rabi Crops
-
మద్దతు పెరగాల్సిన రంగం
రబీ పంటల పెంపు ధరలు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే కనీస మద్దతు ధరలో పెంపుదల, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి 14 శాతానికి మాత్రమే పెరిగింది. 86 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవలసి వస్తోంది. పైగా, కనీస మద్దతు ధరలో పెంపుదల ఇంకా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉంటోంది. అందుకే ధరలకు సంబంధించి వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. 2018లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఒక ఎపిసోడ్లో, నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక చిన్న రైతు తన దుఃస్థితి గురించి చెప్పినప్పుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తానే నమ్మలేక పోయారు. వ్యవసాయం ద్వారా ఎంత సంపాదిస్తున్నారని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆ రైతు, ‘‘సంవత్సరానికి రూ. 60,000 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. దానిలో సగం డబ్బు విత్తనాలు కొనడానికే పోతోంది. నేను నా కుటుంబానికి రాత్రి భోజనం మాత్రమే అందించగలుగుతున్నాను’’ అని బదులిచ్చారు. ఆ రైతు సమాధానం విని అమితాబ్ నివ్వెరపోయారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దేశ రైతులను ఆదుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అప్పటి నుండి గ్రామీణ మహారాష్ట్రలో నిరాశ మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 1,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ సగటున రోజుకు ఏడుగురు రైతులు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో యాభై శాతం పత్తి పండించే ప్రాంతంలోనే నమోదయ్యాయి. రైతులకు జాక్‌పాటేనా? శీతాకాలపు పంటల కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ల్లో ఇటీవలి పెంపుపై మీడియాలో వస్తున్న వార్తల్లోని ఉత్సాహం నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేసింది. ఇది రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఇది కష్టాల్లో ఉన్న రైతులకు ఏదైనా సహాయం అందజేస్తుందా అనేది ప్రశ్న. ధరల పెంపుదల పెరుగు తున్న నిరాశను ఆశాజనకంగా మార్చే అవకాశమైతే కనిపించడం లేదు. ముందుగా, ప్రకటించిన కనీస మద్దతు ధర పెరుగుదల పరిమాణాన్ని చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగా 2024 లోక్‌సభ ఎన్నికల సమయా నికి రబీ పంటల కోతలు జరగనున్నాయి. రబీ పంటల ధరల పెంపు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే, కనీస మద్దతు ధరలో పెంపుదల అనేది, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా, రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అంటూ చేస్తున్న వర్ణన వాస్తవానికి క్షేత్ర వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం పైనే ఆధారపడి ఉంది. ప్రతి పంట సీజన్లోనూ, ప్రభుత్వానికి ధరలను సిఫార్సు చేసే ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ (సీఏసీపీ– వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్)... ఉత్పత్తి ధరల సూచిలో వచ్చే మార్పుల శాతాన్ని, గణనలను కూడా అందజేస్తుంది. 2022–23తో పోలిస్తే, ఈ ఏడాది మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.9 శాతం పెరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండగా, కనీస మద్దతు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా లేదు. ఇది రైతులు హర్షించడానికి కారణం కాదు. ఒక సంవత్సరం క్రితం, ఇది మరింత దారుణంగా ఉండేది. మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.5 శాతం పెరుగుదలకు ప్రతిగా, గోధుమ కనీస మద్దతు ధర కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. యాదృచ్ఛికంగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ. 150 పెరగడంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,275కి చేరుకుంది. 2006–07, 2007–08 తర్వాత, దేశీయ ఉత్పత్తిదారులకు ధరలను పెంచడం మినహా యూపీఏ ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిన తర్వాత, ఇది గోధుమ ధరలో అత్యధిక పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల సంవత్సరాల్లోనే! రైతుల నుండి నేరుగా గోధుమలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలనే లోపభూయిష్ట నిర్ణయం జరిగిన తర్వాత, ఇది ప్రభుత్వ నిల్వల్లో భారీ అంతరానికి కారణ మైంది. ఆ కొరతను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రెట్టింపు ధరలకు (స్వదేశీ రైతులకు ఇచ్చే) గోధుమలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుండి వచ్చిన విమర్శల తరువాత, ముఖ్యంగా ధర సమానత్వం తీసుకురావడానికి, గోధుమ లకు కనీస మద్దతు ధరను పెంచారు. ఈ ఏడాది ధరలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లోని ప్రధాన రబీ పంటలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసు కుంటే, ధరల పెరుగుదల ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. గోధుమలు అత్యంత ముఖ్యమైన రబీ పంట. బార్లీ(యవలు), పెసర, రేప్‌సీడ్–ఆవాలు, పప్పు (మసూర్)... ఇతర శీతాకాలపు పంటలు కావడంతో, ధరల పెరుగుదల కచ్చితంగా రాజకీయ కోణాన్ని కలిగి ఉంది. ఆర్థికవేత్తలు సుఖ్‌పాల్ సింగ్, శ్రుతి భోగల్ 2004, 2009, 2014, 2019కి ముందు సంవత్సరాల్లో గోధుమలు, వరి కనీస మద్దతు ధర ఎంత ఎక్కువగా ఉందనే అంశాన్ని 2021 జనవరిలో స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు. 2023–24 రబీ ధరల పెంపు కూడా ఇదే తరహాలో ఉంది. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులకు సాపేక్షంగా అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించారు. దీనివల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాలను పొందివుండొచ్చు. కానీ భవిష్యత్తులో పంటల ధరలను రాజకీయాలు నిర్ణయించకుండా దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది. స్వామినాథన్ ఫార్ములా అమలు కావాలి వ్యవసాయం దానధర్మం కాదు. పంటల ధరలను రాజకీయ నాయకత్వం ఇష్టారాజ్యానికి వదిలేయలేం. వ్యవసాయానికి నిర్మా ణాత్మక సంస్కరణలు అవసరం. ఎన్నికలు జరిగిన సంవత్సరంతో నిమిత్తం లేకుండా, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం, ‘వెయిటెడ్ యావరేజ్’కు 50 శాతం లాభం కలిపి రూపొందించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందేలా ఈ సంస్కరణలు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి దాదాపు 14 శాతానికి మాత్రమే పెరిగింది. దీనివల్ల అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, కనీస మద్దతు ధర పెంపు ఇంకా చాలావరకూ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంది. మార్కెట్లు మిగిలిన 86 శాతం మంది రైతులకు నష్టాలతో కూడిన ధరలు చెల్లించడం వల్ల వ్యవసాయ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. రుణభారం, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. అంతేకాకుండా, రైతులకు సరైన ఆదాయాన్ని శాశ్వతంగా నిరాక రించిన స్థూల ఆర్థిక విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ లేదా మైనస్ 2 శాతం) బ్రాకెట్లో ఉంచడం వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వినియోగదారుల ధరల సూచిక బుట్టలో ఆహారం, పానీయాల వాటా 45.9 శాతం ఉన్న ప్పటికీ, విధాన రూపకర్తలు అతిపెద్ద ద్రవ్యోల్బణ చోదకశక్తిగా ఉన్న గృహనిర్మాణంపై మాత్రం కళ్ళు మూసుకున్నారు. గృహనిర్మాణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తుండగా, కనీస మద్దతు ధరలో ఏదైనా పెంపు దలను మాత్రం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని నిందిస్తుంటారు. ఇది మారాల్సి ఉంది. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ముగిసిన రబీ ఉత్పత్తుల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్లోను మార్కెట్లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి. సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. 564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు. శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది. -
రైతులకు గుడ్‌న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి డెల్టా ఆధునికీ కరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిర్వహించేలా సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11 నియోజకవర్గాల్లో రూ.163.06 కోట్లతో 95 పనుల కోసం సాంకేతికపరమైన అనుమతులు పొందారు. వచ్చే ఏడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. వీటిలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు, స్లూయిజ్ గేట్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఉన్నాయి. 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి జలాలతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా రబీ సీజన్ ప్రారంభంలో వీటికి వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాలో సీజన్ ప్రారంభానికి ముందే రూ.22.54 కోట్లతో 180 పనులను ప్రతిపాదించగా 121 పనులకు టెండర్ల ఖరారై వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన గోదావరి డెల్టాలో కీలక పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి సాంకేతికపరమైన, పరిపాలనా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది నెలల్లో టెండర్ల దశకు పనులు చేరుకోనున్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్ డ్రెయిన్లలో మరమ్మత్తులు, కొన్నిచోట్ల రిటైనింగ్‌వాల్ నిర్మాణాలు, స్లూయిజ్ గేట్ల మరమ్మత్తులు, ఎర్త్ వర్క్స్‌తో పాటు పూడికతీత పనులు ఉన్నాయి. పశ్చిమగోదావరిలో.. ఆచంట నియోజకవర్గంలో రూ.3.68 కోట్లతో 5 పనులు నరసాపురం నియోజకవర్గంలో రూ.28.22 కోట్లతో 2 పనులు పాలకొల్లు నియోజకవర్గంలో రూ.19.01 కోట్లతో 5 పనులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూ.6.41 కోట్లతో 21 పనులు ఉండి నియోజకవర్గంలో రూ.38.25 కోట్లతో 18 పనులు తణుకు నియోజకవర్గంలో రూ.7.49 కోట్లతో 12 పనులు భీమవరం నియోకవర్గంలో రూ.30.14 కోట్లతో 13 పనులు ఏలూరు జిల్లాలో.. దెందులూరు నియోజకవర్గంలో రూ.14.40 కోట్లతో ఒక పని ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.8.35 కోట్లతో 3 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. గోపాలపురం నియోజకవర్గంలో రూ.4.71 కోట్లతో 11 పనులు నిడదవోలు నియోజకవర్గంలో రూ.2.37 కోట్లతో 4 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మొండికోడు మేజర్ డ్రెయిన్‌కు 2.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం, భీమవరంలో పశ్చిమ డెల్టా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు, తణుకులో ఎర్రకోడు మీడియం డ్రెయిన్, ఉండిలో కోరుకొల్లు మైనర్ డ్రెయిన్, ఇతర మరమ్మతులు ఇలా 95 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో పాలకొల్లులో రూ.8.10 కోట్ల వ్యయంతో నక్కల మేజర్ డ్రెయిన్‌పై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. -
రైతులకు రూ.700 కోట్లు జమ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం తెలిపారు. ఈ సీజన్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. -
అన్నదాతకు ఆలంబన
సాక్షి, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్‌లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది. 2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అర్హత పొందాలంటే.. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్‌ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల ఆయకట్టు పంటలతో కళకళలాడుతోంది. ఖరీఫ్ కోతలు పూర్తయినా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో రబీ పంటలకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. సమృద్ధిగా నీరు వస్తుండటంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాలు, ఏపీఎస్సైడీసీ పరిధిలోని ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు ఉండగా, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార, ఏలేరు తదితర నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో ఎన్నడూ నీటి చుక్క చేరని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. వాటి కింద ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు ఆనందంతో ఉన్నారు. అప్పర్ పెన్నార్ నుంచి మడ్డువలస దాకా వర్షాఛాయ ప్రాంతం అనంతపురం జిల్లాలో పెన్నా బేసిన్‌లోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దశాబ్దాల తర్వాత నిండింది. దేశంలో అత్యల్ఫ వర్షపాతం నమోదయ్యే వేదవతి (హగరి) దశాబ్దాల తర్వాత ఉరకలెత్తడంతో ఎన్నడూ నిండని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కూడా నిండింది. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నది ఉప్పొంగడంతో మడ్డువలస ప్రాజెక్టు ఈ ఏడాది రెండుసార్లు నిండింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు అన్ని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇప్పటి వరకు ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు కూడా నీరందని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు.. ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరందుకుంటోంది. ఏమాత్రం వృథా కాకుండా యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకూ నీళ్లందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో జల సిరులు
సాక్షి, అమరావతి: ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నదుల్లో వరద ప్రవాహం, సహజ సిద్ధ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఖరీఫ్ పూర్తయింది. రబీలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ దశలో సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) దేశంలో తన పర్యవేక్షణలోని 128 జలాశయాల్లో నీటి నిల్వలపై అధ్యయనం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల్లోని నీటి నిల్వలు గత పదేళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► దేశ వ్యాప్తంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని 128 జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9,104.38 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 3,716.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 4,116.42 టీఎంసీలు ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 3,021.99 టీఎంసీలు నిల్వ ఉండేవి. ► దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,864.94 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 1,169.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదేరోజు వీటిలో 1,133.23 టీఎంసీలు నిల్వ ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 787.5 టీఎంసీల నిల్వ ఉండేవి. అంటే.. గత పదేళ్ల సగటు నీటి నిల్వ కంటే ఈ ఏడాది 50 శాతం అధికంగా నిల్వ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ► ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ.. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనూ.. పెన్నా బేసిన్లో సోమశిల, కండలేరు, ఇతర బేసిన్లలో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు గతేడాది కంటే అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. ► ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రబీ పంటల సాగుకు.. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. -
రబీ పంటల ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుల ద్వారా ఎంఎస్పీ వ్యవస్థను దశలవారీగా తొలగించాలనుకుంటోందన్న రైతుల ఆందోళనకు తాజా చర్య ద్వారా ప్రభుత్వం సమాధానమిచ్చింది. గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది. 2020–21 పంట సంవత్సరానికి(జూన్–జూలై), 2021–22 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు తెలిపారు. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్పీగా అందించామన్నారు. -
మిల్లు ఆగలేదు
సాక్షి, అమరావతి: రబీ పంట చేతికొచ్చే సమయంలోనే కరోనా ముంచుకొచ్చింది. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ ప్రకటించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని రైస్ మిల్లులు పూర్తిస్థాయిలో పనిచేశాయి. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లులను అత్యవసర సేవలు పరిధిలోకి తీసుకు రావడంతో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలిగాయి. లాక్డౌన్ ప్రకటించిన తొలి 10 రోజుల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు, తహసీల్దార్లు రైస్ మిల్లులు పని చేయడానికి వీలుగా సిబ్బంది, కార్మికుల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతోపాటు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసింది. వైఎస్ తర్వాత జగనే.. గతంలో రైస్ మిల్లులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకోగా.. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రంగాన్ని ఆదుకున్నారని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ హయాంలో రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ విద్యుత్ పరిమితిని 100 హెచ్‌పీకి పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏప్రిల్ నుంచి ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచారు. లాక్డౌన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం చిన్న రైస్ మిల్లులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇదే సమయంలో మూడు నెలల పాటు మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో అనేక మిల్లులు లబ్ధి పొందాయి. ఒక్కొక్క మిల్లుకు కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనం కలిగింది. బియ్యం రీసైక్లింగ్‌కు చెక్ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులపై అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో రేషన్ బియ్యం మిల్లులకు వచ్చేవి. వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లోకి వెళ్లేవి. ప్రభుత్వ చర్యలతో రీసైక్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 మిల్లుల్లో సార్టెక్స్ మెషిన్లు ఉన్నాయి. ఒక్కో మెషిన్ ఏర్పాటుకు రూ.60 లక్షల వరకు అవుతుందని అంచనా. ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచడం, ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు ఇస్తుండటంతో చాలా మంది మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతికేళ్ల డిమాండ్ నెరవేరింది రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచాలని 25 ఏళ్లుగా కోరుతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 100 హెచ్‌పీకి తీసుకెళితే.. ఆయన తనయుడు సీఎం జగన్ 150 హెచ్‌పీకి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద రుణాలకు గ్యారెంటీ ఇస్తుండటంతో బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించాయి. – గుమ్మడి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇబ్బందుల్లేకుండా చేశారు లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పూర్తిస్థాయిలో 14 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో 350 మిల్లులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. – అంబటి రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ధరే ఎక్కువగా ఉంది లాక్డౌన్ సమయంలో ప్రారంభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు చిన్నపాటి ఇబ్బందులొచ్చినా ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కృష్ణా జిల్లాలో 250 వరకు మిల్లులు ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే ధర కంటే ప్రభుత్వం కొనుగోలు ధరే ఎక్కువగా ఉంది. అందుకని మొత్తం బియ్యాన్ని ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నాం. – పి.వీరయ్య, పిన్నమనేని వీరయ్య అండ్ కంపెనీ -
కరోనా నుంచి రబీ గట్టెక్కినట్టే..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మునుపెన్నడూ లేని రీతిన జిల్లాలో రబీ పంట పండింది. రాష్ట్రానికి ధాన్యాగారంగా నిలిచే జిల్లా ఈ రబీలో సిరులు కురిపించేందుకు సిద్ధమైంది. పంటకోత ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందనే అంచనాలు రైతుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. వారం రోజుల్లో జిల్లా అంతటా రబీ వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో కరోనా నిబంధనలు రబీ మాసూళ్లకు ప్రతిబంధకంగా మారతాయని రైతులు భయపడ్డారు. నలుగురైదుగురు కలిసి తిరిగితేనే అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక వరి మాసూళ్లకు కూలీలను ఎలా అనుమతిస్తారని వారం రోజులుగా జిల్లాలోని రైతులు సందిగ్ధంలో పడ్డారు. కరోనా వైరస్ అన్ని రంగాలనూ వణికిస్తున్నట్టే వ్యవసాయ రంగాన్ని కూడా భయపెట్టింది. ఏప్రిల్ మొదటి వారం వచ్చేయడంతో ఈసరికే జిల్లాలో 20 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 80 శాతం పంట కోతలకు కరోనా లాక్డౌన్ ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వలస కూలీలు, పొరుగు రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాల రాకకు ప్రతిబంధకాలుంటాయని భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని వ్యవసాయం, అనుబంధ రంగాలకు నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. కరోనాతో రైతుకు ఎటువంటి నష్టం జరగకూడదనే ముందుచూపుతో రబీ మాసూళ్లకు పూర్తి భరోసా నింపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక ఆదేశాలుజారీ చేశారు. ప్రభుత్వం, ప్రకృతి సహకరించడంతో... ఈ రబీలో జిల్లాలో నాలుగన్నర లక్షల‡ ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రభుత్వం సకాలంలో నీరు విడుదల చేసింది. దీంతోపాటు ప్రకృతి కలిసొచ్చి, అధిక దిగుబడులకు అవకాశంగా ఉంది. మొత్తం 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. గత రబీలో 14.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లాలో గత రబీ కంటే ఈ రబీలో 6 వేల ఎకరాల్లో అదనంగా సాగు జరిగింది. 50కి పైగా పంట ప్రయోగాలు జరిగాయి. వీటిలో ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏటా రబీ వరి కోతలు దాదాపు నెల రోజుల వ్యవధిలో పూర్తవుతూంటాయి. స్థానిక కూలీలతో నెల రోజుల్లో కోతలు పూర్తి చేయడం అసాధ్యం. దీంతో ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి 4 వేల మంది కూలీలు ఇక్కడకు వస్తూంటారు. రెండు నుంచి నాలుగు వారాలు రైతు కమతాల్లోనే మకాం ఉండి వంతుల వారీగా కోతలు పూర్తి చేసి, వేతనాలుగా డబ్బు లేదా ధాన్యం తీసుకు వెళ్తూంటారు. గోదావరి పరీవాహక లంకల్లో వరి సాగు లేకపోవడంతో అక్కడి నుంచి సుమారు 2 వేల మంది కూలీలు వలస వచ్చి కోతలు చేస్తారు. పూర్తిగా వరిపై ఆధారపడిన సుమారు 3 లక్షల మంది రైతులు కోతలకు సిద్ధపడుతున్నారు. లక్షలాది కూలీలతో ముడిపడి ఉన్న వరి కోతలను లాక్డౌన్ కారణంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక హైరానా పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వలస కూలీల రాకకు ఢోకా లేదు సాధారణంగా ఎకరా వరి పంటను 12 నుంచి 13 మంది కూలీలు ఒక్క రోజులో కోత కోస్తారు. ఈ లెక్కన జిల్లాలో వరి కోతలు పూర్తి కావాలంటే 54 లక్షల మంది రోజు కూలీలు అవసరం. వలస కూలీలతో రైతులు వంతుల వారీగా కోతలు పూర్తి చేయించుకుంటారు. వలస కూలీల రాకకు కరోనా ఆంక్షలు అడ్డంకిగా లేకుండా వరి కోతలకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులకు భారీ ఉపశమనం లభించింది. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి కూలీలు, వరి కోత యంత్రాలకు జిల్లా అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. వరి కోతల్లో భౌతిక దూరం సాధ్యమే.. కూలీలు వరి కోతలు సామూహికంగా కోయాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన భౌతిక దూరం నిబంధన వరి కోతలకు ఏమాత్రం అవరోధం కాదు. ఎకరాకు 13 మంది వరకూ కూలీలు దాదాపు మీటరు దూరంలో ఉండే కోత కోస్తారు. ఎప్పుడూ ఉండే ఈ సంప్రదాయ విధానంతో భౌతిక దూరం సమస్య ఎదురు కాదని అంటున్నారు. వారందరూ కలిసి రావడం, కలిసి వెళ్లడం, ఒకచోట గుమిగూడటం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు జిల్లాలో 50 శాతం రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో కూలీలతోనే కోతలు కోయిస్తున్నారు. మిగిలిన వారు యాంత్రీకరణ వైపు మళ్లారు. కోతల సీజన్లో మన జిల్లాకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలు వస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కోత యంత్రాలు వచ్చే అవకాశం ఉంటాయో లేవోననే సందిగ్ధతకు జిల్లా యంత్రాంగం తెరదించింది. జిల్లాలో కోతలకు 750 వరికోత యంత్రాలు అవసరమవుతాయి. ఇవి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రప్పిస్తున్నారు. వరికోత యంత్రానికి హెక్టార్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ చార్జి చేస్తారు. ఎక్కువ అందుబాటులో ఉంటే ఈ ధర తగ్గుతుందనే ఆలోచనతో అధికంగా యంత్రాలను తీసుకువచ్చే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉంది. కరోనాతో ఆందోళన మూడు నెలల పాటు రబీ పంట జాగ్రత్తగా పండించుకున్నాం. ప్రకృతి కరుణించింది. ప్రభుత్వం కూడా పూర్తిగా నీటిని సరఫరా చేసింది. పంట చేతి కొచ్చేసింది. కోతలకు ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో కరోనా దాపురించింది. ప్రతి కోతల సీజన్లో మా ఊరికి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కోనసీమలోని లంక గ్రామాల నుంచి కూలీలు వలస వచ్చి ఇక్కడే ఉండేవాళ్లు. – సత్తి సత్తిబాబు,సవరప్పాలెం కనీస మద్దతుధర లభించేలా చర్యలు రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తాం. వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు తమ పంట వివవరాలను సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద నమోదు చేయించుకోవాలి.– కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోతలు పూర్తయ్యే వరకూ అంతా అందుబాటులో.. జిల్లాలోని అందరు సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు వంద శాతం అందుబాటులో ఉండాలి. వరికోత యంత్రాలు, ధాన్యం రవాణా వాహనాలు, పురుగు మందుల రవాణా వాహనాలను అనుమతించాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు మీమీ మండలాల్లో అందుబాటులో ఉంటారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో ఇబ్బందులుంటే జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 1800 425 3077కు వెంటనే తెలియజేయాలి. మా కార్యాలయంలోని కాల్ సెంటర్లో జోగిరాజు, అశోక్ అందుబాటులో ఉంటారు.– కేఎస్వీ ప్రసాద్, జాయింట్ డైరెక్టర్,వ్యవసాయ శాఖ, కాకినాడ -
60 దేశాలకు మిడతల బెడద
మిడతల దండు దాడి చేసిందంటే ఆ పంట పొలం పని నిమిషాల్లో అయిపోయినట్టే. మిడతల దండు పంటలపై విరుచుకు పడుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎడారులకు దగ్గరగా ఉన్న రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పంటలకు మిడతల బెడద ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ మిడతల దండు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పంటలను నాశనం చేసింది. లక్షలాది మిడతలు ఒక్కుదుటన ముఖ్యంగా మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేసింది. నిమిషాల్లోనే కంకులు, ఆకులను నమిలేశాయి. కొన్ని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పురుగుమందులు పిచికారీ చేసే సమయం కూడా లేకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా, ఉత్తర గుజరాత్, రాజస్థాన్‌లో కనీసం 9 వేల హెక్టార్లలో రబీ పంటలను మిడతల దండు నమిలేసినట్లు అధికారులు తేల్చారు. గోధుమ, ఆవ, ఆముదం, జీలకర్ర తదితర పంటలు సాగు చేసే రైతులకు రూ. 5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. మూడింట ఒక వంతు కన్నా ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 7 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. మిడతల దండు బెడద ఉన్నది భారత దేశానికి మాత్రమే కాదు. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో 60 దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండే ఎడారి ప్రాంతాల్లో ఈ మిడతల దండు సంతతిని పెంపొందించుకుంటూ దగ్గర్లోని దేశాల్లో పంటలను ఆశిస్తూ ఉంటాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మిడతలు విజృంభిస్తూ గాలులతో పాటు అతి తక్కువ సమయంలోనే దూరప్రాంతాలకు పయనిస్తూ ఉంటాయి. మిడతల దండు గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు సరిహద్దులు దాటి పయనిస్తుంది. మిడతల దండు మెరుపు దాడులను పురుగుమందులతోనే కొంతమేరకు ఎదుర్కోగలమని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఏయే దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ యే నెలల్లో ఏయే దేశాల్లో మిడతలు విజృంభిస్తాయి? అనే సమాచారంతో కూడిన ముందస్తు హెచ్చరికలను ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రతి నెలా విడుదల చేస్తూ ఉంటుంది. మిడతల దండు బెడదపై పాకిస్తాన్, భారత్ ప్రభుత్వాలను ఎఫ్.ఎ.ఓ. గత డిసెంబర్ మూడో వారంలో అప్రమత్తం చేసింది. మిడతల దండు వల్ల మనుషులకు, పశువులకు హాని లేదు. -
రబీకి సాగర్ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్‌లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్‌లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు. 20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా.. సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు. -
ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ జలకళను సంతరించుకోవడంతో గరిష్టంగా అరకోటి ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి చేసిన, పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కిందే 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చే అవకాశముండగా, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిన సాగు జరగనుంది. సాగర్ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు.. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ప్రాజె క్టులో నీటి నిల్వలు 315 టీఎంసీల మేర ఉన్నాయి. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలున్నాయి. తాగునీటి అవసరాలకు మరో 25 టీఎంసీల వరకు అవసరముంటుంది. తాగునీటికి పక్కనపెట్టినా, మరో 50 టీఎంసీల మేర తెలంగాణకు వాటా దక్కే అవకాశం ఉన్నందున పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్వకుర్తి కింద కనిష్టంగా 3 లక్షల ఎకరాలు.. ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశముంది. కల్వకుర్తికి కనిష్టంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 25 టీఎంసీల మేర నీటి కేటాయింపులు చేయనున్నారు. జూరాలపై లక్ష ఎకరాలు, దానిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాల పరిధిలో చెరో రెండు లక్షల ఎకరాల మేర కలిపి 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 600లకు పైగా చెరువులు నింపారు. వీటికింద కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం ఉంది. 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వఉన్న 90 టీఎంసీలతో పాటు లోయర్‌మానేరు డ్యామ్ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చెరువులు నింపే కార్యక్రమం జరుగుతోంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా చెరువులు నింపుతూ నీరు వదులుతున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలు దేవాదుల కింద ఇప్పటికే 7 టీఎంసీల గోదావరి నీటితో 300 చెరువులకు నీరివ్వడంతో పాటు ఆయకట్టుకు నీరిస్తున్నారు. యాసంగిలోనూ మరో 12 నుంచి 13 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటే ఏఎంఆర్పీ, కాళేశ్వరం నదీ జలాలను ఎత్తిపోసే పరిమాణాన్ని బట్టి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి రానుంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. వీటిద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆస్కారముంది. చెరువుల కిందా జోరుగానే.. ఈ ఏడాది చెరువుల కింద గరిష్ట సాగుకు అవకాశముంది. ఇప్పటికే 43 వేలకు పైగా ఉన్న చెరువుల్లో 22 వేల చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మొత్తం చెరువుల్లో 17 వేల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 4,700 చెరువులు 75 శాతం వరకు నీటితో ఉన్నాయి. వీటితో పాటే సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని తరలించేలా 3 వేల తూముల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే వెయ్యికి పైగా పూర్తయ్యాయి. ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తి స్థాయిలో నింపే అవకాశముంది. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, 14 లక్షలకు తగ్గకుండా సాగు జరిగే అవకాశముంది. ఇక ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, ఇందులో ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. మొత్తంగా చిన్న నీటి వనరుల కిందే 16 లక్షల ఎకరాల మేర సాగుకు ఈ ఏడాది నీరు అందే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. 2.52 లక్షల ఎకరాల్లో రబీ సాగు సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సీజన్ సాగు లక్ష్యం, ఇప్పటివరకు ఎంత సాగైందన్న వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు నివేదించింది. దాని ప్రకారం రబీ సాధా రణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో (8%) సాగైంది. అందులో అత్యధికంగా వేరుశనగ సాగైంది. వేరుశనగ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1.67 లక్షల (51%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు లక్ష్యం 2.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52,500 ఎకరాల్లో (18%) సాగయ్యాయి. అందులో కేవలం శనగ పంట సాగైంది. ఇక రబీలో కీలకమైన వరి సాధారణ సాగు 17.07 లక్షల ఎకరాలు కాగా, నాట్లు మొదలు కావాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురవడం, రిజర్వాయర్లు, చెరువులు నిండిపోవడంతో లక్ష్యానికిమించి వరి నాట్లు పడతాయని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక మొక్కజొన్న రబీ సాధారణ సాగు లక్ష్యం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 ఎకరాల్లో (2%) మాత్రమే సాగైంది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నాగర్‌కర్నూలు జిల్లాలో 64% విస్తీర్ణంలో రబీ పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా లో 53% సాగయ్యాయి. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలోనూ పంటల సాగు మొదలుకాలేదని నివేదిక తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికం ఈ ఏడాది వర్షాలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి ఆలస్యంగా మొదలైనా, ఆగస్టు నుంచి పుంజుకోవడంతో ఇప్పటివరకు అధిక వర్షాలే కురుస్తున్నాయి. జూన్‌లో 33 శాతం లోటు కనపడింది. జూలైలో 12 శాతం లోటున్నా సాధారణ వర్షపాతంగానే రికార్డయింది. ఇక ఆగస్టులో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏకంగా 92 శాతం అధికంగా కురవడం విశేషం. ఆ తర్వాత రబీ మొదలైన అక్టోబర్ నెలలోనూ ఏకంగా 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం ఇక పంట రుణాలపై బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. గత ఖరీఫ్‌లో 102 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి ఏకంగా 131 శాతం సాగైంది. గత ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇచ్చింది రూ.16,820 కోట్లే. ఇక రబీ సీజన్ ప్రారంభమైనా రుణాలు అత్యంత తక్కువగానే ఇచ్చాయి. రబీ పంట రుణ లక్ష్యం రూ.17,950 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచి్చనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పెద్ద ఎత్తున వరి నాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఆదుకోకుంటే రైతులకు అప్పులు మాత్రమే మిగులుతాయని అంటున్నారు. -
‘రబీ’కి కేంద్రం మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను పెంచింది. 2020–21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్లో ఇది రూ.1,440గా ఉండేది. శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది. మసూర్ (కేసరి) పప్పు క్వింటాల్ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది. ఆవాలు క్వింటాలు ధర గత సీజన్లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్లో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది. కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది. చైనా సరిహద్దుకు కొత్త సైనికులు ! దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇండో–టిబెటన్ బార్డర్ పోలీసు కేడర్‌ను కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఈ సమీక్షలో పలువురికి పదోన్నతులు దక్కనున్నాయి. దీంతో పాటు గ్రూప్ ఏ సాధారణ విధుల కేడర్, నాన్ జనరల్ విధుల విభాగంలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐటీబీపీ 58వ రైజింగ్ డే సందర్భంగా ఈ సమీక్ష చేపట్టారు. గతంలో చివరగా 2001లో సమీక్ష చేపట్టారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. కొత్త ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో 50 లక్షల మందికి లబ్ధి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుం దని జవదేకర్ చెప్పారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. -
రబీ, ఖరీఫ్ కు రూ.3,975.85 కోట్లు
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం) : 2019 – 20 ఆర్థిక సంవత్సర జిల్లా రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా లీడ్‌బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించి మొత్తం రూ.3,975.85 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్‌కు సంబంధించి పంట రుణాలు రూ.1,999.42 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో రూ.252.24 కోట్ల రుణాలు రెన్యువల్ చేసినవి ఉన్నాయి. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 888 గ్రామాల్లో మొత్తం 1,19,115 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వీటిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 3,11,627.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి రూ.1,999.42 కోట్లు రుణాలు ఇవ్వనుండగా, వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.185.85 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం ప్రణాళికలో ఇది 4.67 శాతం. వీటితో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.899.91 కోట్ల మేర రుణాలు ఇవ్వనున్నారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.3,085.18 కోట్లు ఇచ్చేలా ప్రణాళికలో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి మొత్తం రుణాల్లో రూ.77.59 శాతంగా ఉన్నాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి రూ.63.51 కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.95.26 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.158.77 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా విద్యాశాఖకు రూ.153 కోట్లు, గృహరుణాలకు రూ.363.82 కోట్లు, రెన్యువబుల్ ఎనర్జీకి 18.27 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 13.03 కోట్లు ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. గత వార్షిక ప్రణాళికలో ఇచ్చింది 55.65 శాతమే... 2018–19 సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం నిర్ధేశించుకున్న వార్షి్క రుణ ప్రణాళిక లక్ష్యంలో 55.65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.3,656.43 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం కాగా, అందులో ఇచ్చింది రూ.1,999.06 కోట్లు మాత్రమే. వీటిలో ఖరీఫ్, రబీకి కలిపి పంట రుణాల లక్ష్యం రూ.1,852.53 కోట్లు కాగా, ఇందులో రూ.922.15 కోట్లు మాత్రమే ఇచ్చారు. నిర్ధేశిత లక్ష్యంలో 49.77 శాతం మాత్రమే జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చాయి. ఇక గత సీజన్లో ప్రభుత్వ రంగం బ్యాంకులు మాత్రమే కొంతమేరకు నయం అనిపించాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల లక్ష్యం రూ.1,922.37 కోట్లు కాగా, ఇందులో రూ.1,213.80 కోట్లు రుణాలు ఇచ్చాయి. నిర్ధేశిత లక్ష్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 63.14 శాతం సాధించాయి. వీటిలో ఒక్క ఎస్బీఐ మాత్రం 71.08 శాతం ఇచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం 27.07 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం వాణిజ్య బ్యాంకులన్నీ (పబ్లిక్, ప్రైవేట్) కలిసి 59.16 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ఏపీజీవీబీ, డీసీసీబీ, భద్రాద్రి కో ఆపరేటివ్ బ్యాంకులన్నీ కలిసి 48.18 శాతం లక్ష్యాన్ని సాధించాయి. గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు 2018 – 19 సీజన్లో వివిధ రకాల కారణాలతో నిర్ధేశించుకున్న పంట రుణాల లక్ష్యాన్ని సాధించలేదు. గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా రుణమాఫీ ఆశ ఉండడంతో, ఈ రుణాలు వస్తే రుణమాఫీ వర్తించదనే అపోహతో రైతులు రుణాలు క్లియర్ చేయలేదు. ఇక చాలామంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మ్యాన్యువల్ పట్టాలకు రుణాలు ఇవ్వలేదు. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు రుణాలు అందుతాయి. – పుల్లారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ -
కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిన పైర్లు, బీడు భూములే. తినడానికి మేత దొరక్క బక్కచిక్కిన పశువులు.. మైళ్ల దూరం నుంచి బిందెల్లో నీరు మోసుకెళుతున్న మహిళలు... వ్యవసాయం సాగక, పనుల్లేక పొట్ట చేతపెట్టుకుని బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన రైతన్నలు, వ్యవసాయ కూలీలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడా చూసినా ఇలాంటి దయనీయ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జూన్–సెప్టెంబరు మధ్య ఖరీఫ్ సీజన్లోనే కరువు తీవ్రత కనిపిస్తుంది. ఈ ఏడాది రబీ సీజన్లోనూ దుర్భిక్షం తాండవిస్తుం డడం గమనార్హం. సాధారణంగా వేసవిలో నీటికోసం రైతులు బోర్లు వేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాకపోయినా నీటి దొరక్కపోవడంతో పంటలను, తోటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గతేడాది డిసెంబరు 27వ తేదీన రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 35.62 అడుగులు కాగా, ప్రస్తుతం 42.12 అడుగులకు పడిపోయింది. రబీ ఆశలూ అడియాసలు ఖరీఫ్‌లో కరువు కాటు వల్ల పంటలు పోగొట్టుకుని అప్పులపాలైన రైతులు రబీలోనైనా ఎంతో కొంత పంటలు పండుతాయని ఆశపడ్డారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేశారు. అక్టోబరులో పంటలు విత్తిన తర్వాత వర్షాలు పడలేదు. తుపాన్ల సీజన్‌గా పేరొందిన రబీలోనూ ఏకంగా12 జిల్లాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరు ముగుస్తున్నా నీటి తడి లేక రబీలోనూ పంటలన్నీ మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లోనూ, ప్రస్తుత రబీలోనూ వేరుశనగ కంది, పత్తి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఉల్లి పైర్లు పొలాల్లోనే మలమలా మాడిపోయాయి. పెట్టుబడులు మట్టిపాలయ్యాయి.రైతన్నలపై అప్పుల భారం పెరిగింది. పైర్లు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వాడిపోయిన పంటలను దున్నేస్తున్నారు. కబేళాలకు తరలుతున్న పశువులునాలుగేళ్లుగా వరుస కరువులతో చితికిపోయిన అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఈ రబీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పశుగ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతుండటంతో పాడిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది.చాలామంది మరోదారి లేక పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారు. పరాయి రాష్ట్రాల్లో బతుకు పోరాటం రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం కుటుంబాలతో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్ణాటకకు వలసలు భారీగా పెరిగాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల పేద రైతులు, కూలీలు ఎక్కువగా బెంగళూరులో పనుల వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌కు వలస వెళుతున్నారు. వలస వెళ్తున్న వారితో రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. పనిచేసే శక్తి ఉన్నవారు వలసబాట పట్టడంతో చాలా గ్రామాల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి చేతులు రాని ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట అయిన వేరుశనగ ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నేలపాలైంది. రబీలో వేసిన శనగ, కంది, మినుము, పెసర పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. టమోటా, మిరప, బెండ, వంగ తోటలు కూడా నీరులేక వాడిపోయాయి. తమ పరిస్థితి ఏటేటా దిగదుడుపుగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతులు మానసికంగా కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో 450కి పైగా మండలాల్లో కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం 316 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతలు దులుపుకుంది. దుర్భిక్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. రెయిన్ గన్‌తో పంటలను రక్షించామని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. 12 జిల్లాల్లో కరువు విలయ తాండవం రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. అక్టోబరు ఒకటో తేదీతో ఆరంభమైన రబీ సీజన్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ దుర్భిక్షం తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ కురవాల్సిన కనీస సగటు సాధారణ వర్షంతో పోల్చితే సగం కూడా కురవకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అయితే కురవాల్సిన దానిలో కేవలం 29 శాతం మాత్రమే కురిసింది. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకూ 279.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 121.2 మిల్లీమీటర్లు మాత్రమే (57 శాతం తక్కువ) నమోదైంది. సాధారణం కంటే కోస్తాంధ్రలో 54 శాతం, రాయలసీమలో 62 శాతం సగటు లోటు వర్షపాతం రికార్డయింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే కావడం గమనార్హం. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే రబీలోనే కాదు అంతకు ముందు ఖరీఫ్ సీజన్ నుంచి కరువు తిష్ట వేసింది. జూన్ 1వ తేదీతో ఆరంభమైన ఖరీఫ్ సీజన్ ఇప్పటివరకూ నమోదైన అధికారిక వర్షపాతం గణాంకాల ప్రకారం.. 480 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాష్ట్రంలో 72 శాతం ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. అప్పులు ఎలా తీర్చాలో... ‘‘ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయాయి. రబీలో రూ.3 లక్షల ఖర్చు పెట్టి 18 ఎకరాల్లో శనగ పంట వేశా. వర్షాల్లేక పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు’’ – తేనేశ్వరరెడ్డి, రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవడం లేదు ‘‘రూ.లక్ష ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశా. విత్తనాలు వేసే సమయంలో కురిసిన వాన తప్ప తర్వాత చినుకు పడలేదు. జొన్న పంటంతా ఎండిపోయింది. వానల్లేక ప్రతిఏటా పంటలు ఎండిపోతుండడంతో నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదు’’ – విష్ణువర్దన్‌రెడ్డి, రైతు, ప్యాలకుర్తి, కర్నూలు జిల్లా -
రబీకి సన్నద్ధం..
సాక్షి, భూపాలపల్లి: ఖరీఫ్ సీజన్ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో రబీ కోసం వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలో రైతులు సాగు చేయనున్న పంటలకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంచనాలను తయారుచేసింది. మామూలుగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ సీజన్ ఉంటే జిల్లాలో ఒక నెల ఆలస్యంగా పంటల సాగు ప్రారంభిస్తుంటారు. జిల్లా పరిధిలోని 20 మండలాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ రబీలో దాదాపు 80,711.4 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సింహభాగం 51,975 ఎకరాల్లో వరి వేయనున్నట్లు పేర్కొం టోంది. 2017–18 సంవత్సరం రబీలో 76,865 ఎకరాల్లో పంటలు సాగయినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఎక్కువే. జిల్లాలో రబీ సాధారణ సాగు 86,092.5 ఎకరాలు. వ్యవసాయ శాఖ దాదాపు 6,000 ఎకరాలు తక్కువగా అంచ నా వేసింది. పంటలకు అవసరమయ్యే 5,662 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయబోతోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. చెరువుల కింద ఇబ్బంది లేదు.. జిల్లాలో ఈ సారి వర్షాలు విస్తారంగా కురియడంతో చెరువులు దాదాపు నిండాయి. దీంతో ఆయకట్టులో భూముల్లో సాగుకు ఇబ్బంది లేదు. జిల్లాలో ప్రధాన చెరువలైన రామప్ప, లక్నవరం, గణపురం, భీంగణపూర్ చెరువులతోపాటు చిన్న చితకా కలిపి 600లకుపైగా చెరువులు ఉన్నాయి. దాదాపు అన్ని చెరువులు నీటితో నిండి ఉన్నాయి. సాగు అంచనాలను మించే అవకాశం.. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో ఇసుకమేటలతో పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇలాంటి చోట్ల వ్యవసాయదారులు ఇసుక మేటలను తీయించే పనిలో ఉన్నారు. ఖరీఫ్‌లో సాగుచేయని వారు రబీలో ఆరుతడి పంటలతోపాటు వరి సాగు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ అంచనాలను మించే అవకాశం ఉంది. వ్యవసాయ బోర్లు ఉన్న చోట వరికి ప్రాధాన్యతనిస్తుండగా, నీటి సదుపాయం లేనిచోట రైతులు పప్పుధాన్యాలను సాగు చేయనున్నారు. -
రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: వ్యవసాయంలో పెట్టుబడి కూడా తిరిగిరాక తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులకు కాస్తంత ఊరటనిచ్చేలా రబీ పంటల మద్దతు ధరలను కేంద్రం బుధవారం పెంచింది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, తెల్ల కుసుమలు, మసూర్ పంటల మద్దతు ధరలు 6 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై మద్దతు ధరల పెంపుకు ఓకే చెప్పింది. తాజా పెంపు వల్ల రూ.62,635 కోట్ల అదనంగా రైతులకు అందుతాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు, ఏడు నెలల్లో దేశమంతటా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం గమనార్హం. మద్దతు ధరల పెంపు, రుణమాఫీ కోరుతూ మంగళవారమే రైతులు ఢిల్లీలోనూ భారీ నిరసనకు దిగడం తెలిసిందే. పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చూస్తామని గతంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీనివ్వడం తెలిసిందే. తాజా పెంపు తర్వాత రబీ పంటలన్నింటికీ మద్దతు ధరలు పెట్టుబడి వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగానే ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. 2018–19 వ్యవసాయ సంవత్సరానికి వర్తించేలా గోధుమ ఎమ్మెస్పీని కేంద్రం రూ. 105 పెంచడంతో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,840కి చేరింది. అలాగే ప్రతి క్వింటాల్‌కు బార్లీకి రూ. 30 (పెంపు తర్వాత మద్దత ధర రూ. 1,440), శనగలకు రూ. 220 (రూ. 4,620), మసూర్‌కు రూ. 225(రూ. 4,475), ఆవాలకు రూ. 200(రూ. 4,200), తెల్ల కుసుమలకు రూ. 845(రూ. 4,945)ల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. గత జూలైలోనే వివిధ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను కూడా పెంచి అన్ని పంటలకూ పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉండేలా చేసింది. -
రబీ పంటలకు మద్దతు ధర పెరిగింది
న్యూఢిల్లీ : కిసాన్ క్రాంతి మార్చ్ అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచే ప్రతిపాదనను నేడు కేబినెట్ ఆమోదించింది. దీంతో గోధుమల మద్దతు ధర క్వింటాకు 105 రూపాయలు పెరిగి, ప్రస్తుతం క్వింటా 1,840 రూపాయలుగా ఉంది. గోధుమతో పాటు మరో ఐదు రకాల పంటలకు కూడా కనీస మద్దతు ధర పెరిగింది. కాగా జూలై నెలలోనే 14 రకాల ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ పంటలకు కూడా కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 20 శాతం లోటు వర్షపాతం, నీటి నిల్వలు పడిపోవడంతో, ఈ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని కేంద్రం నిర్ణయించి, ఈ ప్రకటన చేసినట్టు తెలిసింది. అంతేకాక మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో, రైతులను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లు అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కిసాన్ క్రాంతి ర్యాలీ. వీటన్నింటికీ తలొగ్గి కేంద్రం రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచిందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇప్పటికి 43 టీఎంసీలతో సర్దుకుందాం!
రబీ ఆలస్యమవుతున్న దృష్ట్యా తెలంగాణ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు స్పష్టత ఇవ్వకపోవడంతో రబీ పంటల సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదల డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బోర్డు సూచించిన నిర్ణయానికి కట్టుబడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 43 టీఎంసీలు తీసుకునేందుకు బోర్డుకు తన సమ్మతి తెలియజేసినట్లుగా సమాచారం. కాగా, తమకు కేటాయించిన 87 టీఎంసీలు సరిపోవని, 103 టీఎంసీలు కేటాయించాలని బుధవారం బోర్టుకు ఏపీ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగ లెక్కలను పక్కనబెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన తెలంగాణ, ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో 43 టీఎంసీలు తీసుకోవాలని, ఇంకా అవసరమైతే గవర్నర్ సమక్షంలో చర్చించి నిర్ణయానికి రావాలని యోచిస్తోంది. -
ఏటయిందే గోదారమ్మా..!
డిసెంబర్ మొదట్లోనే కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రవాహం గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుపై రైతుల్లో ఆందోళన కనీసం 90 టీఎంసీలు అవసరమంటోన్న జలవనరుల శాఖ సీలేరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నది 30 టీఎంసీలే సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ ప్రారంభంలోనే గోదావరి నదిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం డెల్టా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. డెల్టాలో రబీలో పంటల సాగుకు కనిష్టంగా 90 టీఎంసీలు అవసరం. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో సహజ సిద్ధంగా ఉండే ప్రవాహాల నుంచి 60 టీఎంసీలు వస్తే డెల్టాలో రబీ పంటలు చేతికందుతాయి. కానీ.. డిసెంబర్ ప్రారంభంలోనే గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. డ్రైయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా 60 టీఎంసీల నీటి లభ్యత అసాధ్యమని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 10,13,161 ఎకరాల్లో ఖరీఫ్‌లోనూ, రబీలోనూ పంటలు సాగు చేస్తారు. పంటల సాగుకు కనిష్టంగా ఖరీఫ్‌లో 102, రబీలో 90 టీఎంసీలు అవసరం. డెల్టాలో ఖరీఫ్ పంటల కోతలు పూర్తయివడంతో రబీ పంటలకు నారుమళ్లు పోసుకుని.. పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీకి 5,633 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఐదు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 633 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 5,600 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు మళ్లించారు. వీటిని కలుపుకున్నా గోదావరిలో ప్రవాహం 11,233 క్యూసెక్కులేనని స్పష్టమవుతోంది. ఆందోళనలో రైతన్నలు.. గోదావరి డెల్టాలో రబీలో డిసెంబర్ 15 నుంచి వరి నాట్లు వేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంట నూర్పిళ్లను ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 నాటికి పట్టిసీమ పంపులను నిలిపేస్తామని సర్కార్ చెబుతోంది. వరి నాట్ల సమయంలో డెల్టాకు కనిష్టంగా 13 వేల క్యూసెక్కులు అవసరం. పంట పొట్ట దశలో ఉన్నప్పుడూ ఇదే స్థాయిలో అవసరం. డిసెంబర్ ప్రారంభంలోనే 11 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహం పడిపోయిన నేపథ్యంలో.. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కనీసం 2,500 నుంచి మూడు వేల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉంది. సీలేరు రిజర్వాయర్ల నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినా.. గోదావరి సహజ ప్రవాహాలతో కలిపి 7,500 క్యూసెక్కులకు మించి డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలేవీ? గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు నీళ్లందక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రబీలో సమర్థంగా డెల్టా కు నీళ్లందించడానికి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చ ర్యలూ తీసుకోలేదు. రైతులకు అవగాహన కల్పించే రీతిలో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ చివరి నిముషంలో డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసి హడావుడి చేసినా పంటలను రక్షించే అవకాశం ఉండదు. రైతులు వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడుల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రైతులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
రబీకి సిద్ధం కండి
మరో 20 రోజుల్లో సీజన్ శనగ, కంది, సోయ, ఆముదం తదితరాలకు అనుకూలం గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: ఖరీఫ్.. రైతుల ఆశలను అడియాసలు చేసింది. అదను సమయంలో వర్షాలు లేక మొక్కజొన్నతో పాటు ప్రధాన పంటలన్నింటికీ భారీ నష్టం సంభవించింది. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల సాగు 3.72లక్షల హెక్టార్లకే పరిమితమైంది. వర్షాలు అనుకున్న స్థాయిలో కురిస్తే నిజానికి 5.5లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చేది. కానీ పరిస్థితి భిన్నంగా మారింది. ఉన్న పంటలు కూడా సక్రమంగా లేకపోవడం రైతులను ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి తరుణంలో రైతులు మరో 20రోజుల తర్వాత ‘రబీ’కి సిద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో వేయదగిన పంటలు, వాటి యాజమాన్య పద్ధతులపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్ : 7288894469) సలహాలు, సూచనలు అందించారు. శనగ అక్టోబర్ నుంచి నవంబర్ 30 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఎకరాకు 24-26 కిలోల విత్తనం అవసరముంటుంది. అదే విధంగా 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇందుకోసం అవసరముంటుంది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుంది. ఇవే కాకుండా జ్యోతి, అన్నెగిరి, శ్వేత, క్రాంతి, ఐసీసీవీ-10 రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు విధిగా రైజోబియం కల్చర్‌తో విత్తన శుద్ధి చేపట్టాలి. కంది అక్టోబర్‌లో ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 4-5కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 20కిలోల బాస్వరం మోతాదులో రెండు పర్యాయాలు వేయాల్సి వుంటుంది. ఎల్‌ఆర్‌జీ-30, సీ-11, అభయ, ఐసీపీఎల్ 85063తోపాటు పలు రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సోయచిక్కుడు అక్టోబర్ నెలలో విత్తనం వేయాల్సి వుంటుంది. ఎకరాకు 20-24 కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్ అవసరముంటుంది. మార్కెట్లో ప్రస్తుతం హార్డీ, జేఎస్-335, మ్యాక్స్ 58/201/పీకే 472/ఎల్ఎస్బీ-1, మోనెట్టా. డైథేన్, థైరమ్ 3గ్రాములు కిలో విత్తనం చొప్పున వేసి శుద్ధి చేయాలి. నువ్వులు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2-2.5 కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్ వేసుకోవాలి. రాజేశ్వరీ, వైఎల్‌ఎం-17, పూసోబోల్డ్, క్రాంతి, సీత, వరుణ, కష్ణ రకాల విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. పొద్దుతిరుగుడు అక్టోబర్ నుంచి నవంబర్ నెలాకరు వరకు ఈ విత్తనాలను వేసుకోవచ్చు. ఎకరాకు సాధారణ రకాలు 2.4-3.2, హైబ్రిడ్ రకాలయితే 2-2.4 కిలోల విత్తనం అవసరముంటుంది. ఇందుకోసం 26కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్ వేయాల్సి వుంటుంది. ఈజీ68414, మోర్డాన్, కో-1, ఏపీఎస్‌హెచ్-11, ఎంఎస్‌ఎఫ్‌హెచ్-8, 17, కేబీఎస్‌హెచ్-1, బీఎస్‌హెచ్-1 రకాలు మార్కెట్లో దొరుకుతాయి. 25-35 టన్నుల ఎరువు వాడాలి. కలుపు నివారణకు పైరు మొలకెత్తకముందే 15కిలోల ఫ్లూకోరాలిన్ చల్లాలి. విచ్చుకునే దశ, గింజలు ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఆముదం అక్టోబర్ నుంచి నవంబర్ 15వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 5-6కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్ వేసుకోవాలి. అరుణ, భాగ్య, సౌభాగ్య, 48-1, గౌచ్1, క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, జీసీహెచ్-4, డీసీహెచ్-32 రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాఫ్టాన్ లేదా థైరమ్‌తో విత్తన శుద్ధి చేపట్టాలి. 2టన్నుల పశువుల ఎరువును వాడితే మంచింది. దనియాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తనాలను వేసుకోవాల్సి వుంటుంది. ఎకరాకు 6కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎకరానికి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. -
అంతా హడావుడే
► భూసార పరీక్షలపై రైతుల అసంతృప్తి ► ఖరీఫ్ ప్రారంభమైనా రైతుకు చేరని ఫలితాలు ► ఇప్పటికీ కొనసాగుతున్న మట్టి నమూనాల సేకరణ రబీ పంటలు పూర్తయిన అనంతరం మార్చి చివరి నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షల అనంతరం ఫలితాలను కనీసం మే నెల చివరికైనా రైతుకు చేర్చితే ఖరీఫ్ ప్రారంభంలో వాటి ప్రకారం పంటలు సాగు చేసే వీలుంది. అయితే మట్టి నమూనాల సేకరణ ఎప్పుడు మొదలెట్టారో అటుంచితే అందుకు సంబంధించిన పరీక్షలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వరుణుడి ఆగమనం కూడా పూర్తి కావడంతో భూములు పదునెక్కి రైతులు విత్తు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ సిబ్బంది భూసార పరీక్షలు పూర్తి చేసేదెప్పుడు, ఆ ఫలితాలు రైతులకు చేరేదెప్పుడు, వాటి ప్రకారం పంటలు సాగు చేసేదెప్పుడు.. అంతా వృథా ప్రయాస తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా రైతులకు కూడా తెలుసు. అందుకే వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలియాల్సిందిల్లా వ్యవసాయ అధికారులు, ఆ శాఖ సిబ్బందికే. కర్నూలు (అగ్రికల్చర్) : భూసార పరీక్షల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నిజమే.. వీటి ద్వారా నేలలో ప్రధాన పోషకాలు, సూక్ష్మపోషకాల స్థాయి తెలుసుకుని అందుకు అనుగుణంగా ఎరువులు, తగిన పంటలు చేసుకుని పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు.. నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే మట్టి నమూనాలు సేకరించిన వ్యవసాయ సిబ్బంది వాటిని పరీక్షించి ఆ ఫలితాలను రైతులకు చేర్చితే కదా ఇదంతా సాధ్యమయ్యేది. ఏటా భూసార పరీక్షలంటూ హడావుడి చేయడం తప్ప వాటి ఫలితాలు సకాలంలో రైతులకు చేరవేయడంతో వ్యవసాయ సిబ్బంది విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి నమూనాల సేకరణ జరుగుతుండడం మరీ విడ్డూరం. మట్టి నమూనాల సేకరణే అస్తవ్యస్థం.. భూసార పరీక్షలకు గ్లోబెల్ పోజిషనింగ్ సిస్టం ద్వారా మట్టి నమూనాలు సేకరించేలా చర్యలు తీసుకున్నారు. అయితే జీపీఎస్ విధానం తూతూ మంత్రంగా అమలవుతుండటంతో మట్టి నమూనాల సేకరణ పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలో 6,32,902 భూకమతాలుండగా 2015-16లో 27,288 మట్టి పరీక్షలు నిర్వహించారు. ఒక రైతు పొలంలో మట్టి నమూనా సేకరిస్తే ఆ ఫలితాలు ఆ భూకమతంలోని రైతులందరికీ వర్తిస్తాయి. గత ఏడాది మట్టినమూనాలు సేకరించిన రైతులతో పాటు ఆకమతాల్లోని ఇతర రైతులకు అంటే 2,05,803 మందికి మట్టి పరీక్షల ఫలితాలు చేర్చారట. వాస్తవంగా ఇందులో 25 శాతం మందికి కూడా భూసార పరీక్ష ఫలితాలు చేరలేదు. ఈ ఏడాది 68098 మట్టి పరీక్షలు.. 2016-17లో 68,098 మట్టి నమూనాలను పరీక్షించి సంబంధిత రైతులతోపాటు కమతంలోని రైతులందరికీ సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయతలపెట్టారు. ఇప్పటి వరకు 65 వేల మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపారు. ఎమ్మిగనూరు కేంద్రానికి 16,945, కర్నూలుకు 16719, డోన్‌కు 12,226 నమూనాలు పంపించారు. ఒకవైపు మట్టి నమూనాల సేకరణ, మరోవైపు మట్టి పరీక్షల నిర్వహణలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి రైతుకూ మట్టి పరీక్ష ఫలితాలు ఇస్తాం ఈ నెల మొదటివారంలోగా మట్టి నమూనాల సేకరణ, నెలాఖరులోగా మట్టి పరీక్షల నిర్వహణను పూర్తి చేస్తాం. ఈ నెల 20 నుంచి రైతులకు భూసార పరీక్ష ఫలితాలను నమోదు చేసిన కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - శేషారెడ్డి, ఏడీఏ, భూసార పరీక్ష కేంద్రం, ఎమ్మిగనూరు -
జూన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన
నేడు బనగానపల్లెలో వ్యవసాయాధికారులకు శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్) : ఈ ఏడాది జూన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. రైతుల కష్టాన్ని విపత్తులు ఊడ్చి పెడుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినూత్నంగా ప్రవేశపెట్టిన ఫసల్ యోజన అన్నదాతల్లో భరోసాను నింపుతోంది. ఈ పథకంపై మంగళవారం వ్యవసాయ అధికారులకు బనగానపల్లె మండలం యాగంటి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ బీమా పథకానికి ఖరీఫ్ అన్ని పంటలకు 2 శాతం ప్రకారం, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ బీమా పథకంలో పంటలకు నష్టం జరిగినప్పుడు కేంద్ర బృందాలు సందర్శించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపాల్సిన అవసరం ఉండదు. నష్టపోయిన రైతు స్మార్ట్ ఫోన్ ద్వారా పంట వివరాలను అధికారులకు పంపినట్లయితే తక్షణ సహాయం కింద 25 శాతం నష్టపరిహారం లభిస్తుంది. ఆధునిక టెక్నాలజీ (డ్రోనులు, ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటివి) ఉపయోగించి పంట నష్టాన్ని అంచనా వేయడం ద్వారా త్వరగా పరిహారాన్ని అందుంతుందని అధికారులు తెలిపారు. ఈ బీమా పథకం జూన్ నుంచి అమల్లోకి రానుంది. దీని కింద 33 శాతం పంట నష్టం జరిగితే చాలు పరిహారం లభిస్తుంది. -
కదిలిస్తే కన్నీళ్లే..
కరువుతో వలస వెళుతున్న పల్లె జనం ♦ ఎండిపోయిన పంటలు.. ఉపాధి హామీ పనులు చేపట్టని ప్రభుత్వం ♦ పొట్టచేతబట్టుకుని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తరలుతున్న వైనం ♦ పట్టణాల్లోనూ కూలీ పనులు అంతంతే సాక్షి నెట్వర్క్ కరువుతో తల్లడిల్లుతున్న తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు వలసలు పోతున్నారు. కంట నీరు కక్కుకుంటూ ముసలి తల్లిదండ్రులను, భార్యాపిల్లలను ఉన్న ఊళ్లలో వదిలేసి పోయేవాళ్లు కొందరైతే... పొట్టచేతబట్టుకుని కుటుంబం మొత్తం వెళ్లేవాళ్లు మరికొందరు. సాధారణంగా వేసవి సమయంలో వలసలు వెళ్లే రైతు కూలీలు... ఈ సారి రబీ పంటలు వేయకముందే పట్టణాల బాట పడుతున్నారు. ఎక్కడ నిర్మాణ పనులుంటే అక్కడికి తరలి వెళుతున్నారు. ఈ దుస్థితిలో ఉపాధి హామీ పథకంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. నామమాత్రానికి కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది. దీంతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు, పక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే ఊళ్లకు ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ మండలాల్లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. హుస్నాబాద్‌లోని రేగొండ, మల్‌చెర్వుతండా, దుబ్బ తండా రైతులు పంటలు కళ్లముందే ఎండిపోతున్నా.. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మక్క, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నీళ్లు లేక మొక్కజొన్న వాడిపోతుండటంతో పశువుల మేతగా ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వలస వెళుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వ్యవసాయ పనులు, ఉపాధి పనుల జాడలేక పల్లెలను వదులుతున్నారు. అటు పట్టణ ప్రాంతాల్లోనూ సరిగా కూలి పనులు దొరకక పడరాని పాట్లు పడుతున్నారు. భార్యాపిల్లల్నీ వదిలేసి.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల పంచాయతీ పరిధిలోని మీది తండాకు చెందిన శంకర్‌నాయక్ సింగిల్ విండో డెరైక్టర్. ఆయనకు ఆరుగురు కుమారులు. ఉన్న నాలుగెకరాల్లో వేసిన పెసర పంట ఎండిపోయింది. ఉన్న పశువులనూ అమ్ముకునే పరిస్థితి. దీంతో ముగ్గురు కుమారులు దశరథ్, సిద్ధానాయక్, బీక్యానాయక్ బతుకు దెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. మరో ముగ్గురు కుమారులు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. పేరపళ్ల తండాకు చెందిన చిన్న రామునాయక్ ఎకరా భూమిలో వేసిన పెసర పంట ఎండిపోయింది. దీంతో ఉపాధి కోసం ఇద్దరు కుమారులు భార్యాపిల్లలను ఇక్కడే వదిలి ముంబైకి వలస వెళ్లారు. ఇదే తండాకు చెందిన మరో రైతు పెద్దరాము నాయక్. మూడెకరాల్లో పెసర, కంది పంటలు వేశాడు. వానల్లేక అవి ఎండిపోవడంతో... ముగ్గురు కుమారులు వారి భార్యాపిల్లలతో ముంబైకి వలస వెళ్లారు. పోరగాండ్లను వదిలేసి వెళ్తున్నం ‘‘పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారినయి. ఇద్దరు పోరగాండ్లను ఇంటికాడ వదిలేసి పట్నానికి వలస వెళుతున్నా. కరువు కాలం లో ఉపాధి పనులు పెట్టాల్సిన అధికారులు ఎక్కడున్నారో ఎమో?’’ - రెడ్డి దస్తయ్య, రైతు, గాలిపూర్, నిజామాబాద్ జిల్లా ఊళ్లకు ఊళ్లే ఖాళీ.. పాలమూరు రైతులు, కూలీలు పొట్టకూటి కోసం వలసలు వెళుతున్నారు. జిల్లాలోని నారాయణపేట డివిజన్లో కోయిల్‌కొండ, ధన్వాడ, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నారాయణపేట మండలంలోని పేరపళ్ల తండాలు, కొల్లంపల్లి పరిధిలోని లింగంపల్లితండా, ఒండుచెలిమి తండా, మేకహన్మన్ తండా, కోయిలకొండ మండలంలోని వింజామూర్, రామన్నపల్లి తండా, జయనగర్తండా, రాజీవ్గాంధీతండా, ఎల్లారెడ్డిపల్లి, అంకిళ్ల, చందాపూర్ల నుంచి గిరిజనులు మూటమూల్లె సర్దుకుని మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, కర్ణాటకలోని బెంగళూర్, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు కూలీ పనులు కూడా సరిగా దొరకడం లేదు. ఇక గ్రామాల నుంచి వలస వచ్చిన వారిని గుంపు మేస్త్రీలు మోసం చేస్తున్నారు. దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. ఆరేడు వేలు ఇస్తామంటూ ముంబై, గుజరాత్, పూణె, బెంగళూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి పనులు చేయించుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరికి రోజుకు రూ. వంద కూడా రాని పరిస్థితి. -
రబీ పంటలకు ‘లోటు’ తెగులు!
అదనులో కురవని వర్షాలు.. పాతాళంలో భూగర్భ జలాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రబీ పంటల సాగు విస్తీర్ణం ఆందోళన కలిగిస్తోంది. రబీ పంటలు సాగయ్యే 25.89 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటివరకు 21 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇప్పటికే 24.12 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. ప్రైవేటు సంస్థల సమాచారం ప్రకారం ఫిబ్రవరి తొలివారం నాటికి 18 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలించక భూగర్భ జలాలు అడుగంటడం, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదలయ్యే పరిస్థితి లేకపోవడంతో రైతులు అదునులో పంటలు వేయలేకపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు వాడిపోతున్నాయి. పత్తి, పొద్దు తిరుగుడు, కంది, రాగి, మొక్కజొన్న, నూగు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం చాలా చోట్ల మిర్చి పంట కల్లాల్లో ఉంది. ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి తీతలు ఊపందుకున్నాయి. చెరకు కొట్టుడు కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మొక్కజొన్న, నువ్వులు పూత, పిందె దశలో ఉన్నాయి. వరి ఊడ్పులు పూర్తయ్యాయి. రెండో పంటకు నీళ్లు ఇస్తారన్న ఆశతో కోస్తా జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలో నీళ్లు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. -
అ(ప)ప్పు శనగ..!
కడప అగ్రికల్చర్...: పెరిగిన పెట్టుబడులు... తగ్గిన దిగుబడులు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు.. మరోపక్క చిరుజల్లులు వెరసి రబీ పంటలు అన్నదాతకు అప్పులు మిగిల్చారుు. జిల్లాలో ముఖ్యంగా రబీ పంటలు వేసిన పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రబీలో అత్యధికంగా సాగు చేసిన పప్పుశనగ (బుడ్డశనగ) పంట... రైతన్న కోలుకోలేని దెబ్బతీసింది. పైరు ఎదుగుదల దశలో వరుణుడు కరుణంచకపోవడం, పూత, పిందెదశలో తుపాను ప్రభావం వల్ల చిరుజల్లులు కురవడంతో పెద్ద నష్టమే జరిగింది. చిరుజల్లులతో పంట దిగుబడిని పెంచే పులుసు పదార్థం కారిపోరుు కాపు పూర్తిగా తగ్గిపోరుుంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడం బాధాకరం. కౌలు రైతు పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంటోంది. సాధారణంగా ఖరీఫ్ పంటలు దెబ్బతీసినా రబీ మాత్రం రైతన్నకు అనుకూలించి ఎంతో కొంత ఆదాయాన్నిచ్చేది. అయితే ఈ ఏడు ఖరీఫ్‌లో తీవ్రవర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతన్న కుంగిపోయాడు. రబీ సీజను ప్రారంభంలో వర్షాలు ఊరించడంతో ప్రధానంగా పప్పుశనగ(బుడ్డశనగ)తో పాటు జొన్న, పెసర మినుము, పొద్దుతిరుగుడు, ఉలవ, అనప తదితర పంటలు సాగుచేశారు. రబీ పప్పుశనగతో ఖరీఫ్ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. 63972 హెక్టార్లలో సాగు....: ఈ రబీలో జిల్లాలో 63972 హెక్టార్లలో బుడ్డశనగను సాగు చేశారు. వర్షాభావం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నష్టపోయిన పప్పుశనగ రైతుకు బీమా అందించి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట సాగు సమయంలో క్వింటా విత్తన ధర రూ. 3500 పలికిందని, అదే నేడు అరకొరగా వచ్చిన పంటకు క్వింటా ధర రూ. 3000 మించి పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా గిట్టని వైనం...: సాధారణంగా బుడ్డశనగ ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎకరాకు 1 నుంచి 1 1/2 బస్తాలకు మించి రాలేదని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు పంటను పూర్తిగా గొర్రెలకు మేతగా వదిలేశారు. మరి కొందరు అదే పొలంలోనే దున్నేస్తున్నారు. పొలాలను కౌలుకు తీసుకుని బుడ్డశనగను సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంట సాగుకు ముందుగనే భూ యజమానికి ఎకరానికి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు చెల్లించారు. తీరా పంట దెబ్బతినడంతో ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు...: బుడ్డశనగ పంటను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నాం. కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. పంట సాగుకు పదునుపాటి వర్షాలు కురిశాయి. ఇబ్బంది లేదు అని సాగు చేస్తే తీరా పంట బుడ్డలు వచ్చేటప్పుడు చిరుజల్లులు పడడంతో పంట మొత్తం పోయింది. పెట్టుబడులు కూడా రాకుండా పోయినాయి. -నారాయణరెడ్డి, శనగరైతు, పెద్దపసుపుల గ్రామం, పెద్దముడియం మండలం. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి రబీలో ప్రధాన పంటగా జిల్లా అధిక మండలాల్లో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పోయింది. రబీ కూడా దెబ్బతీసింది. బుడ్డశనగ పంటతోపాటు ఇతర పంటలు కొన్ని మండలాల్లో వర్షాభావంతోను, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో తుపాను ప్రభావంతో చిరుజల్లులు కురవడంతో శనగ కు దిఉబడినిచ్చే పులుసు పదార్థం కారిపోవండంతో దిగుబడి తీర్మానంగా పోయింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. -రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం. ఇన్పుట్ సబ్సిడీ...బీమా అందించాలి...: ఖరీఫ్ పంటలు వర్షాభావంతో పంటలు తుడిచిపెట్టుకుపోగా, ఆదుకుంటాయనుకున్న రబీ సీజన్ పంటలు కూడా ఏ మాత్రం రైతుకు మేలు చేయలేకపోయాయి. ఈ తరుణంలో రైతులకు ఇన్పుట్సబ్సిడీతోపాటు పంటల బీమా కూడా అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. -సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం -
మార్చి15 వరకే కరెంటు!
కరువు పరిస్థితుల్లో రైతన్న నెత్తిన మరో పిడుగు ఆ తర్వాత పంటలకు విద్యుత్ సరఫరా చేయలేమంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ‘కరెంటు సమస్య తరుముకొస్తోంది. వచ్చే వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. అందువల్ల రబీలో వేసే పంటలన్నీ మార్చి 15వ తేదీలోగా చేతికొచ్చేలా ఉండాలి. అలాంటి స్వల్పకాలిక పంటలనే రైతులతో వేయించాలి. మార్చి 15 తర్వాత పంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించండి..’.. జిల్లా అధికారులకు వ్యవసాయశాఖ జారీ చేసిన ఆదేశాల సారాంశమిది. మార్చి తర్వాత గృహ విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని, పరిశ్రమలకూ విద్యుత్ అందించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా మే నెల వరకూ రబీ పంటలు కొనసాగుతాయి. కానీ నెలన్నర ముందుగానే రబీ పంటలను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఆదేశించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రబీ సీజన్‌ను ఎలా ముందుకు తీసుకురాగలమని కొందరు అధికారులు సందేహం వెలిబుచ్చుతున్నారు. ఆలస్యమైన రబీ సాగు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యమైంది. సెప్టెంబర్ 30 నాటికే పూర్తికావాల్సిన ఆ సీజన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఖరీఫ్ పంట కోతలు సాగుతున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగు ఆలస్యమైంది. రబీ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా ఇప్పటివరకు 62 శాతం కూడా పంటల సాగు జరగలేదు. సాధారణంగా రబీలో మొత్తంగా 13.09 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా.. ప్రస్తుత సమయానికి 4.89 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ 3.04 లక్షల హెక్టార్లలోనే (62%) సాగు ప్రారంభమైంది. మొత్తం సీజన్‌తో పోలిస్తే ఇది కేవలం 23 శాతమే కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 15 నాటికి చేతికి వచ్చేలా రబీ పంటలు సాగు చేయాలని, అప్పటి వరకు మాత్రమే కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వ్యవసాయ శాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వరి, చెరకు వంటి దీర్ఘకాలిక పంటల సాగు చేపట్టవద్దని కోరుతోంది. మార్చి15 నాటికి పూర్తయ్యే జొన్న, సజ్జ, పెసర, ఆముదం, శనగ వంటి మూడు నెలలు లేదా 100 రోజుల్లో పూర్తయ్యే ఆరు తడి పంటల వైపే మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేస్తోంది. దీర్ఘకాలిక పం టలు వేస్తే ఇబ్బందులు తప్పవని, వాటికి కరెంటు సరఫరా చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కమ్ముకున్న కరువు మేఘాలు మరోవైపు కరువు పరిస్థితులు రాష్ట్రాన్ని కమ్మేశాయి. రబీలో వర్షపాతం లోటు ఏకంగా 60 శాతంగా ఉండటం ఆందోళనకరం. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లను కలిపి విశ్లేషిస్తే రాష్ట్రంలోని 345 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 73 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో పంటల దిగుబడి దాదాపు 40 శాతం తగ్గవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కరువు పరిస్థితిపై ప్రభుత్వం అధ్యయన కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ పంట కోత ప్రయోగాల నివేదిక వచ్చాక కరువు మండలాలను ప్రకటించే అవకాశముంది. ఇలా ఒకవైపు కరువు, మరోవైపు భూగర్భ జలాలు పడిపోవడం, మార్చి 15 తర్వాత కరెంటు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో... రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
పాతాళంలో గంగమ్మ
గంగమ్మ అథం పాతాళం నుంచి పైకి రానంటోంది. జిల్లాలో భూగర్భజలాల మట్టం రోజురోజుకూ పడిపోతుంది. నెలరోజుల వ్యవధిలో 0.26 మీటర్ల నీటిమట్టం పోయింది. జులైలో 11.67 మీటర్ల లోతులో ఉండాల్సిన నీరు ఆగస్టు చివరినాటికి 11.93 మీటర్లకు తగ్గిపోయింది. సాక్షి, మహబూబ్‌నగర్: ఈసారి వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు ఆందోళనకరంగా మారాయి. గతేడాది భారీవర్షాల కారణంగా ఈ ఏడాది కాస్త మెరుగ్గానే భూగర్భజలాలు నమోదయ్యాయి. ప్రస్తుత ం నమోదవుతున్న నీటి పరిణామాన్ని బట్టి చూస్తే బోర్లలో నీరు అందుబాటులోనే ఉంది. దీంతో ఈ ఏడాది బోర్ల కింద సాగుచేసిన ఖరీప్ పంటలకు ఎలాంటి ఢోకా ఉండకపోయినా.. రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని భూగర్భజల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది వానలే జీవం జిల్లాలో గతేడాది చివరిలో కురిసిన భారీవర్షాలకు భూగర్భ జలాల నమోదు కాస్త మెరుగుపడింది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 277.33 మి.మీటర్ల వర్షపాతం అదనంగా కురిసింది. సాధారణం కంటే 47శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాల మట్టం మెరుగైనస్థితికి చేరుకుంది. గతేడాది ఆగస్టులో 12.27 మీటర్ల మేర నమోదైన నీటిమట్టం ఈ ఏడాది ఆగస్టులో 11.93 మీటర్లుగా నమోదైంది. గతంతో పోల్చితే 0.34 ఎంబీజీఎల్ పైనే అదనంగా నీరు అందుబాటులో ఉంది. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు కాస్త భిన్నంగా ఉంది. వర్షాపాతం తక్కువస్థాయిలో నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 446.8 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 327.2 మి.మీ మాత్రమే కురిసింది. అంటే సాధారణ ం కంటే 27శాతం తక్కువగా నమోదైంది. జిల్లాలోని ఖిల్లాఘన్‌పూర్ మండలంలోని కమలోద్దీన్పూర్లో కేవలం 0.90 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉంది. అలాగే ధరూరు మండలంలో మాత్రం అతి దారుణమైన స్థితిలో భూగర్భజలమట్టం నమోదైంది. ధరూరులో అత్యధికంగా 39.20 మీటర్లు తోడితే కానీ నీరు అందుబాటులో రావడంలేదు. ప్రస్తుతం జిల్లాలో నీటికోసం దాదాపు 14 మండలాల్లో 20మీ.. కంటే ఎక్కువ లోతు తోడాల్సి వస్తోంది. వివిధ మండలాల్లో నమోదైన భూగర్భజల మట్టాలు(మీటర్లలో) మండలం 2011 2012 2013 2014 జడ్చర్ల 19.75 22.82 18.75 17.32 నాగర్‌కర్నూల్ 14.57 20.28 24.34 14.78 కల్వకుర్తి 20.83 26.62 31.54 25.95 కొడంగల్ 06.13 08.06 08.37 13.87 నారాయణపేట 06.38 09.03 10.66 11.96 -
కరువు కోరల్లోనే..
- 70శాతం చెరువుల్లో నీరు కరువు - 24శాతం అంతంత మాత్రమే - పూర్తిగా నిండింది 6.20శాతమే - భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం - పరిస్థితి ఇలాగే ఉంటే రబీ పంటలకు కష్టమే సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరువు కొట్టుమిట్టాడుతోంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు కేవలం భూమి తడపడానికి, మెట్ట పంటలకు ప్రాణం పోయడానికే సరిపోయింది. చెరువుల్లోకి పెద్దగా నీళ్లు వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువే. జిల్లాలోని సుమారు 70శాతం చెరువులు నీళ్లులేక బోసిపోయాయి. దీంతో చెరువులనే ఆధారం చేసుకొని ఖరీప్‌లో సాగు చేస్తున్న వరిపైరు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రబీ పంటపై పూర్తిగా ఆశలు వదుకోవాల్సిందే. జిల్లా నుంచి కృష్ణానది పారుతున్నా ఇక్కడి పొలాలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కేవలం రెండు, మూడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు మాత్రమే నీరు అందుతోంది. జిల్లాలోని దాదాపు 55మండలాలు కేవలం చెరువులు, కుంటల ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో చెరువులను మూడు డివిజన్లుగా విభజించారు. వాటి పరిధిలో మొత్తం 6,055 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (40హెక్టార్లలో విస్తరించినవి) 681 ఉన్నాయి. వీటి కింద 60,456 హెక్టార్లు సాగవుతోంది. చిన్న చెరువులు 5,374 దాకా ఉన్నాయి. వీటి కింద 41,732 హెక్టార్ల పంట సాగవుతోంది. అయితే ఈ ఏడాది చెరువుల్లోకి పెద్దగా నీరు రాకపోవడంతో అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వరి పంట పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగు అంతంతే..! ఈ ఏడాది వర్షాలు దాగుడుమూతలు ఆడడంతో పంట సాగు అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో సరాసరిగా అన్ని పంటలు కలిపి 7,38,731.4 హెక్టార్లు సాగయ్యేది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 5,16,266 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాధారణంతో పోల్చితే దాదాపు 30శాతం పైగా సాగు తక్కువగా నమోదైంది. ఇక వరి విషయానికొస్తే అతి దారుణమైన గణాం కాలు నమోదయ్యాయి. జిల్లాలో వరి 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 33,557 హెక్టార్లు మా త్రమే సాగైంది. అది కూడా జూరాల, ఆర్డీఎస్ పరిధిలోని చోటుచేసుకున్న గణాంకాలే సూచిస్తున్నాయి. అయితే ఈ సారి చిన్న, పెద్ద చెరువులేవీ పూర్తిస్థాయిలో నిండలేదు. దాదాపు 70శాతం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. దీంతో ఈసారి వరి పంట కేవలం 33,557 హెక్టార్లలో మా త్రమే సాగైంది. వాస్తవానికి జిల్లాలో 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా కేవలం 30.65శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అది కూడా మున్ముందు సరైన వర్షా లు కురవకపోతే వాటి పరిస్థితి కూడా అంతే సంగతులు. మహబూబ్‌నగర్ డివిజన్ కాస్త నయం ఈ ఏడాది కురిసిన వర్షాలు కూడా అంతంత మాత్రమే. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు మాత్రమే కాస్త ఉపసమనం కలిగించాయి. అయినప్పటికీ ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 28 శాతం లోటుంది. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురిశాయి. ఈ డివిజన్ పరిధిలో 302 పెద్దవి, 2183 చిన్న చెరువులున్నాయి. వీటిలో 15 పెద్ద చెరువులు, 329 చిన్న చెరువులు పూర్తిగా నిండాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ డివిజన్ పరిధిలో 46 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 157 పెద్దవి, 1,068 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 222 పెద్దవి, 2,123 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు నిండలేదు. -
‘సాగర్’లో తగ్గుతున్న నీటిమట్టం
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీటిపై అధికారులు కాకి లెక్కలు వేస్తున్నారు. ఖరీఫ్ పూర్తవడంతో ఆయకట్టు కింద రబీ పంటల సాగు కోసం రైతులు ముందస్తుగా సమాయత్తమయ్యారు. రబీ పంటలకు నాల్గు విడతల్లో 9 టీఎంసీల నీటిని అంది స్తామని ప్రకటించిన అధికారులు మొదటి విడతలోనే మూడు టీఎంసీల మేరనీటిని వదిలారు. ఇంకా ప్రధాన కాలువకు నీటి విడుదల జరుగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. అయినా ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం పూర్తవలేదు. మొదటి ఆయకట్టు కింద పంటల సాగు కోసం రైతులు నారుమళ్లు వేసుకొని సాగు కోసం న్నద్ధమవుతున్నారు. డీఐబీ సమావేశంలో నాల్గు విడతలకు తీర్మానం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయ కట్టుకు నీటివిడుదల కోసం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం డీఐబీ (నీటిపారుదల శాఖ సలహా మండలి) సమావేశం నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్లో పం టల సాగుకు అవసరం ఉన్న నీటి నిల్వలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాల్లో పూర్తిస్థాయిలో ఉన్నా యి. దీంతో పంటల సాగు అవసరం ఉన్న నీటి తడులపైన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయకట్టు కింద సమారు 2.10 లక్షల ఎకారల్లో పంటలను సాగు చేయనున్నట్లు వారు అంచనా వేశారు. అలీసాగర్ రిజర్వాయర్ ప్రాంతం వరకు ఉన్న సుమారు 1.38 లక్షల ఎకరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుం చి నాల్గు విడతల్లో 9 నుంచి 10 టీఎంసీల నీటి విడుదల కోసం వారు ప్ర తిపాదించారు. ఆయకట్టు కింద వరి, ఆరుతడి పంటల సాగు కోసం ప్రతి పాదించి అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆరుతడి కోసం ప్రారంభించి.. ఆరుతడి పంటల కోసం ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 21న ప్రధాన కాలువకు నీటివిడుదల చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ 28, 30 ప్రాంతాల్లో రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని నీటిని వదిలారు. అప్పటి నుంచి నిర్విరామంగా నీటివిడుదల కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గు తున్నా, ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం కూడా పూర్తికాలేనట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 15 రోజుల పాటు ఆయకట్టుకు 1.5 నుంచి 2 టీఎంసీలు, రెండో విడతలో 15 రోజుల పాటు 1.5 నుంచి 2 టీఎంసీ లు, మూడో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీలు, నాల్గో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీల నీ టి విడుదలకు ప్రతిపాదించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల ను గట్టెక్కించడానికి అవసరం ఉన్న నీటి నిల్వలు ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్నాయి. కాని ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీరు వృథా కాకుండా పంటలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసు కోకపోవడంతో నీరు వృథా అవుతున్నట్లు తెలుస్తోంది. తగ్గుతున్న నీటిమట్టం ఆయకట్టుకింద సాగు చేస్తున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్ర మక్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1402.5 అడుగులతో 14.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
తడారిపోతోంది
ఆలస్యమవుతున్న రబీ నాట్లు ఇప్పటి వరకూ 50 శాతమే పూర్తి ఏప్రిల్ 20 వరకు నీరు అవసరం మహా అయితే మార్చి ఆఖరు వరకే ఇస్తామంటున్న అధికారులు ఆందోళనలో అన్నదాతలు ఒకవైపు రబీ సాగు మందకొడిగా సాగుతుండగా.. మరోవైపు గోదావరిలో ఇన్‌ఫ్లో రోజురోజుకూ పడిపోతోంది. ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, కేవలం సగం ఆయకట్టులో మాత్రమే పడ్డాయి. నెలాఖరు వరకు నాట్లు పడే అవకాశముండడంతో ఏప్రిల్ 20 వరకు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ఏప్రిల్ ఒకటి నాటికి కాలువలు మూసి, ఆధునికీకరణ పనులు చేస్తామని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో రబీ వరి నాట్లు ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. సుమారు 3.77 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరగాల్సి ఉండగా 1.80 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. నాట్లు పూర్తయిన చోట కూడా వెదజల్లు విధానమే ఎక్కువగా ఉండడం విశేషం. తూర్పుడెల్టాలో 1.33 లక్షల ఎకరాల్లో, మధ్యడెల్టాలో 39 వేల ఎకరాల్లో, మెట్టలో 8,600 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉన్న గోదావరి డెల్టాల్లోని శివారు ఆయకట్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు డెల్టాల పరిధిలోని కరప, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు సబ్డివిజన్ల పరిధిలో నాట్లు 20 శాతం కూడా పూర్తి కాలేదు. ఆలస్యం అయిన ప్రాంతాల్లో నారుమడులు కాకుండా వెదజల్లు పద్ధతిని అవలంబించాలని అధికారులు చెబుతున్నా కొంతమంది రైతులు నారుమడులు వేస్తుండడం గమనార్హం. ఇలా అయితే సాగు చివరి సమయంలో నీటి ఎద్దడి తప్పదని వ్యవసాయ శాఖాధికారులు మొత్తుకుంటున్నా ఫలితం లేకపోతోంది. సాగులో జాప్యాన్ని బట్టి ఏప్రిల్ 15 వరకు సాగునీరందించక తప్పని పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ గేట్ల మూసివేత.. ఇన్‌ఫ్లో స్వల్పంగాా తగ్గడం, నాట్లు వేస్తున్నందున నీటి విడుదల పెంచాల్సి రావడంతో రెండు రోజుల క్రితం అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్‌లోని 175 క్రస్ట్‌గేట్లను మూసి సముద్రంలోకి నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 12,800 క్యూసెక్కులు కాగా వచ్చిన నీటిని వచ్చినట్టు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. దీనిలో సీలేరు పవర్‌డ్రాప్ నుంచి వస్తున్న నీరే సుమారు 4,500 క్యూసెక్కులు కావడం గమనార్హం. తూర్పుడెల్టాకు 3,300, మధ్యడెల్టాకు 2,500, పశ్చిమ డెల్టాకు ఏడు వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని సీలేరు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్కడ ఉత్పత్తిని తగ్గించడం వల్ల తదనుగుణంగా నీటి విడుదల కూడా తగ్గుతుంది. ఇదే సమయంలో సహజ జలాల రాక ఇప్పుడున్నదానికన్నా మరింత తగ్గే అవకాశముండడంతో ఈ రెండు నెలల్లో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. రబీ షెడ్యూల్పైఅవగాహన లేని అధికారులు సాగు ఆలస్యం అవుతుండడం వల్ల రెండు డెల్టాలకు ఏప్రిల్ 20 వరకు నీరిస్తేనే రైతులు గట్టెక్కుతారు. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం మార్చి 15 వరకు, తప్పదంటే మార్చి నెలాఖరు వరకు మాత్రమే నీరిస్తామని పాతపాటే పాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే కాలువలకు 75 రోజులు క్లోజర్ ప్రకటించి ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని కాకినాడలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు ఇరిగేషన్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. రబీసాగు షెడ్యూల్‌పై అవగాహన లేకుండా ఇటువంటి హామీలు ఇవ్వడం ద్వారా అధికారులు తమను గందరగోళానికి గురి చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. -
రబీజోరు
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో సాగైన జొన్న వరి సాగూ పెరిగే అవకాశం ఈ సీజన్పైఅన్నదాతల ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీసాగు జిల్లాలో వడివడిగా సాగుతోంది. గత సీజన్లో కురిసిన అతి వృష్టితో పంటలు పోయి కుదేలైన రైతాం గం రబీపైనే రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టులేవీ లేకపోవడంతో రైతాంగం మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. ఇటీవల జిల్లాలో కురిసినవర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో రబీ సాగుపై రైతులకు ధీమా పెరిగింది. ఫలితంగా సాగు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 42,287 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసింది. అయితే ఇప్పటివరకు సాధారణ విస్తీర్ణంలో 65 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జొన్నసాగు జోరు జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 42,287 హెక్టార్లు. అయితే ఇప్పటికి 25,186 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే 27,550 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో జొన్న పంట అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. జిల్లాలో జొన్న పంట సాధారణ విస్తీర్ణం 5,238 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు రెట్టింపు స్థాయిలో 11,852 హెక్టార్లలో సాగైంది. మరోవైపు శనగ, వేరుశనగ పంటల సాగు ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి రైతులు నారు మడులతో సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల నాట్లు మొదలయ్యాయి. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో వరిపంట కూడా అధిక విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది. -
రబీకి ‘సాగర్’భరోసా
నిజాంసాగర్, న్యూస్‌లైన్: జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండ లా కళకళలాడుతుండడంతో అన్నదాతలు ఈ జలాశయంపై ఆశలు పెట్టుకున్నారు. రబీకి నీరివ్వడానికి అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. వారం రోజుల్లో ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. వరుణుడు కరుణించడంతో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండాయి. నెల క్రితం వరకు వర్షాలు కురువడంతో ఇప్పటికీ రికార్డు స్థాయిలో నీరు నిల్వ ఉంది. నాలుగేళ్లలో నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటం ఇదే ప్రథమం. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు నీరందుతుందని ఆశి స్తున్నారు. ప్రధాన కాలువ చివరి ఆయకట్టు ప్రాంతం వరకు రబీలో సుమారు 2.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రబీ పంటల సాగుకోసం అన్నదాతలు సైతం సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, బీర్కూర్, కోటగిరి, బోధన్, బాన్సువాడ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేశారు. డిస్ట్రిబ్యూటరి 28 పరిధిలో సుమారు 400 వందల ఎకరాల్లో శనగ, పొద్దుతిరుగుడు పంటల సాగుకోసం సాగర్ నీటితడులు అవసరం ఉన్నాయి. దీంతో ప్రాజెక్టునుంచి నీటిని వదలాలంటూ పలు మండలాల్లో ఆందోళనలు చేశారు. నాలుగు విడతల్లో.. ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద సాగు చేయనున్న పంటలకు నాలుగు విడతల్లో నీటిని విడుదల చేయాలని ఇటీవల నిర్వహించిన డీఐబీ సమావేశంలో తీర్మానించారు. ఒక్కో విడతలో 2 టీఎంసీల చొప్పున నీటిని 15 రోజుల పాటు విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,405.2 అడుగులతో 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
‘నల్లవాగు’... నిష్ఫలం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు రైతన్నకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోతోంది. 5,300 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు కా ల్వలు, తూములు శిథిలం కాగా, మరమ్మతులు చేయిం చాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు నీరందించలేకపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ అవి చివరి ఆయకట్టు వరకూ పారని పరిస్థితి నెలకొంది. శిథిలమైన తూములు, కూల్వల్లో పిచ్చిమొక్కలు భారీగా ఉండడంతో నల్లవాగు ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టసాధ్యంగా మారింది. దీనికి తోడు ఇటీవలే సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నల్లవాగు ఆయకట్టును 4,500 ఎకరాలకే కుదించడం కూడా రైతన్నకు అశనిపాతంగా మారింది. ముందస్తు చర్యలు శూన్యం.. రబీ సాగు కోసం ఈ నెలాఖరు నాటికి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైన నీటి పారుదల శాఖ అధికారులు, శిథిలావస్థకు చేరుకున్న నల్లవాగు తూములు, కాల్వల మరమ్మతులను మాత్రం మరచిపోయారు. 2009-10లోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.14.19 కోట్లు మంజూరు చేసి నల్లవాగు కాల్వలను ఆధునీకరించారు. అయితే పనుల్లో నాణ్యత లోపించడంతో రెండేళ్లలోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం సీసీ లైనింగ్ పగిలి కాల్వలు ధ్వంసం కాగా, సిమెంట్ కట్టడాలు బీటలువారాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు రైతులు సాగునీటి కోసం సిమెంట్ కట్టడాలను ధ్వంసం చేసి తొందరపాటు చర్యలకు పాల్పడ్డారు. పనుల్లో నాణ్యత లేక పోచాపూర్, బిబిపేట, ఖాజాపూర్ రోడ్డు, మార్డి, కృష్ణపూర్ వద్ద సిమెంట్ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. కొన్ని చోట్ల కాల్వల మధ్య పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఫలితంగా చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రాజెక్టు స్థితి గతి మారకపోవడంతో అయకట్టు కింది రైతులు బోర్లు తవ్వుకుంటున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు ముందుగానే శిథిలమైన కాల్వలు, తూములకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టు నేపథ్యమిది... కల్హేర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 1493 అడుగులు. ప్రాజెక్టు కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బిబిపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. కలెక్టర్ కు నివేదిస్తాం నల్లవాగు కాల్వలను వెంటనే మరమ్మత్తులు చేయిస్తాం. కాల్వలు ధ్వంసం కావడంతో ఆయకట్టుకు నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తాయి. కాల్వల్లో పిచ్చి మొక్కలు, నాచు ఉంది. కలెక్టర్‌కు నివేదించి వెంటనే పనులు చేపడతాం. నీటి సరఫరాలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటాం. -ధన్‌రాజ్, ఇరిగేషన్ డీఈఈ -
కోయిల.. ఇలా!
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.. రైతుల వర ప్రసాదిని. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలకళతో ఉట్టిపడుతోంది. రబీ పంటలు సాగుకు ఈ నెల 15 నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే అవి పొలాలకు వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. తూములు పగిలిపోయి, పిల్ల కాల్వల్లో పూడిక ఉండటంతో నీరంతా వృథాగా పోయే పరిస్థితులు కానవస్తున్నాయి. ప్రాజెక్టులో షెట్టర్ల లీకేజీలు ఆయకట్టు సాగుపై ప్రభావాన్ని చూపుతున్నారుు. దేవరకద్ర, న్యూస్‌లైన్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద రబీ సీజన్లో కుడి, ఎడమ కాలువల కింద 12 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. కుడి కాల్వ కింద చిన్నచింతకుంట, ధ న్వాడ మండలాల్లోని 9 వేల ఎకరాలు, ఎ డమ కాలువ కింద దేవరకద్ర మండలంలోని 3 వేల ఎకరాల వరకు సాగవుతా యి. లోతట్టు భూముల్లో వరి, మెట్ట పొ లాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే వి ధంగా అధికారులు ప్రణాళికను రూపొం దిస్తారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టులో 31 అ డుగు నీరు చేరింది . ప్రస్తుతం అర అ డు గు తగ్గి ప్రస్తుతం 30.6 అడుగుల నీటి మ ట్టం ప్రాజెక్టులో ఉన్నది. వర్షాలు తగ్గుము ఖం పట్టడంతో ఇక నీటి మట్టం పెరి గే అ వకాశం లేదు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 32.6 అడుగులు కాగా, మ రో రెం డ డుగుల నీరు తక్కువగా ఉంది. వర్షాకా లం పూర్తి కావడంతో ఇక ప్రాజెక్టు నిం డడం సాధ్యం కాక పోవచ్చు. ఇదీ ప్రణాళిక.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఈ నెల 15 నుంచి విడుదల చేయడానికి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఐడీబీ సమావేశంలో ఖరారు చే శారు. ఐదు విడతలుగా నీటిని వదలడానికి ప్రణాళికను రూపొందించారు. ప్రతి సారి 20 రోజుల పాటు నీటిని విడుదల చేసి కొంతవిరామం ఇచ్చిన తరువాత మ రో తడిని వదలడానకి నిర్ణయించారు. నీ టి మట్టం తక్కువగా ఉన్నందున 10 వేల లోపు ఎకరాల్లో రబీ సీజన్ కింద పం ట లు పండించే అవకాశం ఉంది. వరి పం టలు 290 ఎకరాలు, 9513 ఎకరాల్లో ఆ రుతడి పంటలు సాగు చేయడానికి నీటీని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. చి‘వరి’కి అన్యాయం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి వచ్చినప్పడు చివరి ఆయకట్టు భూముల రైతులకే ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉం డడం, పెద్ద కాల్వలకు, చిన్న కాల్వలకు తూములు పగిలి పోవడంతో అందడం లేదు. దేవరకద్ర మండలంలోని ఎడమ కాలువ కింద దేవరకద్ర, బల్సుపల్లి, గూరకొండ, గోప్లాపూర్, నార్లోనికుంట తదితర గ్రామాలకు అరకొరగా సాగునీరందే అవకాశం ఉంది. కుడి కాల్వ కింద ధన్వాడ మండలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టు భూములకు నీరందుతుంది. అయితే చిన్నచింతకుంట మండలంలోని చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా పెట్టుకోవాల్సి వస్తోంది. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ముందుగా చివరి ఆయకుట్టు రైతులకు, ఆ తరువాత మిగతా పొలాల వారికి నీరు అందించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చివరి ఆయకుట్టు రైతులు అన్యాయానికి గురువతూనే వస్తున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు చాల చోట్ల తూములకు షెట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. అలాగే పిల్ల కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో నీరంతా వృథాగా వాగుల్లోకి వెళ్లిపోతోంది. ఏటా అదే నిర్లక్ష్యం.. ప్రతీ సంవత్సరం నీరు వదలడానికి తేదీ ఖరారు అయిన తరువాత చివరి క్షణంలో అధికారులు హడావుడి చేస్తారు. కాలువల మర్మతులు చేస్తాం.. పేరుకు పోయిన మట్టిని తీసివేస్తాం అని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మూసుకుపోయిన పిల్ల కాలువలను బాగు చేస్తామంటారు. అయితే ఎప్పుడూ పనులు చేపట్టిని దాఖలాలు లేవు. వర్షాకాలం వెళ్లి రెండు నెలలు గడుస్తున్నా.. ప్రాజెక్టు లీకేజీల నివారణకు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ప్రతీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ ఏడాది నీటి విడుదలకు ముందే కాలువల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
కష్టాల నడుమ రబీకి రెడీ
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్ : జిల్లాలో మూడు ఏళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల పాలవుతున్న రైతన్న తరతరాలుగా చేస్తున్న సాగును వదులుకోలేక కష్టాల మధ్య రబీకి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలను చవిచూసిన అన్నదాత ఆశలన్నీ రబీపైనే పెట్టుకొన్నాడు. కొంత మంది రైతులు ఇప్పుడిప్పుడే సాగుకు సన్నద్ధమవుతుండగా, మరి కొంతమంది రైతులు ఇప్పటి కే సాగు చేపట్టారు. ఖరీప్ సీజన్లో వరి పం టను ఎక్కువగా సాగు చేసే రైతులు రబీలో మాత్రం మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలపై దృష్టి సారిస్తున్నారు. చెరువులే ఆధారం ఇటీవల అధికంగా కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరింది. జిల్లాలో తొమ్మిది వేల చెరువులున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి వరి పంటకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోతుండడంతో రైతులు చెరువులపైనే అధారపడి రబీలో పంటలను వేస్తున్నారు. జిల్లాలో తాటిపూడి, జంఝావతి, ఆండ్ర రిజర్వాయర్లున్నాయి. వీటి ద్వారానే ఖరీప్‌లో వరి, ఇతర పంటలకు నీరు అందిస్తారు. అయితే రబీలో మాత్రం వరి పంటకు నీరు పూర్తి స్థాయిలో ఇవ్వడంలేదు. వీటి పరిధిలో 200 హెక్టార్లుకు మించి వరి పంటకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో అధిక శాతం చెరువులపైనే అధారపడి రబీలో పంట వేశారు. మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలకు సరిపడా నీటిని మాత్రమే విడుదలచేస్తున్నారు. రబీకి సంబంధించి వ్యవసాయశాఖ కూడా విత్తనాలును సిద్ధం చేసింది. అపరాలపైనే ఆసక్తి రైతులు ఎక్కువుగా మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రబీసీజన్‌లో వరి పంట సాధరణ విస్తీర్ణం 4,080 హెక్టార్లు కాగా, మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 9,885 హెక్టార్లు, కంది 11,286 హెక్టార్లు, పెసర 15,463 హెక్టార్లు, మినుము 15, 477 హెక్టార్లు. విత్తన కేటాయింపు వివరాలు వరి పంటకు సంబంధించి 1010 రకం 6,400 క్వింటాళ్లు కేటాయించగా 2,500 క్వింటాళు ్లజిల్లాకు వచ్చాయి. మొక్కజొన్న 1000 క్వింటాళ్లుకు గాను 150 క్వింటాళ్లు, వేరుశెనగ మూడు వేల క్వింటాళ్లుకుగాను 1450 క్వింటాళ్లు, మినుము 3700 క్వింటాళ్లకు గాను 673 క్వింటాళ్లు, పెసర 450 క్వింటాళ్లకుగాను 293 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయి. రాయితీ వివరాలు: 1010 రకం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ. 690 కాగా రూ.150 రాయితీ పోను రూ.540కి ఇస్తారు. మినుము కేజీ ధర రూ. 58 కాగా, రాయితీ రూ. 29 పోను రూ.29కు, పెసర కేజీ ధర రూ.72 కాగా, రాయితీ రూ.34 పోను రూ. 38కు. మొక్కజొన్న కేజీ ధర రూ.125కాగా, రాయితీ రూ.25 పోను రూ.100కి చెల్లిస్తారు. శెనగ ధర రూ.49.65కాగా రూ.26.35 రాయితీ పోను23.30 కి చెల్లిస్తారు. ప్రతీ ఏడాది నష్టాలే మూడేళ్లగా నష్టాలు తప్పడంలేదు. ఖరీప్‌లో ప్రతీ ఏడాది వరి పంట వేస్తున్నాం. అయితే మూడు ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఈఏడాది ఖరీప్‌లో వరి పంట వేశాను వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల పంట ఎండిపోయింది. రబీలో వరి పంట వేయకూడదని నిర్ణయించుకున్నాను. పెసర పంట వేయాలని నిర్ణయించుకున్నాను. - కర్రి అప్పలనాయుడు, రైతు రాకోడు వరి కలిసిరావడం లేదు వరి పంట కలిసిరావడం లేదు. ఖరీప్‌లో ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితిలేదు. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. రబీలో ఎకరం పొలంలో తేలిక పాటి వరి పంట వేయాలని అనుకుంటున్నాను. మిగిలిన రెండు ఎకరాల్లో మినుము పంట వేస్తాను - ఎస్.రామునాయుడు, రైతు, పినవేమలి రబీ పైనే ఆశలన్నీ రబీపైనే ఆశపెట్టుకున్నాను. నాకున్న రెండు ఎకరాలు పొలంలో ఖరీప్ సీజన్లో వరి పంట వేశాను. పెద్దగా కలిసిరాలేదు. రబీలోనైనా నష్టాన్ని భర్తీ చేసుకోవాలని పెసర పెంట వేయాలని నిర్ణయించుకున్నాను. ఇటీవల కురిసిన వర్షాలు వల్ల చెరువుల్లో నీరుచేరింది. -పి. అప్పారావు, రైతు, పెదవేమలి -
రబీ ఆశలపై నీళ్లు
కర్నూలు(కలెక్టరేట్/రూరల్), న్యూస్‌లైన్: కాల్వల కింద రబీ పంటల సాగుపై రైతన్న ఆశలను ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీరుగార్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా, నదులు భారీగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు నిండినా రబీ పంటలకు అత్తెసరు నీటితో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతు ప్రయోజనాలపై చర్చించింది నామమాత్రమే అయినా.. వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులు నీటి పారుదల శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రులతో కలిసి ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఎల్లెల్సీ నీటి విడుదలపై సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న నీటి చౌర్యంపై ఎల్లెల్సీ నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు పి.సాయిబాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లెల్సీ కింద కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో మిరప, పత్తి లక్ష ఎకరాల్లో ఉందని, ఈ పంటలకు విధిగా డిసెంబర్ 15 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుబాటులోని నీటితో మంచినీటి అవసరాలు తీరుస్తూ ఇప్పటికే వేసిన 50వేల ఎకరాల పంటలకు నీరిచ్చేందుకు మంత్రులు, అధికారులు అంగీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హెచ్ఎల్సీ నీటిని వాటా మేరకు రాబట్టుకుంటున్నారని, మన జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కోటా మేరకు నీటిని రాబట్టలేకపోతున్నారని.. ఇది చేతగాని తనమేనని సాయిబాబు తదితరులు ఘాటుగా విమర్శించారు. దీనిపై మంత్రి ఏరాసు స్పందిస్తూ ‘‘మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో చర్చించాం. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ముగ్గురు, రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇందువల్ల న్యాయం పొందలేకపోతున్నాం’ అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంకు కూడా ఇదే విషయమే ప్రధానంగా చెప్పామని తెలిపారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే ఉన్నా వెలుగోడు రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంలో పూర్తిగా నీరున్నా మన ప్రాంతానికి 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామన్నారు. ఎస్సార్బీసీ సర్కిల్-1 ఎస్ఈ, ఈఈ, హంద్రీనీవా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పని లేక ఇక్కడికి వచ్చామా అంటూ గైర్హాజరైన వారికి చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రులు టీజీ, ఏరాసులు కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి టీజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు రూ.530 కోట్లు నిధులున్నాయని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వీటి ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ సీఈ సుబ్బారావు, ఎస్ఈ నాగేశ్వరరావు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, జీడీపీ తదితరులు పాల్గొన్నారు.