Central Government Hiked The Minimum Support Price For Six Crops - Sakshi
Sakshi News home page

రైతులకు గుడ్‌న్యూస్‌.. 6 పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

Published Tue, Oct 18 2022 1:50 PM | Last Updated on Tue, Oct 18 2022 2:17 PM

The Government Hiked The Minimum Support Price For Six Crops - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

రబీ సీజన్‌ 2022-23(జూలై-జూన్‌), మార్కెటింగ్‌ సీజన్‌ 2023-24 కాలానికి గానూ ఎంఎస్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం.

పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. 
► మసూర్ పప్పుకు రూ.500
► గోధుమలకు రూ.100
► బార్లీ రూ.100, 
► శనగలు రూ.150
► సన్ ఫ్లవర్ రూ.209
ఆవాలు రూ.400 రూపాయలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement