సీఎం దిష్టిబొమ్మ దహనం | protest against cm kcr over nizam sugar factory | Sakshi
Sakshi News home page

సీఎం దిష్టిబొమ్మ దహనం

Published Fri, Dec 23 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

protest against cm kcr over nizam sugar factory

బోధన్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగా శంకర్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement