ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం | CCEA may take up sugar export subsidy issue today | Sakshi
Sakshi News home page

ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం

Published Fri, Feb 20 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం

ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ఊరటనిచ్చే విధంగా ప్రస్తుత మార్కెటింగ్ సీజన్‌లో (2014 అక్టోబర్-2015 సెప్టెంబర్) దాదాపు 14 లక్షల టన్నుల వరకూ ముడి చక్కెర ఎగుమతులకు సబ్సిడీనివ్వాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం టన్నుకు రూ. 4,000 చొప్పున ఎక్స్‌పోర్ట్ సబ్సిడీ లభిస్తుంది. క్రితం ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో నిర్ణయించిన రూ. 3,371 కన్నా ఇది అధికం.

చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేక సతమతమవుతున్న మిల్లర్లకు తోడ్పాటునిచ్చే దిశగా దాదాపు 40 లక్షల టన్నుల ముడి చక్కెర ఎగుమతులపై గతేడాది ప్రభుత్వం సబ్సిడీనిచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి పొడిగించకపోవడంతో ఈ స్కీమును గతేడాది సెప్టెంబర్‌తో ముగిసింది. తాజాగా దీన్ని కొనసాగిస్తూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మిల్లర్లు రూ. 12,300 కోట్లు బకాయిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement