బిల్లుల చెల్లింపు ఎప్పుడో ! | Would have to pay the bills! | Sakshi
Sakshi News home page

బిల్లుల చెల్లింపు ఎప్పుడో !

Published Mon, Jan 12 2015 5:38 AM | Last Updated on Mon, Oct 1 2018 4:26 PM

బిల్లుల చెల్లింపు ఎప్పుడో ! - Sakshi

బిల్లుల చెల్లింపు ఎప్పుడో !

బోధన్ : చెరుకు రైతు ఏటా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పడం లేదు. ఏడాది కాలం శ్రమిం చి పండించిన చెరుకును ఫ్యాక్టరీ క్రషింగ్‌కు పంపుతుంటే నిబంధనల ప్రకారం రావాల్సి బిల్లులు అందకపోగా రైతులు  ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేడు బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితు వస్తున్నాయి. నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్) యాజమాన్యం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ధర చెల్లించాలని రైతులు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కలేదు.

చక్కెర ఫ్యాక్టరీ ప్రైవే ట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లింది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం విస్మరించాయి. ప్రైవేట్ ఫ్యా క్టరీ యాజమాన్యం లాభపేక్షధోరణితో  వ్యవహరిస్తోందని రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకపక్షంగా ధర నిర్ణయిస్తోందనే ఆరోపణలు వసున్నాయి. చెరుకు సరఫరా చేసిన రైతులు ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూ స్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరి స్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
క్రషింగ్ ప్రారంభమై నెలన్నర..
బోధన్ ఎన్‌డీఎస్‌ఎల్‌లో 2014-15 సీజ న్‌కు సంబంధించి గత డిసెంబర్ 1న క్రషింగ్ ప్రారంభించారు. సుమారు 90 వేల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ పూర్తయ్యిందని ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో క్రషింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నా యి. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లిం చా లి. అయితే నెల పదిహేను రోజులు కావస్తు న్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు ఎప్పు డు చెల్లించేది స్పష్టం చేయలేదు.యాజమాన్యం ప్రకటించిన ధర ప్రకారం రైతులకు రూ. 20 కోట్లవరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
 
ప్రభుత్వ ఒత్తిడి మేరకు..
వాస్తవంగా అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేసి తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, పూర్వవైభవం తెస్తామ ని సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో హామీ ఇచ్చా రు. దీంతో ఎన్డీఎస్‌ఎల్ ప్రైవేట్ యాజమాన్యం డోలాయమాన పరిస్థితిలో క్రషింగ్ ప్రా రంభించేందుకు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితిని గమనించిన రైతులు స్థానిక ఎమ్మె ల్యే షకీల్ నేతృత్వంలో ఎంపీ కవిత, రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రైవేట్ యాజమాన్యం క్రషింగ్ ప్రారంభించింది.క్రషింగ్‌ప్రారంభం కథ సుఖాంతంగా ముగిసింది.
 
టన్ను ధర రూ.2260

ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ఈ ఏడాది క్రషింగ్ సీజన్ టన్ను ధర రూ.2200, ప్రభుత్వ కొనుగోలు ధర రూ. 60 కలుపుకుని రూ. 2260 ప్రకటించింది.గత ఏడాది సీజన్‌లో టన్ను ధర రూ. 2600 చెల్లించారు. ఈ ధరను కూడా రౌండ్ల వారీగా చెల్లించారు.ఈ ధరనైనా చెల్లించాలని రైతులు కోరుతున్నా యాజమాన్యం మౌనం వహించింది. ఈ ధర వివాదం మళ్లీ  సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది.

ఈ నెల 5న హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రైతుల సమావేశంలో సీఎం కేసీఆర్ ధర పై స్పష్టత ఇచ్చారు. టన్నుకు రూ. 2600 ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ భరోసాఇచ్చారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన టన్ను ధర రూ. 2260 చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. బిల్లుల చెల్లింపు పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదు.  బిల్లుల చెల్లింపులో  ఇంకెంత కాలం జాప్యం జరుగుతుందోనని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement