కోయిల.. ఇలా! | Koil Sagar project .. Vara Prasada farmers. Powered by winning | Sakshi
Sakshi News home page

కోయిల.. ఇలా!

Published Fri, Dec 13 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

కోయిల.. ఇలా!

కోయిల.. ఇలా!

 కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.. రైతుల వర ప్రసాదిని. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలకళతో ఉట్టిపడుతోంది. రబీ పంటలు సాగుకు ఈ నెల 15 నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే అవి పొలాలకు వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. తూములు పగిలిపోయి, పిల్ల కాల్వల్లో పూడిక ఉండటంతో నీరంతా వృథాగా పోయే పరిస్థితులు కానవస్తున్నాయి. ప్రాజెక్టులో షెట్టర్ల లీకేజీలు ఆయకట్టు సాగుపై ప్రభావాన్ని చూపుతున్నారుు.
 
 దేవరకద్ర, న్యూస్‌లైన్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద రబీ సీజన్‌లో  కుడి, ఎడమ కాలువల కింద 12 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. కుడి కాల్వ కింద చిన్నచింతకుంట, ధ న్వాడ మండలాల్లోని 9 వేల ఎకరాలు, ఎ డమ కాలువ కింద దేవరకద్ర మండలంలోని 3 వేల ఎకరాల వరకు సాగవుతా యి. లోతట్టు భూముల్లో వరి, మెట్ట పొ లాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే వి ధంగా అధికారులు ప్రణాళికను రూపొం దిస్తారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టులో 31 అ డుగు నీరు చేరింది . ప్రస్తుతం అర అ డు గు తగ్గి ప్రస్తుతం 30.6 అడుగుల నీటి మ ట్టం ప్రాజెక్టులో ఉన్నది. వర్షాలు తగ్గుము ఖం పట్టడంతో ఇక నీటి మట్టం పెరి గే అ వకాశం లేదు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 32.6 అడుగులు కాగా, మ రో రెం డ డుగుల నీరు తక్కువగా ఉంది. వర్షాకా లం పూర్తి కావడంతో ఇక ప్రాజెక్టు నిం డడం సాధ్యం కాక పోవచ్చు.
 
 ఇదీ ప్రణాళిక..
 ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఈ నెల 15 నుంచి విడుదల చేయడానికి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఐడీబీ సమావేశంలో ఖరారు చే శారు. ఐదు విడతలుగా నీటిని వదలడానికి ప్రణాళికను రూపొందించారు. ప్రతి సారి 20 రోజుల పాటు నీటిని విడుదల చేసి కొంతవిరామం ఇచ్చిన తరువాత మ రో తడిని వదలడానకి నిర్ణయించారు. నీ టి మట్టం తక్కువగా ఉన్నందున 10 వేల లోపు ఎకరాల్లో  రబీ సీజన్ కింద పం ట లు పండించే అవకాశం ఉంది. వరి పం టలు 290 ఎకరాలు, 9513 ఎకరాల్లో ఆ రుతడి పంటలు సాగు చేయడానికి నీటీని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
 
 చి‘వరి’కి అన్యాయం
  ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి వచ్చినప్పడు చివరి ఆయకట్టు భూముల రైతులకే ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉం డడం, పెద్ద కాల్వలకు, చిన్న కాల్వలకు తూములు పగిలి పోవడంతో అందడం లేదు. దేవరకద్ర మండలంలోని ఎడమ కాలువ కింద దేవరకద్ర, బల్సుపల్లి, గూరకొండ, గోప్లాపూర్, నార్లోనికుంట తదితర గ్రామాలకు అరకొరగా సాగునీరందే అవకాశం ఉంది. కుడి కాల్వ కింద ధన్వాడ మండలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టు భూములకు నీరందుతుంది. అయితే చిన్నచింతకుంట మండలంలోని చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా పెట్టుకోవాల్సి వస్తోంది. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ముందుగా చివరి ఆయకుట్టు రైతులకు, ఆ తరువాత మిగతా పొలాల వారికి నీరు అందించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చివరి ఆయకుట్టు రైతులు అన్యాయానికి గురువతూనే వస్తున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు చాల చోట్ల తూములకు షెట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. అలాగే పిల్ల కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో నీరంతా వృథాగా వాగుల్లోకి వెళ్లిపోతోంది.
 
 ఏటా అదే నిర్లక్ష్యం..
 ప్రతీ సంవత్సరం నీరు వదలడానికి తేదీ ఖరారు అయిన తరువాత చివరి క్షణంలో అధికారులు హడావుడి చేస్తారు. కాలువల మర్మతులు చేస్తాం.. పేరుకు పోయిన మట్టిని తీసివేస్తాం అని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మూసుకుపోయిన పిల్ల కాలువలను బాగు చేస్తామంటారు. అయితే ఎప్పుడూ పనులు చేపట్టిని దాఖలాలు లేవు. వర్షాకాలం వెళ్లి రెండు నెలలు గడుస్తున్నా.. ప్రాజెక్టు లీకేజీల నివారణకు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ప్రతీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ ఏడాది నీటి విడుదలకు ముందే కాలువల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement