సాక్షి, హైదరాబాద్: చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సీఎల్‌పీ ఉపనాయకులు టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చెరుకు రైతులకు ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీల నుంచి 25 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఏడాదంతా కష్టపడిన చెరుకు రైతులకు పంటను అమ్ముకున్నా బకాయిలు ఇవ్వడానికి కంపెనీలు వేధిస్తున్నాయని అన్నారు.
చెరుకు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందనే అనుమానాలు కలుగుతున్నాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు బకాయిలను ఇప్పించాలని కోరుతూ సీఎల్‌పీ నేత కె.జానా రెడ్డి కూడా లేఖను రాస్తున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. చెరుకు రైతులకు సీఎల్‌పీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.
చెరుకు రైతులను ఆదుకోండి: జీవన్‌రెడ్డి
Published Wed, Apr 29 2015 8:38 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement