న్యూఢిల్లీ: బ్రెజిలియన్ ఆయిల్ బ్లాక్‌లో అదనంగా 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం, బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (పీపీఆర్‌ఎల్) బ్రెజిల్‌లోని బీఎం–సీల్–11 కన్సెషన్ ప్రాజెక్ట్‌లో మరో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
ఈ బ్లాక్‌లో 2026–27లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ బ్లాక్‌లో బీపీఆర్‌ఎల్‌కు 40 శాతం వాటా ఉంది. బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్ 60 శాతం వాటాతో ఆపరేటర్‌గా ఉంది.
చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్‌లీ గురూ!
Comments
Please login to add a commentAdd a comment