Koil Sagar project
-
పర్యాటక కేంద్రం కలేనా?
దేవరకద్ర రూరల్ : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని పర్యాటకులు కోరుతున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని అంటున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఎండకు ఇబ్బందిపడుతున్నామని అభిప్రాయపడుతున్నారు. నిత్యం వందల మంది పర్యాటకులు ఇక్కడి వస్తున్నారు. కుటుంబంతో ప్రశాంతంగా గడిపేందుకు అనువుగా లేకపోవడంతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. పక్కనే ఉన్న గెస్ట్‌హౌజ్ కూడా శిథిలావస్థకు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వమైనా సమస్యలపై దృష్టి పెట్టాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 1947లో నిర్మాణం.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1947నుంచి 1955 మధ్యకాలంలో నిర్మించారు. 12వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కేవలం వర్షంపైనే ఆధారపడి ఉంది. రెండు గుట్టల మధ్య, ధన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 1955లో అప్పటి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎం.ఖర్జు ప్రాజెక్టు నీటిని మొట్టమొదటిసారి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు విడుదల చేశారు. నెరవేరని మంత్రి హామీ. గత ఏడాది కోయిల్‌సాగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. కోయిల్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ హామీగానే ఉండిపోయింది. ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించాలని పర్యాటకులు, ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి బాధాకరం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించాలి. గత కొన్నేళ్లుగా అక్కడ పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. జిల్లాలో పేరెన్నిక గన్న ప్రాజెక్టు వద్ద ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరం. – అయ్యపురెడ్డి, దేవరకద్ర పాలకులు స్పందించాలి ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చే విషయంలో పాలకులు వెంటనే స్పందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ప్రతి ఏటా పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెబుతున్నారు కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండరాదు. – ప్రభాకర్, దేవరకద్ర -
ఆనంద సాగరం
♦ మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు.. ♦ పెరగనున్న ఆయకట్టు మహబూబ్‌నగర్ నుంచి గంగాపురం ప్రతాప్‌రెడ్డి : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం రూ. 85 లక్షలతోనే పూర్తయిందంటే నమ్మలేం. కానీ ఇది నిజం. నిజాం కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 1947లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1955లో పూర్తి చేశారు. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 27 అడుగులు. ఎడమ కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టు మరింత పెంచి 50వేల ఎకరాలకు నీరందేలా చర్యలు చేపట్టారు. అందుకు తగ్గట్టు కాల్వల లైనింగ్, కొత్త కాల్వల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంట్ ఉపయోగించలేదు. కేవలం అప్పట్లో అందుబాటులో ఉన్న సున్నం, గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 62 సంవత్సరాలు కావస్తున్నా ప్రాజెక్టు నేటికి చెక్కుచెదరలేదు. 1981లో క్రస్టుగేట్ల నిర్మాణం.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఆధునికీకరించే పనులు 1981లో చేపట్టారు. అలుగుపై క్రస్టుగేట్ల నిర్మాణంచేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి రూ.92 లక్షల వ్యయం అయింది. వైఎస్సార్ వల్లే కృష్ణా జలాలు.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు చెప్పుకోదగిన వరద వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టు బోసిపోయి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఙంలో భాగంగా 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడానికి ఈ పథకం కోసం రూ. 359 కోట్లతో అంచనాలు తయారు చేయించారు. అంతేకాకుండా 12 వేల ఎకరాల ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచాలని ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఆయన చలువ వల్లే గత మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. పెరిగిన నీటి మట్టం.. ప్రాజెక్టు నిర్మాణం కన్నా క్రస్టు గేట్ల నిర్మాణానికే రూ.7 లక్షలు అధికంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. క్రస్టుగేట్ల నిర్మాణం తర్వాత ప్రాజెక్టులో 33 అడుగుల మేర నీటి మట్టం నిల్వ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆయకట్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది. ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్‌కు తరలివస్తున్న కృష్ణాజలాలు -
జూలై 31 లోపు పూర్తి చేయాలి
► ప్రాజెక్టుల పనులు వేగిరం చేయాలి ► జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు ► సాగునీరు అందించడమే లక్ష్యం ► పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేసి 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మహాత్మాగాంధీ, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్పె సమీక్షానిర్వహించారు. లిఫ్ట్‌లు పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేయాలన్నారు. చివరి ఆయకట్టు పొలాల వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ సమస్య లేకుండా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం అందించడంలో జాప్యం చేయరాదన్నారు. రోడ్ కటింగ్ అవసరమున్న ప్రాంతాల్లో ఆర్ఆండ్బి, పీఆర్ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు. సమస్య వచ్చిన ప్రాంతాలకు సంబంధింత ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి సమస్య పరిష్కరించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఎంజీఎల్ఐలో 28వ ప్యాకేజీలో మొత్తం ఆయకట్టు 57 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలకు సంబందించి ఫీల్డ్ చానెల్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెంట్లవెల్లి, చౌటబట్ల గ్రామాల్లో రైతులను ఒప్పించి ఫీల్డ్ చానెల్ పనులు పూర్తి చేయాలన్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో చేపడుతున్న ప్యాకేజీల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ ఖగేందర్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, ఎస్ఈలు, ఈఈలు, ఆర్డీఓలు, వివిధ ప్యాకేజీల్లో పనులు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నీళ్లివ్వండి.. మహాప్రభో!
► నీటిని విడుదల చేయాలని కోయిల్‌సాగర్ ► రైతుల ఆందోళనచేతికందే దశలో వరి ► సాగునీటిని విడుదల చే స్తే తాగునీటి సమస్య తీరుతుందని ఆశ ► నేడు మరోసారి రైతుల ఆందోళన దేవరకద్ర: చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. బోరుబావులు ఎండిపోవడంతో తాగునీళ్లు మూగజీవాలు గోదరిల్లుతున్నాయి.. చెంతనే నీళ్లున్నా వాడుకోలేని దుస్థితిచూసి రైతుల గుండెలు మండిపోతున్నాయి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పడుతున్నారు. ఈ క్రమంలో వారంరోజులు క్రితం రైతు లు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ముట్టడించి, షట్టర్లను బద్దలుకొట్టి నీటిని విడుదల చేశారు. రైతులు నీటికోసం యుద్ధవాతావరణం సృష్టించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గేట్లను మూయించారు. అయితే నీటిని వదిలే ప్రసక్తేలేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ మండలాల పరిధిలో 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, రబీ సీజన్లో ఐదువేల ఎకరాల్లో వరిపంటలు సాగుచేశారు. సీజన్‌కు ముందుగానే అధికారులు రబీ కింద వరి పంటలు వేయొద్దని సూచించినా ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాల రైతులు బోరుబావులపై ఆధారపడి వరిపైరును వేశారు. తీరా పంట పొట్టదశలోకి చేరుకున్నాక నీటివనరులు ఎండిపోయాయి.చేతికందేదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ వచ్చారు. కాల్వల ద్వారా నీటిని వదిలితే ఉన్న దశలో పంటల గట్టెక్కే అవకాశం ఉంది. కొంతనీరు వాగులో ప్రవహించి సమీపగ్రామాలకు తాగునీటి గోస ఉండదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12 అడుగుల మేర నీరు ఉండగా.. రెండు తడులకు వదిలితే నాలుగు అడుగుల నీరు వినియోగమవుతోంది. మిగ తా 8 అడుగుల నీటిని పాలమూరు పట్టణానికి ఈ రెండునెలల పాటు అందించవచ్చు. జిల్లాకేంద్రం కోసం.. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకేంద్రానికి తాగునీటిని అందిస్తున్నారు. రామన్‌పాడ్ తాగునీటి పథకం ద్వారా అందిస్తున్న నీరు ఇప్పటికే తగ్గిపోయింది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఒక్కటే ఆధారం. భూగర్భజలాలు తగ్గినందున వచ్చే రెండు నెలలకు నీళ్లను సరఫరా చేసేందుకు అధికారులు కాపాడుతూ వస్తున్నారు. రబీ పంటలకు నీళ్లను విడుదల చేస్తే మున్ముందు సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
త్వరలో కేఎస్పీకి జూరాల నీళ్లు
రాజన్న కల సాఫల్యం కానుంది. మహబూబ్‌నగర్ పట్టణవాసుల దాహార్తిని తీర్చేందుకు ఆయన చేపట్టిన కోయిల్ సాగర్ పైపులైనుకు డ్రై ట్రయల్ రన్‌ను అధికారులు సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, కొన్ని ప్రాంతాలకు సాగునీరు వచ్చేనెలనాటికి అందనుంది. పాలమూరు, మరికల్ న్యూస్‌లైన్: ఫిబ్రవరిలో జూరాల బ్యాక్ వాటర్‌ను కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్ట్ ఎసీఈ శ్రీరామకృష్ణ, ఏఈ కె.కరుణకర్‌రెడ్డిలు తెలిపారు. సోమవారం సాయంత్రం నర్వ మండలం ఉద్యాల సమీపంలో చేపడుతున్న స్టేజీ 1లో 7.5 మోగవాట్స్ సామర్థ్యం గల పంపునకు విజయవంతంగా ప్రాజెక్ట్ ఆధికారులు ట్రయల్న్ ్ర నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ స్టేజీ 1,2లో రెండు 7.5 మోగవాట్స్ సామర్థ్యం గల మోటార్లు ట్రాయాల్న్ ్ర మొదటి పేజీ తరువాయి పూర్తికావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో స్టేజీ 1దగ్గర జూరాల బ్యాక్ వాటర్ పంపింగ్‌కు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.పది రోజుల్లో ఒక పంపు ద్వారా జూరాల నీటీని ట్రాయిల్న్ ్రనిర్వహించి. మరో పది రోజుల్లో స్టేజీ 2 దగ్గర నీటి పంపింగ్ చేపడతామన్నారు. మొదటి ప్రయత్నంగా రెండు మోటార్ల ద్వారా నీటి పంపింగ్ పూర్తయిన వెంబడే మిగతా రెండు 7.5 మెగావాట్స్ సామర్థ్య గల మోటార్ల బిగింపు పనులు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి స్థాయిలో నీటిని తోడేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు.ఈకార్యక్రమంలో బిహెఎల్ ఆధికారి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆధికారులు సీద్ధీక్, మెహన్‌రెడ్డి,పురోషత్తంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరుకు తీరనున్న దాహం పాలమూరు పట్టణ ప్రజలను ఏళ్లతరబడి తాగునీటి సమస్యకు తగిన పరిష్కారం చూపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి నిలిపి 2005లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించారు ఆయన మరణానంతరం ఏళ్లతరబడి జాప్యం నెలకొంది. నిధుల మంజూరులో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ.. ఉన్న నిధులతోనే నిర్మాణ పనులను జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు తుది దశకు చేర్చారు. ఈ నేపథ్యంలోనే డ్రై రన్ ప్రక్రియ కూడా ప్తూయింది. రామన్‌పాడు పథకం పుణ్యమా అని కొంతమేరకు ఇబ్బంది తొలగినా పూర్తి స్థాయిలో పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావడంతో అయోమయం తొలగి పోయింది. ఈ వేసవిలో పట్టణ వాసులకు తాగునీటి సమస్య దూరమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చివరి అంకానికి చేరుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు సమృద్ధిగా అందితే మహానేత కల సాకారం అవుతుందని ఆయన అభిమానులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఇలా..! కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 3.90 టీఎంసీల నీటిని వినియోగానికి తీసుకురావాల్సి ఉంటుంది. 50,250 ఎకరాల మేర సాగునీటిని మళ్లించాలి. అంతే కాకుండా పాలమూరు పట్టణంలోని దాదాపు 3 లక్షల జనాభాకు సరిపడ తాగునీటిని ఇవ్వాలి. జూరాల బ్యాక్ వాటర్ పరిధిలో నిర్మించే రెండు లిఫ్టుల ద్వారా నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 360.18 కోట్లు తొలి దశలో నిధులు సమృద్ధిగా విడుదలైనప్పటికీ.. ప్రస్తుతం రూ. 40 కోట్ల వరకు మంజూరు కావాల్సి ఉంది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2009లో పూర్తి కావాల్సి ఉండగా.. ఈ ఏడాది తుది దశకు చేరుకున్నాయి. పూర్తిస్థాయిలో నీరందించ గలిగితే మహబూబ్‌నగర్ పట్టణానికే కాకుండా హన్వాడ మండల ప్రజలకు కూడా తాగునీటిని అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, కొయిలకొండ, మక్తల్, నర్వ మండలాల పరిధిలో 50, 250 హెక్టార్లలో పంటల సాగుకు నీటిని వినియోగించేందుకు వీలవుతుంది. -
కోయిల.. ఇలా!
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.. రైతుల వర ప్రసాదిని. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలకళతో ఉట్టిపడుతోంది. రబీ పంటలు సాగుకు ఈ నెల 15 నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే అవి పొలాలకు వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. తూములు పగిలిపోయి, పిల్ల కాల్వల్లో పూడిక ఉండటంతో నీరంతా వృథాగా పోయే పరిస్థితులు కానవస్తున్నాయి. ప్రాజెక్టులో షెట్టర్ల లీకేజీలు ఆయకట్టు సాగుపై ప్రభావాన్ని చూపుతున్నారుు. దేవరకద్ర, న్యూస్‌లైన్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద రబీ సీజన్లో కుడి, ఎడమ కాలువల కింద 12 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. కుడి కాల్వ కింద చిన్నచింతకుంట, ధ న్వాడ మండలాల్లోని 9 వేల ఎకరాలు, ఎ డమ కాలువ కింద దేవరకద్ర మండలంలోని 3 వేల ఎకరాల వరకు సాగవుతా యి. లోతట్టు భూముల్లో వరి, మెట్ట పొ లాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే వి ధంగా అధికారులు ప్రణాళికను రూపొం దిస్తారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టులో 31 అ డుగు నీరు చేరింది . ప్రస్తుతం అర అ డు గు తగ్గి ప్రస్తుతం 30.6 అడుగుల నీటి మ ట్టం ప్రాజెక్టులో ఉన్నది. వర్షాలు తగ్గుము ఖం పట్టడంతో ఇక నీటి మట్టం పెరి గే అ వకాశం లేదు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 32.6 అడుగులు కాగా, మ రో రెం డ డుగుల నీరు తక్కువగా ఉంది. వర్షాకా లం పూర్తి కావడంతో ఇక ప్రాజెక్టు నిం డడం సాధ్యం కాక పోవచ్చు. ఇదీ ప్రణాళిక.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఈ నెల 15 నుంచి విడుదల చేయడానికి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఐడీబీ సమావేశంలో ఖరారు చే శారు. ఐదు విడతలుగా నీటిని వదలడానికి ప్రణాళికను రూపొందించారు. ప్రతి సారి 20 రోజుల పాటు నీటిని విడుదల చేసి కొంతవిరామం ఇచ్చిన తరువాత మ రో తడిని వదలడానకి నిర్ణయించారు. నీ టి మట్టం తక్కువగా ఉన్నందున 10 వేల లోపు ఎకరాల్లో రబీ సీజన్ కింద పం ట లు పండించే అవకాశం ఉంది. వరి పం టలు 290 ఎకరాలు, 9513 ఎకరాల్లో ఆ రుతడి పంటలు సాగు చేయడానికి నీటీని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. చి‘వరి’కి అన్యాయం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి వచ్చినప్పడు చివరి ఆయకట్టు భూముల రైతులకే ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉం డడం, పెద్ద కాల్వలకు, చిన్న కాల్వలకు తూములు పగిలి పోవడంతో అందడం లేదు. దేవరకద్ర మండలంలోని ఎడమ కాలువ కింద దేవరకద్ర, బల్సుపల్లి, గూరకొండ, గోప్లాపూర్, నార్లోనికుంట తదితర గ్రామాలకు అరకొరగా సాగునీరందే అవకాశం ఉంది. కుడి కాల్వ కింద ధన్వాడ మండలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టు భూములకు నీరందుతుంది. అయితే చిన్నచింతకుంట మండలంలోని చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా పెట్టుకోవాల్సి వస్తోంది. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ముందుగా చివరి ఆయకుట్టు రైతులకు, ఆ తరువాత మిగతా పొలాల వారికి నీరు అందించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చివరి ఆయకుట్టు రైతులు అన్యాయానికి గురువతూనే వస్తున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు చాల చోట్ల తూములకు షెట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. అలాగే పిల్ల కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో నీరంతా వృథాగా వాగుల్లోకి వెళ్లిపోతోంది. ఏటా అదే నిర్లక్ష్యం.. ప్రతీ సంవత్సరం నీరు వదలడానికి తేదీ ఖరారు అయిన తరువాత చివరి క్షణంలో అధికారులు హడావుడి చేస్తారు. కాలువల మర్మతులు చేస్తాం.. పేరుకు పోయిన మట్టిని తీసివేస్తాం అని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మూసుకుపోయిన పిల్ల కాలువలను బాగు చేస్తామంటారు. అయితే ఎప్పుడూ పనులు చేపట్టిని దాఖలాలు లేవు. వర్షాకాలం వెళ్లి రెండు నెలలు గడుస్తున్నా.. ప్రాజెక్టు లీకేజీల నివారణకు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ప్రతీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ ఏడాది నీటి విడుదలకు ముందే కాలువల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.