చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు | CCEA okays norms for sugar mills to get interest-free loans | Sakshi
Sakshi News home page

చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు

Published Fri, Dec 27 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

చక్కెర మిల్లులు

చక్కెర మిల్లులు

న్యూఢిల్లీ: చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు బ్యాం కుల నుంచి రూ.6,600 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చేందుకు ఓకే చెప్పిన సీసీఈఏ... వీటికి విధివిధానాలను కూడా గురువారంనాటి సమావేశంలో ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చక్కెర పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకలరుతో చెప్పారు. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తం రుణంపై రూ.2,750 కోట్ల వడ్డీ భారం పడుతుందని, సుగర్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) నుంచి దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు.

నిధులను సక్రమంగా(రైతులకు చెల్లిం పులు) వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు వీలుగా ఈ రుణాలను ప్రత్యేక బ్యాంక్ ఖాతాద్వారా బ్యాంకులు మిల్లులకు ఇస్తాయి. నోడల్ బ్యాంక్ నియామకం, రుణ ప్రక్రియ నిర్వహణకు తగిన నిబంధనలను ఆర్థిక శాఖ జారీచేయనుందని థామస్ చెప్పారు. కాగా, ఐదేళ్ల వ్యవధిలో వడ్డీలేకుండా మిల్లులు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, తొలి రెండేళ్లు చెల్లింపులపై మారటోరియంను వినియోగించుకోవచ్చని కూడా అధికారిక ప్రకటన పేర్కొంది. అసలు చెల్లింపుల్లో డీఫాల్ట్‌గనుక అయితే, ఆ వ్యవధికి వడ్డీ రాయితీలేవీ వర్తించకుండా విధివిధానాల్లో చేర్చారు. ప్రస్తుత సీజన్(2013-14, అక్టోబర్-సెప్టెంబర్)లోనే మిల్లులకు ఈ రుణాలు లభిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement