మంచి కాలం ముందుంది
⇒ చెరుకు రైతుల శ్రేయస్సు కోసం కృషి
⇒ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది
⇒ ఎఎన్‌ఎస్‌ఎఫ్ సర్కారు పరమవుతుంది
⇒ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ: జిల్లాలోని చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి, చక్కెర కర్మాగారాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్ (నిజాం షుగర్ ఫ్యాక్టరీ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని చెప్పారు. సో మవారం తన స్వగృహం నుంచి నిజామాబాద్ రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మహారాష్ట్రలోని పూణె ప్రాంతానికి మంత్రి బస్సులో బయలుదేరారు.
ఆయన వెంట బాన్సువాడ, బోధన్, డిచ్‌పల్లి ప్రాంత రైతులు ఉన్నారు. బస్సుయాత్రను ప్రారంభించే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆసియాలోనే పేరుగాంచిన ఎన్‌ఎస్‌ఎఫ్ ప్రయివేటుపరం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మహారాష్ట్రలోని పూణె సమీపంలో గల బారామత్‌లో రైతులు విజయవంతంగా కర్మాగారాలను నడిపిస్తున్న ట్లు తెలిసిందని, వారు ఎలా నడుపుతున్నారో తెలుసుకొనేందుకు ఈ పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. రైతులను చైతన్యపర్చి, వారిలో ఉత్సాహం నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ కర్మాగారాల కోసం రూ. 400 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.
ఉత్సాహంగా ప్రారంభమైన పర్యటన
పర్యటనలో చెరుకు రైతులతో మంత్రి, ఎమ్మెల్యేలు కలిసిరావడంపై రైతులు హ ర్షం వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు మహర్దశ రానుందన్నారు. నిజాం చక్కెర క ర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, రైతుల భాగస్వామ్యంతో నడపడా న్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు.
ఈ పర్యటనలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ పర్యటనలో తాము మహారాష్ట్ర రైతుల ఆధునిక వ్యవసాయపద్ధతులను తెలుసుకొంటామన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొత్తకొండ భాస్కర్ పాల్గొన్నారు.