బోధన్, న్యూస్‌లైన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2013-14 సీజన్‌లో 1.72 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించారు. దీనికి టన్ను ధర రూ. 2.600 చొప్పున లె క్కించినా రైతులకు రూ. 44 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా రూ. 22 కోట్ల వరకు మాత్రమే చెల్లించారని రైతులు తెలిపారు, మిగిలిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్ష వైఖరితో రైతులకు కష్టాలే మిగులుతున్నాయి.
ఏటా తిప్పలే
నిజాం షుగర్స్‌ను 2002లో చంద్రబాబు నిర్ధాక్షిణ్యం గా ప్రైవేటీకరించారు. దీంతో కర్మాగారం ప్రయివేటు భాగస్వామ్యంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్ ఎల్)గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాజమాన్యం రైతులకు బిల్లుల చెల్లింపులో ఏటా తీవ్ర జాప్యం చేస్తోంది. మరోవైపు రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులకు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర రాక చెరుకు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. బోధన్ ప్రాంతంలో వాణిజ్య పంటగా చెరుకు సాగుచేసిన రైతులు ఏటా సాగును తగ్గించుకుంటున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడమే దీనికి ప్రధాన కారణం.
క్రషింగ్ ప్రారంభమే వివాదాస్పద ం
2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలోనే వివాదాస్పదమైంది. 2013, నవంబర్ 28న క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించిన యాజమాన్యం ఏకపక్షంగా క్రషింగ్ నిలి పివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖంగు తిన్న రైతులు గిట్టుబాటు ధర విషయం పక్కనపెట్టి క్రషింగ్ ప్రారంభించాలని ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చి డిసెం బర్ 9న క్రషింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 19 వరకు క్రషింగ్ కొనసాగింది.1.72 లక్షల టన్నుల చెరుకు గానుగాడింది. ఈ క్రమంలో ధర విషయంలో రైతులు సందిగ్ధతకు గురయ్యారు. ప్రైవేట్ యాజమాన్యం నిరుడు చెల్లించిన టన్ను ధర రూ.2,600 ప్రకటించింది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని, టన్నుకు రూ. 3,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే యాజ మాన్యంపై ఒత్తిడి పెంచారు. కాని యాజమాన్యం నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు.
టన్నుకు రూ. 2,400 చొప్పున చెల్లింపు
టన్ను ధర రూ.2,600 ఉండగా, యాజమాన్యం ఇప్పటి వరకు రూ, 2,400 చొప్పున మూడు రౌండ్లలో చెల్లించింది. మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు మరో రెండు రౌండ్లలో చెల్లించాల్సిన బకాయిలు కలుపుకుంటే సుమారు రూ. 22 కోట్ల వరకు ఉంటాయని రైతు నాయకులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో క్రషింగ్ ప్రారంభంలో జరిగిన చర్చలలో చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో టన్నుకు రూ, 2,400 చొప్పున చెల్లిస్తామని, మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయిన నెలలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయి నెల దాటినా మరో రెండు రౌండ్లకు సంబంధించిన రైతుల బిల్లులు పూర్తిగా ఆగిపోయాయని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది, కాని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నిబంధనలు వర్తిం చడం లేదు. ఇప్పటికైనా మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
కష్టానికి ఫలమేది?
Published Wed, Mar 26 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement