Sugar mill
-
బియాస్ నదిలో భారీగా చేపల మృత్యువాత
-
బియాస్ నదిలో ఘోరం
ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్ : బియాస్ నదిలో జీవజాలం భారీగా మృత్యువాత పడింది. నీటి కాలుష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. గురుదాస్ పూర్ జిల్లాలోని కిరి అఫ్‌గనా గ్రామానికి చేరువలో గల చధా షుగర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడుదలైన రసాయనాలు బియాస్ నదిలో నీటిలో కలిశాయి. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం ప్రమాదవశాత్తు రసాయనాలు నీటిలో కలిశాయని పేర్కొంది. నది పరివాహక ప్రాంతంలో నివసించే వారు నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి షాక్‌కు గురయ్యారు. వేల సంఖ్యలో చేపలు, జలచరాలు మరణించి తేలుతూ ఒడ్డుకు కొట్టుకురావడాన్ని గమనించి అధికారులకు సమాచారం చేరవేశారు. ముఖ్యంగా అమృతసర్, తరణ్, కపుర్తలా జిల్లాల్లో జలచరాలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ తయారుచేసే బాయిలర్ పేలుడు వల్ల రసాయనాలు నది నీటిలో కలిసినట్లు అమృతసర్ డిప్యూటీ కమిషనర్ కమల్‌దీప్ సింగ్ సంఘా వెల్లడించారు. రసాయనాల కలయికతో నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మరణించాయని పేర్కొన్నారు. నదిలో కలుషితమైన నీటిని తొలగించేంతవరకూ ప్రజలు నీటిని వినియోగించొచ్చదని కోరారు. -
మహాజన సభలో తీవ్ర ఉద్రిక్తత
-
నిరాహారదీక్షలో విషాదం
సితాపూర్: 17 ఏళ్లుగా మూతపడి ఉన్న సుగర్ మిల్లును తెరిపించాలని జరుగుతున్న ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ మహోలీలో నిరాహారదీక్ష చేస్తున్న 40 ఏళ్ల మహిళా కార్మిక నేత రామ్రాఠి శుక్రవారం సాయంత్రం అసువులు బాశారు. ఒక వైపు ఎండలు, మరోవైపు నిరాహార దీక్ష ఆమె ఉసురు తీశాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది ఆందోళనకారులు ఈ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రామ్ రాఠి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. డీహైడ్రేషన్ కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వేడిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ఆమె చనిపోయిందనీ, ఆందోళన విరమించమని విజ్క్షప్తి చేసినా పట్టించుకోని ఆందోళనకారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ఊరటనిచ్చే విధంగా ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో (2014 అక్టోబర్-2015 సెప్టెంబర్) దాదాపు 14 లక్షల టన్నుల వరకూ ముడి చక్కెర ఎగుమతులకు సబ్సిడీనివ్వాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం టన్నుకు రూ. 4,000 చొప్పున ఎక్స్పోర్ట్ సబ్సిడీ లభిస్తుంది. క్రితం ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో నిర్ణయించిన రూ. 3,371 కన్నా ఇది అధికం. చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేక సతమతమవుతున్న మిల్లర్లకు తోడ్పాటునిచ్చే దిశగా దాదాపు 40 లక్షల టన్నుల ముడి చక్కెర ఎగుమతులపై గతేడాది ప్రభుత్వం సబ్సిడీనిచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి పొడిగించకపోవడంతో ఈ స్కీమును గతేడాది సెప్టెంబర్‌తో ముగిసింది. తాజాగా దీన్ని కొనసాగిస్తూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మిల్లర్లు రూ. 12,300 కోట్లు బకాయిపడ్డారు. -
ఏటికొప్పాక మద్దతు ధర రూ.2384
ఎస్.రాయవరం : ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లుకు రానున్న సీజన్‌కు టన్ను చెరకు ధర రూ. 2384.64లుగా యాజమాన్యం ప్రకటించింది. ఫ్యా క్టరీ ప్రాంగణంలో సోమవారం 82వ మహాజన సభ నిర్వహించారు. గతేడాది, రానున్న సీజన్లకు సంబంధించి క్రషింగ్, రికవరీ, లావాదేవీల నివేదికలను ఎమ్డీ కెఆర్ విక్టర్‌రాజు చదివి వినిపించారు. అనంతరం సభలో చైర్మర్ రాజాసాగి రాంభద్రరాజు మాట్లాడుతూ రానున్న సీజన్లో 2 లక్షల టన్నులు క్రషింగ్‌కు అవకాశం ఉందన్నారు. కాగా కొందరు రైతులు సభావేదిక వద్దకు దూసుకొచ్చి పంచదార బస్తాలు చోరీకి గురవుతంటే యాజమాన్యం ఏం చేస్తున్నదని నిలదీశారు. చోరీకి పాల్పడిన వారిపై కేసు ఎందుకు పెట్టలేదని దుయ్యబట్టారు. టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3200లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొందరు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపైకి వచ్చి వివరించారు. ఏటా సర్వసభ్య సమావేశాలప్పుడు ప్రకటిస్తున్న హామీలు ఏవీ నెరవేర్చడం లేదని వాపోయారు. దీంతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. చివరిగా గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతలకు ప్రోత్సాహాక భహుమతులు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
‘గోవాడ’ రైతులకు చేదు కబురు
మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం నిరసన వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు. అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు. మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు. ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులకు ప్రోత్సాహకాలు : మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు. ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు. -
చక్కెర మిల్లులకు చిక్కులు
కర్మాగారాలకు భారంగా మద్దతు ధర ప్రభుత్వ పెంపుదల కంటితుడుపే.. రికవరీ పడిపోయినవాటికి నష్టాల తాకిడి సహకార రంగానికి గడ్డుకాలం కమిటీలతో సరిపెట్టేస్తున్న సీఎం అనకాపల్లి: చెరకు రైతులకు మద్దతు ధర చెల్లింపు సహకార చక్కెర మిల్లులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తుంటే.. రికవరీ శాతం ప్రామాణికంగా కనీస మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఏడాదికేడాది రికవరీ శాతం పడిపోతున్న కర్మాగారాలకు ఇది ఆశనిపాతమవుతోంది. 2014-15 సీజన్‌కు సంబంధించి సహకార చక్కెర కర్మాగారాలు 9.5 రికవరీ శాతం ప్రామాణికంగా టన్నుకు రూ.2,200 మద్దతు ధర, రూ.60లు కొనుగోలు పన్ను చెల్లించాలి. రికవరీ శాతం బాగా ఉన్న కర్మాగారాలే మద్దతు ధరను ఇవ్వలేక కిందా మీద పడుతూంటే 9.5 శాతం కంటే తక్కువ నమోదయ్యే కర్మాగారాల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. ఇందుకు తుమ్మపాల మిల్లు పరిస్థితే తార్కాణం. గతేడాది ఈ మిల్లు7.9 శాతమే రికవరీ సాధించింది. 28 వేల టన్నుల చెరుకు గానుగాడగా, పంచదార దిగుబడి తీసికట్టుగా మారింది. నష్టాల బాటలో ఉన్న ఈ సుగర్స్ గత సీజన్ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. కేవలం టన్నుకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చి ఆర్థిక పరపతి కోసం ఎదురు చూస్తోంది. ఓవర్‌హాలింగ్ లేకుండా, నిధుల సర్దుబాటు కనిపించకుండా సతమతమవుతున్న ఈ మిల్లు యాజమాన్యం వచ్చే సీజన్‌కు టన్నుకు రూ.2260లు చెల్లించడం పెద్ద గుదిబండే. అలాగని రైతుకు టన్నుకు రూ.2260లు కూడా ఏ మాత్రం గిట్డుబాటు కాదని వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మిల్లుల్లో రికవరీ మెరుగుపడాలంటే ఆధునికీకరణ ఒక్కటే మార్గం. ఇందుకు నిధులివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిఫుణుల కమిటీ అంటూ ఈ అంశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహకార చక్కెర మిల్లుల ఆర్థిక స్థితిగతులు, భవితవ్యంపై కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికకు రెండు మూడు నెలలయినా పడుతుంది. ఆర్థిక పరిపుష్టి, రికవరీ శాతం ఆశాజనకంగా ఉన్న కర్మాగారాలు కమిటీ నివేదికతో పనిలేకుండానే క్రషింగ్ ప్రారంభించి రైతులకు మద్దతు ధర చెల్లించగలవు. కానీ తుమ్మపాల మిల్లులా అవస్థలు పడుతున్న చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమవుతుంది. ఇప్పటికే 2014-15 సీజన్ మాదిరి రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, కర్మాగారంలోని ఉద్యోగులకు జీతాలు బకాయిలు వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తుమ్మపాలకు మద్దతు ధర అంశం కష్టమవుతోంది. ఇక జిల్లాలోని ఏటికొప్పాక 10.2శాతం రికవరీతో వచ్చే సీజన్‌కు జిల్లాలోని అన్ని మిల్లుల కంటే అధికంగా రూ. 2380లు చెల్లించనుంది. తాండవ రూ.2350లు , తుమ్మపాల, గోవాడ కర్మాగారాలు రూ.2260లు చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక, గోవాడ మిల్లులు మద్దతు ధర చెల్లింపు విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేనప్పటికీ తుమ్మపాలను మాత్రం అన్నింటా సమస్యలతో అష్టదిగ్బంధనానికి గురవుతోంది. -
పాపం తుమ్మపాల
సీఎం ప్రకటనతో డోలాయమానంలో రైతులు వచ్చే సీజన్ క్రషింగ్‌పై నీలినీడలు మిల్లు భవితవ్యం సందిగ్ధం కాలం చెల్లిన యంత్రాలతో నెట్టుకొస్తున్న తుమ్మపాల చక్కెర మిల్లుపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయే పరిస్థితులు కానరావడం లేదు. రైతులు,ఉద్యోగులు, కార్మికులు, చివరకు రాజకీయనాయకులు దీనిని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఏడాదికేడాది తగ్గిపోతున్న రికవరీ, దయనీయంగా క్రషింగ్ సామర్థ్యం వెరశి మిల్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కర్మాగారాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు కూడా మూడు నెలల్లో కమిటీ నివేదిక అంటూ చెప్పి వెళ్లిపోవడంతో అన్ని వర్గాల్లో పరిస్థితి ఏమిటన్న వాదన వ్యక్తమవుతోంది. అనకాపల్లి: సహకార రంగంలోని తుమ్మపాల చక్కెరమిల్లు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఆధారపడి ఉన్న అన్ని వర్గాల్లోనూ కలవరం మొదలయింది. కర్మాగారం కష్టాల నుంచి తాత్కాలికంగా గట్టెక్కడానికి రూ.12 కోట్లు అవసరమని యాజమాన్యం ఇటీవల కర్మాగారాన్ని సందర్శించి సీఎం చంద్రబాబునాయుడుకు విన్నవించింది. మూడు నెలల కమిటీ నివేదిక మేరకు న్యాయం చేస్తామంటూ చెప్పి ఆయన వెళ్లిపోయారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు హయాంలోనే ఇది రెండేళ్లు మూతపడింది. మళ్లీ అధికారం చేపట్టిన చంద్రబాబు మిల్లు విషయంలో గతంలో చేసిన తప్పిదాలను సవరించుకుంటారని అంతా భావించినప్పటికీ ఊరటనిచ్చే ప్రకటన చేయలేదు. గతేడాదికి సంబంధించిన బకాయిలు టన్నుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామని ఇటీవల యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన మద్దతు ధర కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఫ్యాక్టరీ పరిధిలో13,400 మంది సభ్య రైతులు ఉన్నారు. మద్దతు ధర విషయంలో నమ్మకం లేని వీరంతా తుమ్మపాలకు చెరకు సరఫరాకు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదు. ఉద్యోగ విరమణ చేసినవారికి పీఎఫ్ వంటి బకాయిల చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది. ఇక వచ్చే సీజన్‌కు సమాయత్తం కావాలి. పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగాటకు రైతులు నవంబర్ నుంచి మిల్లుకు తరలిస్తుంటారు. అంటే ఈలోగా ఫ్యాక్టరీలో ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి మిషనరీని సిద్ధం చేయాలి. కాలం చెల్లిన మిషనరీ ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని దుస్థితి. రెండేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు వరదలు సృష్టించడంతో చెరకు పంటకు నష్టం వాటిల్లుతోంది. రికవరీ శాతం పడిపోతోంది. ఇన్ని సమస్యలతో మిల్లు యాజమాన్యం కొట్టుమిట్టాడుతుండగా.. సీఎం మూడు నెలల కమిటీ ఎప్పుడు వస్తుందో..? నివేదిక ఎలా ఉంటుందో? తదుపరి ప్రభుత్వం స్పందన ఏమిటో రైతులకు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న క్రషింగ్ సీజన్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవ ర్హాలింగ్ పనులకు నిధుల కొరత ప్రస్తుతం వేధిస్తుంది. సీఎం తన పర్యటనలో మిల్లు గురించి కొద్దిసేపు ఆరా తీసి తాత్కాలిక ఉపశమనం కోసం రూ.12కోట్లు సర్దుబాటు చేసి ఉంటే ఊపిరిపోసినట్టయ్యేది. మూడు నెలల కమిటీ ప్రకటన పుణ్యమా అని ఇప్పటికిప్పుడు కర్మాగారానికి నిధులు సర్దుబాటు అనుమానమే. నవంబర్ లోపు ప్రభుత్వ స్పందన వేగంగా లేకుంటే రానున్న సీజన్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రైతులకు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని కర్మాగారం వర్గాలు మదనపడుతున్నాయి. -
చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు
న్యూఢిల్లీ: చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు బ్యాం కుల నుంచి రూ.6,600 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చేందుకు ఓకే చెప్పిన సీసీఈఏ... వీటికి విధివిధానాలను కూడా గురువారంనాటి సమావేశంలో ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చక్కెర పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకలరుతో చెప్పారు. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తం రుణంపై రూ.2,750 కోట్ల వడ్డీ భారం పడుతుందని, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) నుంచి దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. నిధులను సక్రమంగా(రైతులకు చెల్లిం పులు) వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు వీలుగా ఈ రుణాలను ప్రత్యేక బ్యాంక్ ఖాతాద్వారా బ్యాంకులు మిల్లులకు ఇస్తాయి. నోడల్ బ్యాంక్ నియామకం, రుణ ప్రక్రియ నిర్వహణకు తగిన నిబంధనలను ఆర్థిక శాఖ జారీచేయనుందని థామస్ చెప్పారు. కాగా, ఐదేళ్ల వ్యవధిలో వడ్డీలేకుండా మిల్లులు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, తొలి రెండేళ్లు చెల్లింపులపై మారటోరియంను వినియోగించుకోవచ్చని కూడా అధికారిక ప్రకటన పేర్కొంది. అసలు చెల్లింపుల్లో డీఫాల్ట్గనుక అయితే, ఆ వ్యవధికి వడ్డీ రాయితీలేవీ వర్తించకుండా విధివిధానాల్లో చేర్చారు. ప్రస్తుత సీజన్(2013-14, అక్టోబర్-సెప్టెంబర్)లోనే మిల్లులకు ఈ రుణాలు లభిస్తాయి.