రీనివాస్ అన్నారు. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పర్రిశమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారని తెలిపారు. రైతులకు సీఎం జగన్ రైతులకు మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం సంకల్పమని ఆయన తెలిపారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కమిటీ వేశారని తెలిపారు. నష్టం వస్తే ఎలలా ముందుకెళ్లాలి అనే దానిపై కమిటీ చర్చిస్తుందన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరకు రైతులకు బకాయిలు చెల్లించారన్నారు. రైతులకు మేలు జరిగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుందని ఎంపీ గీత తెలిపారు. -
చెరకు రైతుల బకాయిలు తీర్చాలి
సాక్షి, అమరావతి: చెరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు. ► ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకు వినియోగించగలమో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలన్నారు. దీని వల్ల ఆ ఫ్యాక్టరీలకు కొంతైనా మేలు జరుగుతుంది. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చేదును పంచుతున్న చెరుకు
మెదక్‌జోన్: ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరుకు పండించే మెతుకుసీమలో నేడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. మూడు దశాబ్ధాల్లో జిల్లాలో చెరుకు సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నాడు చెరుకు సాగుతో ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందిన రైతులు నేడు పంట సాగు లేక విలవిలలాడుతున్నారు. దీనికి కారణం ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ మూతపడటమే . జిల్లాలోని మంబోజిపల్లి శివారులో 1987 సంవత్సరంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్మించారు. నాటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీ ఆధారంగా సుమారు 20 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగుచేసేవారు. దీంతో 4 లక్షల మెట్రిక్‌టన్నుల చెరుకును గానుగాడించేవారు. రైతులకు ప్రతియేటా కోట్లాది రూపాయలను పంచేవారు. అప్పట్లో ఆ ప్యాక్టరీలో పర్మినెంట్ కార్మికులు 300 మంది ఉండగా సీజనల్ వర్కర్లు మరో 300 మంది నిత్యం పనులు చేసేవారు. రైతులకు, కార్మికులకు కొండంత అండగా ఉన్న ఈ ఫ్యాక్టరీని 2003 సంవత్సరంలో చంద్రబాబునాయుడు హయాంలో ఈ ఫ్యాక్టరీని కేవలం రూ. 60 కోట్లకు మెదక్, బోధన్, చక్కర్‌నగర్లో ఉండే మూడు నిజాంషుగర్ ఫ్యాక్టరీలను 51శాతం వాటను నిజాందక్కన్ పేపర్‌మిల్లు యజమానికి విక్రయించాడు. ఇదిప్రైవేట్‌పరం అయిన నుంచి కార్మికులకు, రైతులకు యజమాని చుక్కలు చూపించాడు. ఎంతోమంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఏలు ఇచ్చి గెంటివేశాడు. ప్యాక్టరీని 2014లో అక్రమంగా లాకవుట్ ప్రకటించి కార్మికులను రోడ్డుపాలుజేశారు. దీంతో నాటివైభవం పూర్తిగా కనుమరుగైంది. ఫ్యాక్టరీ మూతతో సాగు కనుమరుగు ఒకనాడు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ నడుస్తున్న క్రమంలో ఫ్యాక్టరీ పరిధిలోని వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, రామాయంపేట తదితర ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఏటా 20 వేల ఎకరాల చెరుకు పంటను సాగుచేసేవారు. అది పూర్తిగా మూతపడటంతో ప్రస్తుతం జిల్లాలో కేవలం 800 ఎకరాల్లో మాత్రమే చెరుకు పంట సాగవుతోంది. పండించిన కొద్దిపాటి చెరుకును మెదక్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలోని ఫ్యాక్టరీలకు చెరుకును తరలిస్తున్నారు. కాగా వచ్చేలాభం రవాణా ఖర్చులకే పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అతికొద్ది మంది రైతులు మాత్రం బెల్లం తయారు చేస్తున్నారు. తక్కువనీటితో సాగు చెరుకు సాగుకు అతి తక్కువ నీరు ఉన్నా పండుతుంది. ఎకర వరిపంటకు ఉపయోగించే నీటితో 6 ఎకరాల్లో చెరుకు పంటను పండించవచ్చును. అంతేకాకుండా ఒక్క ఏడాది చెరుకును నాటితో ఇది మూడు సంవత్సరాలవరకు పెరుగుతూనే ఉంటోంది. దీంతో విత్తనం ఖర్చులు రైతుకు పూర్తిగా తగ్గిపోతాయి. వరుస కరువుకాటకాలతో బోరుబావుల్లో నీటిఊటలు గణనీయంగా తగ్గిపోతున్న క్రమంలో కొద్దిపాటిగా వచ్చే నీటితోనూ చెరుకు పంటను సాగుచేసేందుకు వీలు ఉంటుంది. కానీ పంటను సాగుచేస్తె ఇతర జిల్లాలకు తరలించేందుకు రవాణా ఖర్చులు అధిక మొత్తంలో అవుతాయని వచ్చేఆదాయం రవాణా ఖర్చులకే పోతాయనే ఉద్దేశంలో చెరుకు పంటను సాగుచేయడం లేదు. ఇకనైనా పాలకులు స్పందించి ప్యాక్టరీని తెరిపిస్తే ఈప్రాంతంలో చెరుకు సాగుకు పూర్వవైభవం రావటం ఖాయం ఇచ్చిన హామీని మరిచారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే రైతులకోసం ప్రత్యేకంగా పలు పథకాలను అమలు చేస్తూ అన్నదాతల అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తోంది. కానీ 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో ఎవరికి అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాగోగుల దృష్ట్యా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తే ఈ ప్రాంత చెరుకు రైతుల జీవితాల్లో తీపిని నింపినట్లు అవుతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. -
చెరుకు రైతుపై చిరుకన్ను!
చెరుకు సాగును టీడీపీ సర్కారు చిన్నచూపు చూస్తోంది. రైతన్నకు పంట సాగుపై ఆసక్తి ఉన్నా సర్కార్ మాత్రం సహకరించడం లేదు. సరైన మద్దతు ధర లేకపోవడం, ప్రోత్సాహం ఉండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రాజాం/రేగిడి: జిల్లాలో చెరుకు సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం మిగిలిన పంటలు కలిసి రాకపోవడమే. దీంతో ఎక్కువ మంది రైతులు చెరుకు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంటను సాగుచేస్తే ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 18,300 ఎకరాల్లో చెరకు పంటను సాగు చేశారు. అయితే సరైన మద్దతు ధరలేక అవస్థలు పడుతున్నారు. ఒకటే ఫ్యాక్టరీ చెరుకు సాగు విస్తీర్ణం పెరుగుతున్నా చక్కెర పరిశ్రమ మా త్రం జిల్లాలో ఒకటే ఉంది. రేగిడి మండలంలోని సంకిలి ఫ్యారిస్ ప్రైవేటు చక్కెర కర్మాగారం ఒక్కటి మాత్రమే గత్యంతరంగా మారింది. ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం 2003లో మూత బడింది. దీంతో జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా చెరకు సాగు తగ్గిపోయింది. తరువాత సంకిలి ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో రైతులు మళ్లీ సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర కల్పించడం లేదు. చెరుకు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. ఫలితంగా రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం ఫ్యారిస్ చక్కెర కర్మాగారం పరిధిలోని పలు మండలాల్లో ఈ ఏడాది 18 వేల ఎకరాల్లోనే చెరుకు పంటను సాగు చేస్తున్నారు. పరిశ్రమవారి నిబంధల మేరకు చెరుకు సాగు చేసే వారికి ఎకరాకు రు.7 వేల రాయితీని, సాధారణ సాగుకు రూ. 5 వేల రాయితీని యాజమాన్యం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కర్మాగార సిబ్బంది దీన్ని విస్తారంగా ప్రచారం చేసినప్పటికీ రైతుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు శ్రమకు తగ్గ ఫలితం శూన్యం.. చెరుకు సాగు రైతుకు ఆదాయపరంగా పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర ప్రతి ఏటా టన్నుకు రు.50 నుంచి వంద రూపాయల లోపే పెరుగుతుండగా, సాగు ఖర్చులు మాత్రం భారీగా ఉంటున్నాయి. చెరుకు టన్ను ధర ప్రస్తుతం 2750 మాత్రమే ఉంది. దీంతో ఇది ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు, రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. టన్నుకు రు.4000 చెల్లిస్తే గిట్టుబాటు అవుతోందంటున్నారు. అయితే సర్కార్ మాత్రం రైతుల డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది పెంచిన మద్దతుధరే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఎకరా చెరుకు పంట సాగు చేయాలంటే దుక్కి, విత్తనం, గొప్పు, కలుపు తీత, చెరుకు నరకడం, రవాణా ఇతర యాజమాన్య ఖర్చులు కలిపి సుమారు రు.50 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు సరాసరిన 25 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన చూస్తే రు.67,500 రైతుకు కర్మాగారం చెల్లిస్తోంది. ఖర్చులు పోను రైతుకు మిగిలేది రు.17,500 మాత్రమే. ఈ లెక్కన చూస్తే ఏడాది పొడుగునా చెరుకు పంట పొలంలో ఉండటంతో అపరాలు పంటను కూడా వేసుకోలేకపోవడంతో రైతు నష్టపోతున్నారు. పెరగని దిగుబడులు జిల్లాలో చెరుకు పంట దిగుబడులు చూసుకొంటే సగటున ఎకరాకు 30 టన్నులు మించడం లేదు. సాంకేతిక యాంత్రీకరణ పద్ధతులను రైతులకు అందించడంలో సైతం వ్యవసాయాదికారులు వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం చెరుకు పంట దిగుబడిని పెంచేందుకు ఫ్యారిస్ చక్కెర కర్మాగారం యాజమాన్యం కృషి చేస్తోంది. మొక్కకు..మొక్కకు నాలుగు అడుగుల దూరం ఉండేలా చూడడం, యాంత్రీకరణ పద్ధతులను కూడా తెరపైకి తెచ్చినప్పటికీ దిగుబడి మాత్రం పెరగడం లేదు. దీంతో రైతుల శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. సర్కార్ ప్రోత్సాహం చెరుకు రైతుకు లేకుండా పోయింది. గిట్టుబాటు కావడం లేదు చెరుకు సాగు చేద్దామని ఆశపడిన ప్రయోజనం ఉండడం లేదు. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రాబడి తక్కువుగా ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన, ప్రోత్సాహం పూర్తిగా లేదు. చల్లా రాజరత్నంనాయుడు, రైతు,వండానపేట, రేగిడి మండలం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మార్కెట్లో అమ్మిన పంచదారకు ధర ఎక్కువుగా ఉంది. రైతు పండించిన చెరకు పంటకు ధర ఉండటంలేదు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు అయ్యేలా టన్నుకు రూ. 4000 ధరను అందజేయాలి. -కరణం గోవిందరావు, రైతు, ఉప్పర్నాయుడువలస, రేగిడి మండలం -
ఉప ఎన్నికల ఎఫెక్ట్: కేంద్రం దిద్దుబాటు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానం, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ఈ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాటు పడుతున్న నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కొన్ని ఊరట చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చెరకు రైతులకు ఒకట్రెండు రోజుల్లో కేంద్రం తీపి కబురు అందించనుందని తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకునేందుకు రూ. 10వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. అలాగే చెరకు ఎగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరకు దిగుమతులపై ప్రస్తుతం 50శాతం సుంకం విధిస్తుండగా.. దానిని 100శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన కైరానా లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. సిట్టింగ్ సీటు అయిన కైరానాలో బీజేపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ ఓటమిలో చెరకు రైతులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చెరకు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. -
ఎన్డీఎస్ఎల్ కథ కంచికేనా?
లేఆఫ్ ప్రకటించి...కార్మికుల వేతనాలను నిలిపివేసిన యాజమాన్యం ఈయేడు కూడా క్రషింగ్ భరోసాలేదు ఫ్యాక్టరీ పరిధిలో 20వేల ఎకరాల్లో చెరకుసాగు గానుగకు దగ్గర పడుతున్న సమయం ఆధారం కోసం దిక్కులు చూస్తున్న అన్నదాతలు మెదక్: ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం రెండేళ్లుగా క్రషింగ్ నిలిపివేయడంతో చెరకు రైతులు అయోమయంలో పడ్డారు. యాజమాన్యం ఏడు నెలల క్రితం లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులకు వేతనాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు అప్పటినుంచి ఫ్యాక్టరీ గేటు ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంకాని, యాజమాన్యంగాని స్పందంచడంలేదు. మంభోజిపల్లి శివారులోని ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ పరిధిలో మెదక్, కొల్చారం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి, టేక్మాల్‌తో పాటు 12 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడంలో రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభంలో సీజన్లో 5లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. 600 మంది కార్మికులు పనిచేసేవారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టాలను సాకుగా చూపి మెదక్, బోధన్, మెట్పల్లి యూనిట్లను ప్రైవేట్ సంస్థకు 51 శాతం వాటాను అప్పగించారు. నాటి నుంచి కార్మికులకు, రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చెరుకు సీజన్లో ఫ్యాక్టరీని ప్రారంభించక పోవడంతో లక్షలాది టన్నుల చెరుకు ఖండసారి ఫ్యాక్టరీలకు తరలించి నష్టపోయారు. ఈసారి క్రషింగ్‌కు నెలన్నర సమయమే ఉన్నందున గత ఏడాది పరిస్థితే కొనసాగుతుందా.. అనే ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ఫ్యాక్టరీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లేఆఫ్ ప్రకటించడం, కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టడం, క్రషింగ్ చేపట్టక పోవడం, కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది కార్మికులతో ఫ్యాక్టరీ లోపల పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించే పనులు చేయించారు. అయినప్పటికీ కార్మికులు కూలీలు చేసే పనులు చేశారు. ఇదే సమయంలో ఎన్డీఎస్ఎల్ నుంచి ఆరుగురు కార్మికులు పదవీవిరమణ చేశారు. ఆ సమయంలో వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడంతో ముగ్గురు కార్మికులు గుండె ఆగి చనిపోయారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కార్మికులకు, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
చెరుకు రైతులను ఆదుకోండి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సీఎల్పీ ఉపనాయకులు టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చెరుకు రైతులకు ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీల నుంచి 25 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఏడాదంతా కష్టపడిన చెరుకు రైతులకు పంటను అమ్ముకున్నా బకాయిలు ఇవ్వడానికి కంపెనీలు వేధిస్తున్నాయని అన్నారు. చెరుకు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందనే అనుమానాలు కలుగుతున్నాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు బకాయిలను ఇప్పించాలని కోరుతూ సీఎల్పీ నేత కె.జానా రెడ్డి కూడా లేఖను రాస్తున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. చెరుకు రైతులకు సీఎల్పీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. -
మంచి కాలం ముందుంది
⇒ చెరుకు రైతుల శ్రేయస్సు కోసం కృషి ⇒ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది ⇒ ఎఎన్ఎస్ఎఫ్ సర్కారు పరమవుతుంది ⇒ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: జిల్లాలోని చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి, చక్కెర కర్మాగారాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్‌లోని ఎన్ఎస్ఎఫ్ (నిజాం షుగర్ ఫ్యాక్టరీ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని చెప్పారు. సో మవారం తన స్వగృహం నుంచి నిజామాబాద్ రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మహారాష్ట్రలోని పూణె ప్రాంతానికి మంత్రి బస్సులో బయలుదేరారు. ఆయన వెంట బాన్సువాడ, బోధన్, డిచ్పల్లి ప్రాంత రైతులు ఉన్నారు. బస్సుయాత్రను ప్రారంభించే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆసియాలోనే పేరుగాంచిన ఎన్ఎస్ఎఫ్ ప్రయివేటుపరం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మహారాష్ట్రలోని పూణె సమీపంలో గల బారామత్లో రైతులు విజయవంతంగా కర్మాగారాలను నడిపిస్తున్న ట్లు తెలిసిందని, వారు ఎలా నడుపుతున్నారో తెలుసుకొనేందుకు ఈ పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. రైతులను చైతన్యపర్చి, వారిలో ఉత్సాహం నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు. ఎన్ఎస్ఎఫ్ కర్మాగారాల కోసం రూ. 400 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు. ఉత్సాహంగా ప్రారంభమైన పర్యటన పర్యటనలో చెరుకు రైతులతో మంత్రి, ఎమ్మెల్యేలు కలిసిరావడంపై రైతులు హ ర్షం వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు మహర్దశ రానుందన్నారు. నిజాం చక్కెర క ర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, రైతుల భాగస్వామ్యంతో నడపడా న్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ పర్యటనలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ పర్యటనలో తాము మహారాష్ట్ర రైతుల ఆధునిక వ్యవసాయపద్ధతులను తెలుసుకొంటామన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొత్తకొండ భాస్కర్ పాల్గొన్నారు. -
బిల్లుల చెల్లింపు ఎప్పుడో !
బోధన్ : చెరుకు రైతు ఏటా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పడం లేదు. ఏడాది కాలం శ్రమిం చి పండించిన చెరుకును ఫ్యాక్టరీ క్రషింగ్‌కు పంపుతుంటే నిబంధనల ప్రకారం రావాల్సి బిల్లులు అందకపోగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేడు బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితు వస్తున్నాయి. నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ధర చెల్లించాలని రైతులు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కలేదు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవే ట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లింది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం విస్మరించాయి. ప్రైవేట్ ఫ్యా క్టరీ యాజమాన్యం లాభపేక్షధోరణితో వ్యవహరిస్తోందని రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకపక్షంగా ధర నిర్ణయిస్తోందనే ఆరోపణలు వసున్నాయి. చెరుకు సరఫరా చేసిన రైతులు ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూ స్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరి స్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర.. బోధన్ ఎన్డీఎస్ఎల్లో 2014-15 సీజ న్కు సంబంధించి గత డిసెంబర్ 1న క్రషింగ్ ప్రారంభించారు. సుమారు 90 వేల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ పూర్తయ్యిందని ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో క్రషింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నా యి. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లిం చా లి. అయితే నెల పదిహేను రోజులు కావస్తు న్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు ఎప్పు డు చెల్లించేది స్పష్టం చేయలేదు.యాజమాన్యం ప్రకటించిన ధర ప్రకారం రైతులకు రూ. 20 కోట్లవరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు.. వాస్తవంగా అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేసి తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, పూర్వవైభవం తెస్తామ ని సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో హామీ ఇచ్చా రు. దీంతో ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం డోలాయమాన పరిస్థితిలో క్రషింగ్ ప్రా రంభించేందుకు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితిని గమనించిన రైతులు స్థానిక ఎమ్మె ల్యే షకీల్ నేతృత్వంలో ఎంపీ కవిత, రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రైవేట్ యాజమాన్యం క్రషింగ్ ప్రారంభించింది.క్రషింగ్ప్రారంభం కథ సుఖాంతంగా ముగిసింది. టన్ను ధర రూ.2260 ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ ఏడాది క్రషింగ్ సీజన్ టన్ను ధర రూ.2200, ప్రభుత్వ కొనుగోలు ధర రూ. 60 కలుపుకుని రూ. 2260 ప్రకటించింది.గత ఏడాది సీజన్లో టన్ను ధర రూ. 2600 చెల్లించారు. ఈ ధరను కూడా రౌండ్ల వారీగా చెల్లించారు.ఈ ధరనైనా చెల్లించాలని రైతులు కోరుతున్నా యాజమాన్యం మౌనం వహించింది. ఈ ధర వివాదం మళ్లీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఈ నెల 5న హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రైతుల సమావేశంలో సీఎం కేసీఆర్ ధర పై స్పష్టత ఇచ్చారు. టన్నుకు రూ. 2600 ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ భరోసాఇచ్చారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన టన్ను ధర రూ. 2260 చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. బిల్లుల చెల్లింపు పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదు. బిల్లుల చెల్లింపులో ఇంకెంత కాలం జాప్యం జరుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏదీ.. నాటి వైభవం!
ఒకనాడు చెరుకు రైతులను ప్రోత్సహించి, చెరుకు సాగు పెంపుదల కోసం కృషి చేసిన ‘చెరుకు అభివృద్ధి మండళ్లు’ ప్రస్తుతం నిస్సహా య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా యి. సర్కారు అండ కరువై అలంకారప్రాయంగా మిగిలాయి. ఘన చరిత్ర కలిగిన సీడీసీలు నిధులు లేక, ఆదాయ వనరులు పడిపోయి నిర్వీర్యంగా దర్శనమిస్తున్నాయి. * అలంకారప్రాయంగా మారిన సీడీసీలు * పడిపోయిన ఆదాయ వనరులు * చెరుకు రైతుకు ప్రోత్సాహం కరువు * తెలంగాణ సర్కారుపైనే ఇక ఆశలు బోధన్: చక్కెర పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉండగా చెరుకు అభివృద్ధి మండళ్లకు (సీడీసీలు) పుష్కలంగా ఆదాయం ఉండేది. ఎందుకంటే, అపుడు చెరు కు క్రషింగ్ గణనీయంగా సాగేది. ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ప్రయివేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లడం, చెరుకు సాగు భారీగా తగ్గిపోవడంతో ఆదా యం పడిపోయింది. ప్రయివేటు యాజమాన్యాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారయినా సీడీసీలకు మళ్లీ జీవం పోస్తే మేలు జరుగుతోందని రైతులు ఆశిస్తున్నారు. నామమాత్రపు సేవలు గతంలో చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు సీడీసీలు రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు, సాగు నీటి సరఫరాకు పైపులు అందించేవి. చెరుకు రవాణాకోసం రహదారులు కూడా నిర్మించేవి. ప్రస్తు తం ఈ సేవలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ కార్యాలయ పరిధిలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు లేనందున అక్కడ సీడీసీలు ఏర్పాటు కాలే దు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, కామారెడ్డి,పిట్లం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో సీడీసీలున్నాయి. ఇందులో నిజామాబాద్ సీడీసీ మూతపడిం ది. కామారెడ్డి, పిట్లం సీడీసీల ద్వారా కొంత మేరకు సేవలందిస్తున్నారు. చెరుకు క్రషింగ్ పైనే సీడీసీలకు ఆదాయం వస్తుంది. క్రషింగ్ అయిన ప్రతి టన్నుకు ఎనిమిది రూపాయల చొప్పున యాజమాన్యాలు సీడీసీలకు చెల్లించాలి. రైతుల బిల్లుల నుంచి మరో నాలు గు రూపాయలు వస్తాయి. ప్రభుత్వ నిధులేమీ ఉండ వు. చెరుకు సాగు క్రమంగా పడిపోయి, సీడీసీలకు ఆదాయం తగ్గిపోయింది. రాజకీయ పునరావాస కేంద్రాలు ప్రభుత్వాలు సీడీసీ చైర్మన్, డెరైక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నాయి. దీంతో అవి రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా పేరుపొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉండగా, 1990 వరకు ప్రతి సీజన్లో ఐదు లక్షల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ అయ్యేది. ఇక్కడ 1962లో సీడీసీని ఏర్పాటు చేశారు. అప్పట్లో పుష్కలంగా ఆదాయం సమకూ రింది. 2002లో ఈ ఫ్యాక్టరీని ప్రయివేటీకరించారు. అప్పటి నుంచి 2013-14 సీజన్ వరకు ఇక్కడ రెండు లక్షల టన్నులకు పైగా మాత్రమే క్రషింగ్ జరిగింది. ఫలితంగా సీడీసీకి ఆదాయం పడిపోయింది. ఈ ఏడాది 1.09 లక్షల టన్నుల వరకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చెరుకును సాగు చేస్తున్న రైతులకు లాభసాటి ధర అందని ద్రాక్షగానే మిగులుతోంది. చెరుకును లాభదాయకం గా మార్చేందుకు, ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న సాగు పద్ధతులు, అధిక దిగుబడుల విధానాలను అధ్య యనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సీడీసీలు, రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఉండేలా చూడాలని రైతు నాయకులు కోరుతున్నారు. టీఆర్ఎస్ హామీ మే రకు చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరమైతే సీడీసీలకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి చక్కెర ఫ్యాక్టరీల పురోగతికి కోసం ప్రభుత్వం చెరుకు రైతులను ప్రోత్సహించాలి. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, లాభసాటి ధర అందే విధంగా చూస్తే సాగు గణనీ యంగా పెరిగే అవకాశం ఉం టుంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’, స్టేట్ షుగర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విభాగం ద్వారా చక్కెర పరిశ్రమల అభివద్ధి కోసం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి పరిశీలనలో ఉన్నాయి. చెరుకు సాగు పెరిగితే సీడీసీలకు ఆదాయ వనరులు సమకూరుతాయి. - ఎం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ -
ఆందోళనలో చెరకు రైతులు
జహీరాబాద్: ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగార యాజమాన్యం ఈ సారి కూడా చెరకు రైతుకు చేదును మిగిల్చింది. సామర్థ్యం పెంచి కర్మాగారం పరిధిలో సాగైన పంటనంతా కొనాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, 2014-15 క్రషింగ్ సీజన్ సామర్థ్యం పెంచే యోచనను యాజమాన్యం దాదాపుగా విరమించుకుంది. రైతుల కోరిక మేరకు తొలుత సామర్థ్యం పెంచాలనుకున్న యాజమాన్యం ఆ తర్వాత పలు కారణాలతో సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నుల మేర కలిగి ఉంది. దాన్ని సీజన్‌కు గాను 3,300 టన్నులకు పెంచాలని యోచించింది. నవంబర్ రెండో వారంలో క్రషింగ్ ఉన్నందున ఇప్పటికిప్పుడు విస్తరణ పనులు ప్రారంభిస్తే సీజన్ ఆరంభానికల్లా పూర్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో అయితే ఆఖరు నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో రైతులు తమ చెరకును వ్యయప్రయాసల కోర్చి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వచ్చే సీజన్‌కు సామర్థ్యం పెంచేలా చర్యలు ప్రస్తుతం కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500ల టన్నులుగా ఉంది. దీన్ని ప్రస్తుతం రోజుకు 3,800 టన్నులకు పెంచాలని, ఆ తర్వాత 2015-16 క్రషింగ్ సీజన్‌కు 4,200 టన్నుల మేరకు చేర్చాలని యాజమాన్యం పరిశీలించినట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం కర్మాగారం ఎం.డి రాజశ్రీ జహీరాబాద్ వచ్చిన సందర్భంగా రైతులు సామర్థ్యం పెంచే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె సుముఖత కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌కు కాకుండా 2015-16 క్రషింగ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్మాగారం సామర్థ్యాన్ని మొక్కుబడిగా పెంచితే ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదని, 6 వేల టన్నులకు పెంచే విషయాన్ని యాజమాన్యం సీరియస్‌గా పరిశీలించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. సాగు పెరిగినా...పెరగని క్రషింగ్ 1973 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్-3 కర్మాగారాన్ని జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో నిర్మించి ప్రారంభించింది. అప్పట్లో రోజుకు 1,250 టన్నుల సామర్థ్యం మేర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. పలు దశల్లో కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ప్రతి ఏటా జోన్ పరిధిలో చెరకు పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతుండడంతో కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు. సంగారెడ్డిలోని గణపతి, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట కర్మాగారాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాలకు కూడా రైతులు చెరకును తరలించుకుంటున్నారు. కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు చెరకును విక్రయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్మాగారం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయినా యాజమాన్యం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ప్రస్తుతం అధికారికంగా 24వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. అనధికారికంగా ఇది 28 వేల ఎకరాల్లో ఉంటుందని అంచనా. పూర్తిస్థాయిలో జరగని క్రషింగ్ ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకు పంటను ట్రైడెంట్ కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం లేదు . గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి నెలకొంటూ వస్తోంది. జోన్ పరిధిలో సుమారు 9 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇందులో ట్రైడెంట్ కర్మాగారం సుమారు 4.75 లక్షల టన్నుల చెరకును మాత్రమే క్రషింగ్ చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 4.65 లక్షల టన్నుల మేర చెరకును క్రషింగ్ చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు చెరకును ఇతర కర్మాగారాలకు తరలించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావం కూడా ఏర్పడడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత మేర ఇతర కర్మాగారాలకు చెరకు పంటను తరలించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆలస్యం చేస్తే కూలీ, రవాణా చార్జీల రేట్లు భారీగా పెరిగి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుందంటున్నారు. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ కర్మాగారం సామర్థ్యాన్ని రోజుకు 6 వేల టన్నుల మేర పెంచినట్లయితేనే ప్రయోజనం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో యాజమాన్యం ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
గానుగాడేనా?
తీపి చెరకును పండించే రైతుల బతుకులు చేదుగా మారుతున్నాయి. సీజన్ ముంచుకొస్తున్నా... అందుబాటులో ఉన్న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ఈయేడు నడుస్తుందో? లేదో తెలియని సందిగ్ధంలో చెరకు రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలన్న మంత్రుల కమిటీ నివేదిక అమలుకు నోచుకుంటుందా? లేక పాత యాజమాన్యమే నడిపిస్తుందా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ఇక్కడ పండించిన చెరకును బోధన్‌కు తరలిస్తారన్న ప్రచారం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మెదక్: మెతుకుసీమలోని 12 మండలాల చెరకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ సేవలందిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గత జనవరి 17న అప్పటి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పట్లో టీఆర్ఎస్ కూడా ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేసింది. అయితే అప్పటికే 2014-15 సంవత్సరానికి సంబంధించి యాజమాన్యంతో చెరకు రైతులు అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ఈయేడు ప్రభుత్వపరమయ్యే సూచనలు కనిపించడం లేదు. కాగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యమే ఫ్యాక్టరీని నడపాలని ఇటీవల మెదక్‌కు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ముందుకు సాగని మర మ్మతులు: సాధారణంగా ప్రతియేడు నవంబర్‌లో చెరకు క్రషింగ్ ప్రారంభమవుతోంది. అయితే ఫ్యాక్టరీని మరమ్మతులు చేయడానికి సుమారు రెండు నెలలు పడుతుందని సమాచారం. కాని ఇంతవరకు మరమ్మతులు మొదలు కాలేదని రైతులు చెబుతున్నారు. పైగా ఫ్యాక్టరీతో చెరకు అగ్రిమెంట్లు ఉన్న వివరాలను తిరిగి సేకరిస్తున్నారని వారు తెలిపారు. దీంతో క్రషింగ్ కోసం ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బోనస్‌కు సంబంధించి బకాయిపడ్డ రూ.4 కోట్లను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ కేంద్రంగా మూడు ఫ్యాక్టరీల క్రషింగ్? తెలంగాణ పరిధిలోని మంభోజిపల్లి, బోధన్, మెట్పల్లి ఫ్యాక్టరీలు ఒకే ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నాయి. వీటికింద ఈయేడు సుమారు 3 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతియేటా ఈ మూడు ఫ్యాక్టరీలను మరమ్మతులు చేసి నడపాలంటే సుమారు రూ.18 కోట్లనుంచి 20 కోట్ల ఖర్చు వస్తుందని రైతు నాయకులు చెబుతున్నారు. అందుకే బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించి మిగతా రెండు ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును అక్కడికి తరలిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరకును నరికి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల రవాణాలో జాప్యం జరగడం వల్ల తూకంలో నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే చక్కెర ఫ్యాక్టరీని నడపాలని చెరకు రైతుల పోరాట సమితి కార్యదర్శి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి కూడా విన్నవించామన్నారు. ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈయేడు క్రషింగ్ విషయంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. గత యేడాది చెరకు బిల్లులు చెల్లించాం. బోనస్ బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉంది. - నాగరాజు, జీఎం, ఎన్డీఎస్ఎల్, మంభోజిపల్లి -
కష్టానికి ఫలమేది?
బోధన్, న్యూస్‌లైన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2013-14 సీజన్లో 1.72 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించారు. దీనికి టన్ను ధర రూ. 2.600 చొప్పున లె క్కించినా రైతులకు రూ. 44 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా రూ. 22 కోట్ల వరకు మాత్రమే చెల్లించారని రైతులు తెలిపారు, మిగిలిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్ష వైఖరితో రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఏటా తిప్పలే నిజాం షుగర్స్‌ను 2002లో చంద్రబాబు నిర్ధాక్షిణ్యం గా ప్రైవేటీకరించారు. దీంతో కర్మాగారం ప్రయివేటు భాగస్వామ్యంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ ఎల్)గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాజమాన్యం రైతులకు బిల్లుల చెల్లింపులో ఏటా తీవ్ర జాప్యం చేస్తోంది. మరోవైపు రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులకు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర రాక చెరుకు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. బోధన్ ప్రాంతంలో వాణిజ్య పంటగా చెరుకు సాగుచేసిన రైతులు ఏటా సాగును తగ్గించుకుంటున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. క్రషింగ్ ప్రారంభమే వివాదాస్పద ం 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలోనే వివాదాస్పదమైంది. 2013, నవంబర్ 28న క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించిన యాజమాన్యం ఏకపక్షంగా క్రషింగ్ నిలి పివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖంగు తిన్న రైతులు గిట్టుబాటు ధర విషయం పక్కనపెట్టి క్రషింగ్ ప్రారంభించాలని ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చి డిసెం బర్ 9న క్రషింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 19 వరకు క్రషింగ్ కొనసాగింది.1.72 లక్షల టన్నుల చెరుకు గానుగాడింది. ఈ క్రమంలో ధర విషయంలో రైతులు సందిగ్ధతకు గురయ్యారు. ప్రైవేట్ యాజమాన్యం నిరుడు చెల్లించిన టన్ను ధర రూ.2,600 ప్రకటించింది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని, టన్నుకు రూ. 3,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే యాజ మాన్యంపై ఒత్తిడి పెంచారు. కాని యాజమాన్యం నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. టన్నుకు రూ. 2,400 చొప్పున చెల్లింపు టన్ను ధర రూ.2,600 ఉండగా, యాజమాన్యం ఇప్పటి వరకు రూ, 2,400 చొప్పున మూడు రౌండ్లలో చెల్లించింది. మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు మరో రెండు రౌండ్లలో చెల్లించాల్సిన బకాయిలు కలుపుకుంటే సుమారు రూ. 22 కోట్ల వరకు ఉంటాయని రైతు నాయకులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో క్రషింగ్ ప్రారంభంలో జరిగిన చర్చలలో చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో టన్నుకు రూ, 2,400 చొప్పున చెల్లిస్తామని, మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయిన నెలలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయి నెల దాటినా మరో రెండు రౌండ్లకు సంబంధించిన రైతుల బిల్లులు పూర్తిగా ఆగిపోయాయని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది, కాని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నిబంధనలు వర్తిం చడం లేదు. ఇప్పటికైనా మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
చెరకు రైతుకు చేదు గుళిక
అంతుచిక్కని తెగుళ్లు తగ్గిపోతున్న దిగుబడి వరివైపు మొగ్గుతున్న వైనం మునగపాక, న్యూస్‌లైన్ : ఒకవైపు చెరకు తోటలకు అంతుపట్టని తెగుళ్లు, మరోవైపు బెల్లం దిగుబడులు తగ్గిపోవడంతో చెరకు రైతు ఆవేదన చెందుతున్నాడు. గతంలో భారీ విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేసే రైతులు ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో గత్యంతర లేక వరిసాగుపట్ల మక్కువ చూపుతున్నారు. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని తెగుళ్లు చెరకుకు సోకడంతో దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. మునగపాక మండలంలోని చెరకు సాధారణ విస్తీర్ణం 2,476 హెక్టార్లు కాగా ఈ ఏడాది 2300 హెక్టార్లకు పడిపోయింది. అలాగే రబీలో వరి సాధారణవిస్తీర్ణం 55 హెక్టార్లు కాగా అదిప్పుడు రెట్టింపయింది. ముసిలితల్లి మూల సంఘంతోపాటు గెడ్డవతల అధిక విస్తీర్ణంలో తోటలకు తెగులు సోకుతున్నాయి. దీంతో తోటంతా ఎండిపోతుంది. ఇప్పటికే పలు మార్లు శాస్త్రవేత్తలు సైతం పర్యటించినా ఈ తె గుళ్లపై అంచనాకు రాలేకపోతున్నారు. సాధారణంగా ఎకరాకు 30-35 పాకాల వరకు బెల్లం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఈ లెక్కన సుమారు రూ.లక్ష వరకు ఆదాయం రావాల్సి ఉంటుంది. అయితే తోటలకు సోకిన తెగుళ్ల కారణంగా 6 పాకాలకు మించి దిగుబడులు రావడం లేదు.ప్రస్తుతం అనకాపల్లి బెల్లం మార్కెట్లో మొదటిరకం పదిమణుగులు రూ.2,600 కాగా రెండో రకం 2,400, మూడోరకం రూ.2,190 పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తెగుళ్ల కారణంగా బెల్లం ఆరకపోవడం, సరిగా రంగు రాకపోవడం రైతులను కుంగదీస్తుంది. అంతేకాకుండా గత ఏడాది పలు మార్లు తుఫాన్లు సంభవించడంతో తోటలన్నీ నీటముంపునకు గురికావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతోబాటు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సర్కారు సైతం ముందుకురాకపోవడం గమనార్హం. -
చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు
న్యూఢిల్లీ: చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు బ్యాం కుల నుంచి రూ.6,600 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చేందుకు ఓకే చెప్పిన సీసీఈఏ... వీటికి విధివిధానాలను కూడా గురువారంనాటి సమావేశంలో ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చక్కెర పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకలరుతో చెప్పారు. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తం రుణంపై రూ.2,750 కోట్ల వడ్డీ భారం పడుతుందని, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) నుంచి దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. నిధులను సక్రమంగా(రైతులకు చెల్లిం పులు) వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు వీలుగా ఈ రుణాలను ప్రత్యేక బ్యాంక్ ఖాతాద్వారా బ్యాంకులు మిల్లులకు ఇస్తాయి. నోడల్ బ్యాంక్ నియామకం, రుణ ప్రక్రియ నిర్వహణకు తగిన నిబంధనలను ఆర్థిక శాఖ జారీచేయనుందని థామస్ చెప్పారు. కాగా, ఐదేళ్ల వ్యవధిలో వడ్డీలేకుండా మిల్లులు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, తొలి రెండేళ్లు చెల్లింపులపై మారటోరియంను వినియోగించుకోవచ్చని కూడా అధికారిక ప్రకటన పేర్కొంది. అసలు చెల్లింపుల్లో డీఫాల్ట్గనుక అయితే, ఆ వ్యవధికి వడ్డీ రాయితీలేవీ వర్తించకుండా విధివిధానాల్లో చేర్చారు. ప్రస్తుత సీజన్(2013-14, అక్టోబర్-సెప్టెంబర్)లోనే మిల్లులకు ఈ రుణాలు లభిస్తాయి. -
ఆదుకుంటాం....
= చెరకు రైతులకు అండగా ఉంటాం = కేంద్ర సాయం కోసం త్వరలో ప్రతినిధి బృందంతో ఢిల్లీకి = రైతుల కష్టాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తా = ఈ విషయంపై గతంలోనే కేంద్రానికి రెండు లేఖలు = గిట్టుబాటు ధర నిర్ణయంలో చక్కెర ఫ్యాక్టరీల లాబీకి తలొగ్గం = మండలిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కష్టాల్లో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడంలో భాగంగా కేంద్ర సాయాన్ని కోరడానికి వచ్చే నెల ఆరో తేదీ తర్వాత ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెరకు మద్దతు ధరపై శాసన మండలిలో జరిగిన చర్చకు శుక్రవారం ఆయన సమాధానమిచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్లను కలుసుకుని చెరకు రైతులకు అండగా నిలవాలని కోరనున్నట్లు చెప్పారు. చక్కెర ధర పతనం కావడంతో చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు సరైన మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్టాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతామని వివరించారు. చెరకు రైతుల కడగండ్లపై ఇదివరకే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి రెండు లేఖలను రాస్తూ చెరకు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరినట్లు చెప్పారు. చక్కెర దిగుమతి సుంకాన్ని ఐదు శాతం నుంచి 40 శాతానికి పెంచాలని, రాష్ట్రంలో నిల్వ ఉన్న 85 లక్షల టన్నుల చక్కెరకు సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. బకాయిల చెల్లింపు రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు చక్కెర కర్మాగారాలు చెరకు రైతులకు రూ.780 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండేదని, ఇప్పటి వరకు రూ.748 కోట్లను చెల్లించేశారని తెలిపారు. చక్కెర కర్మాగారాల యజమానులు మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ, చెరకు మద్దతు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. చక్కెర ఫ్యాక్టరీల లాబీకి ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. టన్ను చెరకుకు మద్దతు ధరను రూ.3 వేలుగా నిర్ణయించాలన్న బీజేపీ సభ్యుల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ‘వీరు అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ చక్కెర ధర రూ.3,400గా ఉండేది. అప్పట్లో వారు చెరకు మద్దతు ధరను ఎందుకు పెంచలేదు’ అని నిలదీశారు. అంతకు ముందు బీజేపీ సభ్యులు మద్దతు ధరపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
గిట్టుబాటు ధర కోసం ఉద్యమించిన చెరకు రైతులు
సాక్షి, ముంబై: చెరకు రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో అనేక ఇబ్బందులు పడుతున్న తమకు సర్కార్ కనీస మద్ధతు ధర రూ.మూ డు వేలు కల్పించి ఆదుకోవాలంటున్నారు. గిట్టుబాట ధర కోసం ఢిల్లీలో మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అఖిల పక్ష బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రధాని నుంచి ఎటువంటి హామీ రాలేదని తెలుసుకున్న రైతులు, ‘స్వాభిమాని శేత్కారీ సంఘటన్’ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. మంగళవారం రాత్రి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసు వాహనాలతోపాటు ఎంఎస్ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బుధవారం ఉదయం కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఆందోళనకారులు పోలీసులు, ఆర్టీసీ, ట్రక్కులతోపాటు ఇతర వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. కరాడ్-తాస్గావ్ మార్గంలో మంగళవారం రాత్రి వివిధ వాహనాల టైర్లకు నిప్పంటించారు. ఆపేందుకు వచ్చిన పోలీసుల జీపులపై రాళ్ల దాడికి దిగారు. బుధవారం ఉదయం శెరెపాటా వద్ద రోడ్డుపై చెట్లు నరికి అడ్డంగా పడేశారు. వడగావ్ హవేలి వద్ద టైర్లకు నిప్పం టించారు. ఆందోళన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ముందుజాగ్రత్తగా కరాడ్ నుంచి పుణే-ముంబై వైపు వెళ్లే బస్సు సేవలను నిలిపివేసింది. తాస్గావ్ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలపై ప్రభావం పడడంతో ఆ మార్గంవైపు ఒక్క బస్సు కూడా వెళ్లలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రూ.మూడు వేలు ఇవ్వాలి.... చెరుకుకు తొలి విడతలో కనీస మద్ధతు ధరను క్వింటాల్‌కు రూ.మూ డు వేల ధర చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ‘స్వాభిమాని శేత్కారీ సంఘటన్’ నాయకుడు రాజు శెట్టి తెలిపారు. అయితే ఢిల్లీలో చర్చలు విఫలం కావడంతో రైతులు కోపంగా ఉన్నారన్నారు. అయితే ఎవరూ దాడులకు దిగవద్దని పిలుపునిచ్చారు. వాహనాలను ధ్వంసం చేయవద్దని కోరారు. తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు... ఆందోళన తీవ్రం కావడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఈ రోజు జరిగిన పరీక్షలకు కూడా హాజరుకాలేకపోయారని తెలిసింది. గుండ్లు గీయించుకుని నిరసన... గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అనేక మంది ఆందోళనకారులు గుండ్లు గీయిం చుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ల దిష్టిబొమ్మలను దగ్ధంచేసినట్టు సమాచారం. గతేడాది కూడా ఇదే పరిస్థితి... 2012 నవంబర్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ సమయంలో గిట్టుబాటు ధరల కోసం చెరకు రైతులు చేపట్టిన ఆందోళనలో ఒకరు ట్రక్కు కింద నలిగి, మరొకరు పోలీసు కాల్పుల్లో ఇద్దరు రైతులు మరణించారు. దీంతో ఆ సమయంలో ఆందోళన తీవ్రరూపందాల్చింది. మరోవైపు ఈసారి కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.